ఇస్లామోఫోబియా కాదు – గ్జెనోఫోబియా!!

గ్జెనోఫోబియా అంటే – తెలియని వాటి గురించిన భయం.

మీకొక వాట్సప్ మెసేజ్ వచ్చింది.
అమేజాన్ అడవుల్లో నివసించే అత్యంత విషపూరితమైన ఓ కప్పల జాతి గురించిన మెసేజ్ అది. మీరా మెసేజ్ ని క్యూరియాసిటీ కొద్దీ చదివి లైట్ తీసుకుంటారు తప్ప, అది చదివి భయపడటమో, ఆందోళన పడటమో చేయరు. దానిని, మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రండ్స్ కీ అదేపనిగా ఫార్వర్డ్ చేయరు.
డైనోసార్ల గురించి గానీ, అట్లాంటిక్ మహా సముద్రం లోతున నివసించే ప్రమాదకర తిమింగలాల గురించి గానీ, మేసేజ్ వచ్చినా, మీరు ఇలాగే రియాక్ట్ అవుతారు. లైట్ తీసుకుంటారు.

అదే హైదరాబాద్లోనో, బెంగులూర్లోనో ఎలుకలకి ఓ వైరస్ వచ్చిందని గానీ, అది మనుషులకి పాకితే తీవ్రమైన రోగాలొస్తాయని గానీ మెసేజ్ వస్తే, మీరు వెంటనే ఆ మెసేజ్ ని హైదరాబాద్/బెంగులూర్లలో ఉంటున్న మీ ఫ్రండ్స్ కి, బంధువులకి ఠపీమని ఫార్వర్డ్ చేస్తారు. ఫలానా ఏరియాల్లో ఉంటున్న హోటల్లలో, ఇలాంటి ఎలకల్నే చంపేసి, చికన్ బిరియానీలో కలిపి వండిస్తున్నారని మెసేజ్ వస్తే, ఆ ఏరియాలోని హోటల్లకు అస్సలెల్లొద్దని మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తారు. ఆ మెసేజ్ నిజమో కాదో, మీకు తెలీదు. ఒకవేల ఆ మెసేజ్ నిజం కాకుంటే, మీ ఫ్రెండ్స్ కొచ్చేనష్టం ఏమీలేదు. అదే గనక ఆ మెసేజ్ నిజమే ఐతే, అలాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేసి, మీ ఫ్రెండ్స్ జీవితాన్ని కాపాడినవారవుతారు. కాబట్టి, నిజమో కాదో తెలీకున్నా, మీరు ఆ మెసేజ్ ని పది మందికి ఫార్వర్డ్ చేయడానికే మొగ్గు చూపుతారు. ఆ పది మంది, ఇంకో వంద మందికి.. ఇలా ఆ మెసేజ్ వెల్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ అలాంటి మెసేజ్ నాకొచ్చినా, నేనూ అలాగే చేస్తాను. అది హ్యూమన్ సైకాలజీ.

ఇలాంటి మెసేజ్ ల వల్ల వచ్చే ఎండ్ రిజల్ట్ ఏమంటే – కష్టమర్లు ఎవరూ రాక, ఆ ఏరియాలోని హోటల్లన్నీ దివాలా తీస్తాయి. ఆ హోటల్లన్నీ ఓ పర్టికులర్ ఐడెంటిటీకి చెందినవారివై ఉంటే, దేశంలోని మెజారిటీ ప్రజల ఆరోగ్యం చెడగొట్టలనే లక్ష్యం తో, కావాలనే వాళ్ళలా చేస్తున్నారనీ ప్రచారం చేస్తే, వ్యాపారం దెబ్బతినడమే కాకుండా, మిగతా సమాజం మొత్తం వారిని శత్రువులుగా, అణుమానాస్పదంగా చూస్తుంది.

