పాలస్తీనా -ఇజ్రాయెల్ లలో ఎవర్ని సపోర్ట్ చేయలి?

ఓ పురుషుడు,ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మహిళ తనకున్న కొద్దిపాటి బలంతో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

“పాపం, అతన్ని ఎలా గోల్లతో రక్కిందో చూడండి.
ఎలా అతని జుట్టుపట్టుకుని లాగిందో చూడండి.
ఎలా అతన్ని కాల్లతో తన్నిందో చూడండి” – అంటూ మాట్లాడేవారు తటస్థంగా ఉన్నట్లా?

తటస్థంగా మాట్లాడేవారు ఎవరైనా చేయాల్సిన మొదటిపని, ఆ పురుషున్ని లాగి అవతల పడేయాలి. అసలు ఆమె దరిదాపులకు వెల్లాల్సిన అవసరం ‘నీకేంటిరా వెధవా’ అని వాన్ని నిలదీయాలి.
అలా కాకుండా, ఆమె ప్రతిఘటనని, వాని అత్యాచారాన్ని కలిపి విమర్శించడం కపటత్వం, నైతికంగా దివాలాకోరుతనం.

పాలస్తీనాపై, ఇజ్రాయెల్ సాగిస్తున్న దాష్టీకానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇజ్రాయెల్ అత్యథికంగా ఆయుధాల్ని కలిగి ఉన్న దేశాల్లో ఒకటి. దాని రక్షణ వ్యయం, పాలస్తీనా రక్షణ వ్యయంతో పోల్చితే 20 రెట్లు అధికం. ఇజ్రాయెల్ దగ్గరున్న ఆయుధాలతో పోల్చితే, పాలస్తీనా దగ్గరున్నవి దీపావళి టపాసులే. పైగా, ప్రతి సంవత్సరం దానికి అమెరికా కోట్లకొద్దీ డాలర్ల విరాళాలు ఇస్తుంటుంది.

ఈ ఆయుధ సంపత్తినీ, అమెరికా అండనూ చూసుకుని, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని కబలిస్తోంది. 1948 కి ముందు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఉన్నదంతా పాలస్తీనానే. అలాంటిది, ఇప్పుడు ప్రపంచ పటంలో పాలస్తీనా కేవలం కొన్ని చుక్కలుగా మాత్రమే మిగిలి ఉంది. ఇజ్రాయెల్ దురాక్రమణ అంత బాహాటంగా,దారుణంగా ఉంది. అత్యాచారానికి గురైన మహిళ చేసిన గోర్ల గాట్లను లెక్కించినట్టు, పాలస్తీనియన్లు కాల్చిన రాకెట్లను లెక్కించడంలో, కొన్ని మీడియా సంస్థలు, కొందరు సోకాల్డ్ తటస్థులు బిజీగా ఉన్నారు.
-మహమ్మద్ హనీఫ్

Leave a Reply

Your email address will not be published.