డెడ్ ఎండ్ లో పాశ్చాత్య స్త్రీ-పురుష సమానత్వం!! 

-“మహిళా ఉద్యోగులతో డిన్నర్లకు వెళ్ళకండి”
“ప్రయాణాల్లో వారి పక్కన కూడా కూర్చోకండి.”
“హోటల్ రూమ్ లు వేరే వేరే ఫ్లోర్ లలో బుక్ చేసుకోండి.”
“మీటింగ్ రూమ్ లలో ఒక పురుష ఉద్యోగి- ఒక స్త్రీ ఉద్యోగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు.”

ఈ నిబంధనలు ఏ మదరసా వారో, లేక , ఏ ముసలి ముల్లా గారో కొత్తగా విధించినవి కావు. పోనీ, ఏ సౌదీ అరేబియా ప్రభుత్వమో తమ ఉద్యోగులకు విధించిన షరతులు కూడా కావు. అలా గనక విధించి ఉంటే , ఈ పాటికి మీడియా గొంతు చించుకుని రచ్చ-రచ్చ చేసి ఉండేవారు. కానీ, ఇవి ప్రస్తుతం అనేక అంతర్జాతీయ యం.యన్,సి కంపెనీల్లో, ఫైనాన్సియల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగులు, మ్యానేజర్లు తమకు తాము విధించుకుని , నిష్టగా ఫాలో అవుతున్న మార్గదర్శకాలు. వాల్ స్ట్రీట్లో, ఇలాంటి అనేక సీఈవో లను సర్వే చేసి రాసిన ఈ బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ని చూడండి. –

https://www.bloomberg.com/…/a-wall-street-rule-for-the-meto…

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకొచ్చిన ‘మీ టూ’ ఉద్యమం , ఈ సామాజిక మార్పులకు నాందిపలుకుతుంది. తాము ఏ మూడ్ లో ఉండి ఏం మాట్లాడితే/చేస్తే, దానిని మహిళా ఉద్యోగులు ఎలా అర్థం చేసుకుని,అది ఎలాంటి పరిణామాలకు దారితీసి, ఏ కంప్లైంట్ చేస్తారోనని అక్కడి పురుష పుంగవులందరు భయంతో వణికిపోతున్నారు. అసలు , ఈ గొడవలేవి లేకుండా, మహిళా ఉద్యోగులనే రిక్రూట్ చేయకుండా ఉంటే, ఎలాంటి సమస్యలు ఉండవని కూడా చాలా మంది భావిస్తున్నారట. అన్నీ విషయాల్లోనూ స్త్రీ-పురుష సమానత్వం అనే కాన్స్పెట్ ని నిన్నటి దాకా నెత్తికెక్కించుకున్న పాశ్చాత్త్యా సమాజం ఇప్పుడు డెడ్ ఎండ్ కి చేరుకున్నట్లుంది. ఇక ఇక్కడినుండి, ముందు ముందు ఎలా మారుతుందో చూడాలి.

ఈ వెస్ట్రన్ సమాజం అనుభవపూర్వకంగా నేర్చుకున్న పై మార్గదర్శకాలనే ఇస్లాం ఎప్పటినుండో చెప్తుంది. స్త్రీ,పురుషుల మధ్య సంబంధం అనేది చాలా సంక్లిష్టమైంది. ఓ చిన్న చిరునవ్వును, షేక్ హ్యాన్డ్ ని కూడా చాలా రకాలుగా విశ్లేషించవచ్చు. ఓ వ్యక్తి రూమ్ లోకి రాగానే నవ్వుతూ విష్ చేస్తే, దానిని అభిమానంగా , కర్టసీగా, ఇష్టం గా వీటిలో దేనిగానైనా భావించొచ్చు. అదే గనక అస్సలు విష్ చేయకుండా ఉంటే – దానిని బిజీగా ఉండటం అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు, ఆత్మవిశ్వాసం అనుకోవచ్చూ, కోపం అనుకోవచ్చు, అయిష్టత అనుకోవచ్చు. ఇవన్నీ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే. ఆ ఇద్దరు వ్యక్తులు వయసులో ఉన్న స్త్రీ-పురుషులైతే , ఇక అక్కడ ప్రకృతిసిద్ధమైన స్త్రీ-పురుషుల మధ్య ఉండే ఆకర్షణ, మొత్తం విషయాన్ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. అందుకే, స్త్రీ,పురుషులు అన్నిట్లోనూ సమానమే, ఏ మాత్రం తేడాలు చూపాల్సిన అవసరం లేదు అనే ప్రకృతి వ్యతిరేక, అసహజ ధోరణులని కాకుండా, ఇద్దరి ప్రత్యేకతల్ని,
లిమిటేషన్లని అర్థం చేసుకుని, దానికి తగ్గట్లుగానే ఉండటం అందరికి శ్రేయస్కరం. అందుకే ఇస్లాం మొదటి నుండి, స్త్రీపురుషులు సరూపాలేగాని, సర్వసమానాలు కాదని, ఒకరు ఎక్కువో,ఒకరు తక్కువో కాదని, ఎవరి శరీరధర్మాలననుసరించి వారికి వేరు వేరు నియమ నిబంధనల్ని నిర్దేశించింది. మిగతా సమాజాలకంటే , శతాబ్దాల ముందే వారికి – ఆస్తి హక్కు, విడాకులు,పునర్వివాహా హక్కు, విద్యా హక్కు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే హక్కు ఇలా ఎన్నో హక్కుల్ని ఇచ్చింది. ఇలా హక్కులు ఇవ్వడమే కాక, వాటి అమలులో సహకరించేలా, స్త్రీ,పురుషులకు అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సుస్, వివిధ లిమిటేషన్స్ విధించింది. ఈ లిమిటేషన్స్ ని స్త్రీల అణచివేతగా నిన్నటి దాకా గేలి చేసిన పాస్చాత్య సమాజం, తిరిగి తిరిగి అది కూడా అవే లిమిటేషన్ల దగ్గరికి వస్తుంది. కామన్సెన్స్ తో ఆలోచించేవారికి ఆ లిమిటేషన్ల అంతరార్థం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.