ఇలాంటి ఫేక్ వీడియో లు, ఎప్పుడో ఒకటీ,అరా వస్తే, వాటిని ఎవరో ఆకతాయిలు అత్యుత్సాహంతో తయారు చేస్తున్నారనుకోవచ్చు. కానీ, ఓ పర్టికులర్ వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఇబ్బడిముబ్బడిగా ఇలాంటి ఫేక్ వీడియోలు పుట్టుకురావడమే కాక, మెయిన్ స్ట్రీం మీడియా కూడా వీటి ఆధారంగా చర్చలు చేస్తుందంటే, ఇదంతా ఓ పథకం ప్రకారం ఎవరో పనిగట్టుకుని చేస్తున్నారని అర్థం. ముస్లింలు కరోనా వ్యాధిని వ్యాపింపచేస్తున్నారని ఇటీవల వైరల్ అయిన ఫేక్ వీడియోలన్నీ ఇలా వచ్చినవేనని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.

ఐనా, దేశంలోని ఓ బత్తాయి పార్టీ, దాని వెనకున్న సంఘాల బతుకింతేనని దేశంలో అందరికీ తెలిసిందే కాబట్టి, దీనిలో ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏమీ లేదు.

సరే, ఇప్పుడు ముస్లింల ముందున్న ఆప్షన్ లేమిటో చూద్దాం.

అలాంటి మెసేజ్ నాకొచ్చినా, నేను కూడా ఇంకో పది మందికి ఫార్వర్డ్ చేస్తానని చెప్పాను కదా. నేను ఫార్వర్డ్ చేయకుండా ఉండాలంటే, నన్ను ఆపగలిగే ఫ్యాక్టర్స్ ఏమిటి?

  1. అదిగానీ ఫేక్ వీడియో ఐతే, అలాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే పోలీసులు పట్టుకుని, చట్టప్రకారం శిక్షిస్తారనే భయం ఉంటే, నేను దానిని ఫార్వర్డ్ చేయను..
  2. ఇక రెండో ఆప్షన్ – ఆ హోటల్లోల్ల గురించి నాకు అప్పటికే ఐడియా ఉండి, వారు మంచోల్లనీ, అలా పని గట్టుకుని ఇతరులకి హాని చేసే రకం కాదనీ, వారి మీద ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంటే, నేనా మెసేజ్ నిజమయ్యే అవకాశం ఏ మాత్రం లేదని తీర్మానించుకుని, అందరికీ ఫార్వర్డ్ చేసి ఆ హోటలోల్ల పొట్టకొట్టడం ఎందుకులెమ్మని, ఫార్వర్డ్ చేయకుండా ఆ మెసేజ్ ని ఇగ్నోర్ చేసేవాన్ని.

మొదటి ఆప్షన్ -ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నవారిని పట్టుకుని శిక్షించడం అనేది – ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రస్తుత పరిస్తితుల్లో అది ముస్లింల సమస్యలపై ఏ మాత్రం దృష్టి సారిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితి మారాలంటే, ముస్లింలూ ప్రభుత్వంలో,పాలనలో భాగం కావడం, నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం తప్ప మరోదారి లేదు. దీర్ఘ కాలిక ప్లాన్ తో, ముస్లిం సమాజం మొత్తం కలిసి, కలిసొచ్చే ఇతర వర్గాల్ని కలుపుకుని దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉంది.

ఇక రెండో ఆప్షన్ –
ముస్లిం/ఇస్లాం గురించి సొసైటీలో, ముస్లిమేతరులకు ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయం.

