గ్రేటా థంబర్గ్ – ఆండ్రూ టేట్

గ్రేటా థంబర్గ్ ఎవరు?
సైంటిస్టా? పర్యావరణం గురించి పరిశోధనలు ఏమైనా చేసిందా? ఏమీ లేదు.. ఇవేమీ కాదు. ఒక సారి పర్యావరణం గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది, నాలుగు కన్నీటి బొట్లు రాల్చింది. అంతే, ఇక “అథెయిస్టిక్ లిబరల్ ప్రాపగాండా” మిషనరీ ఆమెను క్లైమేట్ చేంజ్ కి పోస్టర్ గర్ల్ ని చేసింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేసింది.

“అథెయిస్టిక్ లిబరల్ ప్రాపగాండా మిషనరీ” ఎవరెవర్ని అందలమెక్కిస్తుంది, ఎవర్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుంది – అనేది కొంచెం లోతుగా స్టడీ చేస్తే మాత్రమే అర్థమవుతుంది. మలాలాను కూడా ఇలాగే పోస్టర్ గర్ల్ ని చేసింది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా,నాటో దలాలు చేసిన యుద్ధం వల్ల ఎన్ని వేల మంది మహిళలు,పిల్లలు చంపబడ్డారో, ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో ఎవరికైనా తెలుసా? మెయిన్ స్ట్రీమ్ మీడియా వాటి గురించి ఎప్పుడైనా చర్చిస్తుందా? వాటన్నిటినీ మరుగునపరిచి, తాలిబాన్ అకృత్యాల్ని జనాలకు గుర్తుచేయడానికి మాత్రం మలాలా కావలసి వచ్చింది.

ఇప్పుడు ఈ గ్రేటా థంబర్గ్ ని పోస్టల్ గర్ల్ లా ప్రొజెక్ట్ చేయడం కూడా ప్రాపగాండా లో భాగమే. ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్న దురాక్రమణని ఈమె ఎన్నడైనా ఖండించిందా? విలేఖరులు గుచ్చి,గుచ్చి ప్రశ్నిస్తే, ఆమె చెప్పిందేంటంటే- ఈ అంశం గురించి ఆమెది తటస్థ వైఖరి అంట. రెండు వైపులా జరిగే హింసకు మాత్రం ఆమె వ్యతిరేకమట. యుద్ధట్యాంకులతో ఊర్లకు-ఊర్లను నేలమట్టం చేస్తున్న ఇజ్రాయెల్ ని-దానికి ఎదురొడ్డి రాళ్ళు విసురుతున్న పాలస్తీనా యువకుల్ని – తటస్థంగా చూడటమంటే -దానంత దివాలాకోరుతనం, మూర్ఖత్వం వేరే ఉంటుందా?
అయినా, ఒక్కసారి,కేవలం ఒకే ఒక్కసారి – ఈమె ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఒక్క మాటగానీ మాట్లాడిందంటే – ఇక ఖేల్ ఖతం. రాత్రికి రాత్రి ఈమె పోస్టల్ గర్ల్ నుండీ పోస్టల్ విలన్ గా మారిపోతుంది.

ఇక ఆండ్రూ టేట్, గ్రేటా పై సెటైర్లేయడం వల్లే అరెస్ట్ చేయబడ్డాడనుకుంటే అది మరో అమాయకత్వం. అంత పెద్ద సెలబ్రిటీ, రొమేనియా లాంటి చిన్నదేశంలో బాహాటంగా తిరుగుతూ, ట్విటర్ లో తన లొకేషన్ షేర్ చేస్తూ అనేక సెల్ఫీ వీడియోలు తీసుకున్నా, అతని గురించి తెలుసుకోలేని రొమేనియా పోలీసులు- గ్రేటా గురించి చేసిన ట్వీట్ పిజ్జా డెలివరీని చూసి అతన్ని పట్టుకున్నారనడం, 2022 కి జోక్ ఆఫ్ ది ఇయర్ అనుకోవచ్చు.

నాకు అర్థమైనంతవరకూ –
“అథెయిస్టిక్ లిబరల్ ప్రాపగాండా మిషనరీ”, యొక్క ఫెమినిస్టిక్ న్యారేషన్ ని లాజికల్ గా, అత్యంత ప్రభావవంతంగా కౌంటర్ చేయడం, ఇది చాలదన్నట్లు ఇస్లాం మతాన్ని స్వీకరించి, దానిని గురించి గొప్పగా మాట్లాడటం.. ఇవే ఆండ్రూ టేట్ ని అరెస్ట్ చేయడం వెనకున్న ప్రధాన కారణాలు.

జూలియన్ అసాంజే, ఎడ్వర్డ్ స్నోడెన్.. వీరు ఏం నేరం చేశారని సంవత్సరాల తరబడి జైల్లలో మగ్గుతున్నారు? లోతుగా స్టడీ చేస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి.

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.