కట్టప్ప ఎన్నికల్లో నుల్చోకూడదు!!

బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో, 39 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒకే ఒకస్థానంలో నెగ్గింది. అది – కిషన్ గంజ్.

ఆ ఎన్నికల్లో , యం.ఐ.యం – బీహార్ లో ఒకే ఒక్క స్థానం లో పోటీ చేసింది. అదేంటో ఊహించండి.అది – కిషన్ గంజ్.

దీనిని బట్టి ఏ కన్‌క్లూజన్ కి రావొచ్చు?
కాంగ్రెస్ 39 స్థానాల్లో మట్టికరిచింది, ఒకే ఒక్క స్థానంలో, అది కూడా MIM పోటీ చేసి ఓట్లను చీల్చడం వల్ల గెలిచింది – అని.
మరి MIM వల్ల బీజేపీ కి లాభం అనే పాచిపళ్ళ వాదన ఎక్కడి నుండీ వస్తుంది?

యూపీ లో ముస్లిం మెజారిటీ లోక్ సభ స్థానాలు చాలా ఉన్నాయి. కానీ, 2019 ఎన్నికల్లో, ఏ ఒక్క దాన్లోనూ MIM పోటీ చేయలేదు. ఎందుకు? ఎందుకంటే – అక్కడ యస్.పీ+బీయస్పీ కలిసి పోటీ చేశాయి కాబట్టి, అవి రెండూ బీజేపీ ని ఓడించగలవేమో అనే ఆశ అందరికీ ఉండింది. అందుకే MIM అక్కడ పోటీ చేయలేదు. అది బీజేపీ కి అనుకూలంగా పనిచేసే పార్టీ ఐతే, అఖిలేశ్ యాదవ్ కి పడే ముస్లిం ఓట్లను చీల్చడానికి అది పోటీ చేయకుండా ఉండేదా?

లాజిక్ దిక్కులేనిది. నోరున్నోడు దానిని ఎలాగైనా వాడొచ్చు. వినే వాల్లు కొంచెం బుద్ధిని వాడాలి. MIM ఉత్తమమైన పార్టీ అని చెప్పడం నా ఉద్యేశ్యం కాదు. దానిలో లోపాల్ని ఎత్తి చూపాలి. మరింత మంచి పార్టీ దొరికితే, MIM కి హ్యాండిచ్చి, ఆ పార్టీకి మద్దతివ్వాలి. అంతే తప్ప, అస్సలు పోటీ చేయకుండా ఉంటే, కాంగ్రెస్ గెలిచేదనీ, గెలిచి ఏదో ఉద్దరించేదనీ వాదించడం బానిస మనస్తత్వం. మహిళలు బయట తిరిగితే రేపులు జరుగుతాయి కాబట్టి, రేపుల్ని అరికట్టాలంటే వారు ఇంట్లోనే ఉండాలని వాదించడం లాంటిదే ఇది కూడా.

Leave a Reply

Your email address will not be published.