తబ్లీక్ జమాత్ ఢిల్లీ సమావేశాల విషయమే తీసుకుంటే –
ఆ సమావేశానికి వెళ్ళినవారిది నిర్లక్షమనీ, మూర్ఖత్వమనీ వారిని నిందిస్తే, అది వ్యాలిడే, దానిని అర్థం చేసుకోవచ్చు.
అంతటితో ఆగకుండా, వారు కావాలనే ఇది చేస్తున్నారనీ, తోపుడు బండ్లపై అమ్మే పండ్లను, ప్లేట్లూ, స్పూన్ లనూ ఎంగిలి చేస్తున్నారనీ, నర్సులు,పోలీసులపై ఉమ్మేస్తున్నారనీ, నర్సుల ముందుకు నగ్నంగా వచ్చి వారితో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారనీ – చెప్పే వాట్సప్ మెసేజ్లు ఈ గ్రూప్ నుండీ ఆ గ్రూప్ కి ఫార్వర్డ్ చేయబడుతున్నాయంటే – మిగతా సమాజానికి ముస్లింలపై ఎంత అపనమ్మకం ఉందో తెలుస్తుంది.
ఇలాంటి అపనమ్మకం కేవలం ఉత్తర భారత దేశంలోనే ఉందనే అభిప్రాయం/భరోసా ఇన్నాల్లూ ఉండేది, కానీ తెలుగు రాష్ట్రాలు కూడా, ఆ స్టేజ్ కు రావడానికి ఎంతో ఎక్కువ దూరం లేదని ఇప్పుడు అర్థమవుతుంది.

ఎందుకింత అపనమ్మకం..?

  1. మతాన్ని సీరియస్ గా ఫాలోఅయ్యే తబ్లీక్ జమాత్ లాంటోల్లు, ముస్లిమేతర సమాజంతో ఎక్కువగా టచ్ అవ్వకుండా, తమతమ సొంత లిమిటెడ్ సర్కిల్స్ లోనే బతుకుతుండటం.
  2. ముస్లిమేతరులతో ఎక్కువగా టచ్ లో ఉండే ముస్లింలు, ఇస్లాం గురించి తెలుసుకోకుండా, తెలుసుకున్న కొంచెం కూడా ముస్లిమేతరులకు చెప్పకుండా, “అబ్బే, నేను గడ్డం-పైజామా ముస్లింలలా కాదు, నేను సోకాల్డ్ మాడ్రన్ తోపు ముస్లిమ్ని” – అని కటింగులిచ్చే ప్రయత్నం చేయడం.
    అఫ్కోర్స్ , ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది – ఇస్లాం గురించి ముస్లిమేతరులకు చెప్పే ఏ చిన్న ప్రయత్నం చేసినా – దానిని మత ప్రచారంగా, వారిని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కొందరు కూనిరాగాలు తీయడం మొదలుపెడతారు. దీనికి భయపడి కూడా చాలా మంది ముస్లింలు, మతం గురించి మాట్లాడటం మానేశారు.

ఇస్లాం గురించి , ముస్లింలు మాట్లాడటం మానేసినంత మాత్రాన, చెడ్డి బ్యాచ్ లూ, ఐ.టీ సెల్ వారు ఇస్లాం ని బూచిగా చూపే ప్రయత్నం మానరు. నీ గురించి కొందరు యుద్ధ ప్రాతిపదికన నెగెటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు, నువ్వేంటో, నీ లక్ష్యం-సిద్ధాంతం ఏంటో , అది ఎదుటోల్లకు ఎలా ప్రమాదకరం కాదో చెప్పుకునే బాధ్యత నీమీదే ఉంటుంది.

అంచేత, నీ గురించి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఏడవకుండా – నీ పాజిటివ్ ప్రచారమేదో నువ్వు చెయ్. దాని కంటే ముందు – నిన్ను నువ్వు తెలుసుకో, నీ మతాన్నీ, నీ ప్రవక్త జీవితాన్నీ చదువు, అర్థం చేసుకో. ఎదుటోడు ఎవరైనా, నీ మతాన్ని గానీ, నీ నాయకున్ని గానీ విమర్శిస్తే – ఆ విమర్శలో నిజముంటే, నువ్వు కూడా ఇంకా గట్టిగా దానిని విమర్శించు. ఆ విమర్శ సరైంది కాకుంటే – ఇది నిజం కాదురా భాయ్, ఇస్లాం లో దీనర్థం ఇదిరా భాయ్ అని చెప్పు. అంతే తప్ప, మెజారిటీ జనం ఏమైనా అనుకుంటారేమోనని గంగిరెద్దులా తలాడించకు.

చివరిగా – Yvonne Ridley అనే బ్రిటీష్ జర్నలిస్ట్ – తాలిబాన్ల అరాచకాల్ని బయటిప్రపంచానికి చెప్పాలని- బురఖా ధరించి, అండర్ కవర్ ఏజెంట్ గా, 2001 లో ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటరైంది. తాలిబాన్లకు బందీగా చిక్కి 11 రోజులు వారి ఆధీనంలో ఉండి, చివరికి బ్రిటీష్ గవర్నమెంట్ రాయబారం కారణంగా విడుదలైంది. అప్పటిదాకా, తాలిబాన్లు మహిళల్ని హింసిస్తారనీ, అస్సలు మనుషులుగానే చూడరనీ.. ఇలాంటి చాలా విషయాల్ని కథలు కథలుగా విని ఉన్న ఈమెకు, ఆ 11 రోజులూ తాలిబాన్లు ఆమెతో మెలిగిన విధానం, ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, ఆమె ఉన్న గదిలోకి కూడా రాకుండా బయటే నిలబడి మాట్లాడటం, ఇంకా, అక్కడి ముస్లిం మహిళలతో మాట్లాడిన సంగతులూ అన్నీ ఓ పజిల్ లా మిగిలిపోయాయి. ఇంగ్లాండ్ కి తిరిగి వెల్లాక, ఆమె ఖురాన్ ని సీరియస్ గా స్టడీ చేసి, ముస్లిం గా మారి, ప్రపంచం ఇస్లాం ని ఎలా పని గట్టుకుని విమర్శిస్తుందో అందరికీ వివరిస్తుంది. In The Hands of Talibaan అనే పుస్తకం కూడా రాసింది. ఈ రకంగా ఇస్లాం గురించి స్టడీ చేసి, తెలుసుకొని, ఇస్లాం లోకి వస్తున్న వెస్ట్రన్ ఎడ్యుకేటేడ్ మహిళల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. Myriam Francois, Lisa Killinger, Theresa Corbin, Kristiane Backer, Sinéad O’Connor, Tiara Jacquelina.. ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దది.
ఇప్పుడు ఇదంతా తెలిసుకున్న ఓ ముస్లిమేతర వ్యక్తి – తబ్లీకీ జమాత్ సభ్యులు నర్సుల ముందు నగ్నంగా వచ్చారనీ, వారితో అసభ్యంగా ప్రవర్తించాడనే మెసేజ్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మడు, దానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయడు. ఆ వ్యక్తికి ఇస్లాం గురించి చెప్పకపోవడం, అతనితో దగ్గరగా మెలిగే ముస్లింల వైఫల్యమే తప్ప, చెడ్డీ బ్యాచ్ ఐ.టీ సెల్ వైఫల్యం కాదు. ఎందుకంటే, ఐ.టీ సెల్ వారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వారి క్లారిటి వారికుంది. క్లారిటీ లేనిది ముస్లింలకే.

నోట్: ఇస్లాం గురించి ఇలాంటి పాజిటివ్ పోస్ట్లు రాస్తున్నానని, చాలా మంది సో కాల్డ్ లిబరల్ మేధావులు నన్ను అన్-ఫ్రండ్ చేసుకున్నారు. ఐనా, I Don’t Care. నేను రాసేదాన్లో నిజముందా,లేదా అనేదే నాకు ముఖ్యం తప్ప, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది నా పరిధిలో లేని అంశం. ఈ పోస్ట్ గానీ, నేను రాసే ఏ ఇతర పోస్టు గానీ నచ్చినవారు వాటిని ఎలాగైనా వాడుకోవచ్చు. నా పేరుగానీ, నాకు గానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పోస్టుల్లో దేనికైనా ఆధారాలు కావాలనుకున్నోల్లు నన్ను నిలదీసి అడగొచ్చు.

Leave a Reply

Your email address will not be published.