ఫెయిల్యూర్ స్టోరీ – జయప్రకాశ్ నారాయణ!!!

ప్రముఖ వ్యక్తుల సక్సెస్ స్టోరీ లకు కొదువలేదు.మీడియా వాటిని పదే,పదే గుర్తు చేస్తుంటుంది.యూటూబ్ లో, వందల కొద్దీ చిన్నా,చితకాఛానెల్లు, చివరికి  టివీల్లో కామెడీ వేషాలు వేసేవారిని కూడా ఇంటర్వ్యూలు చేసి,  వారిసోకాల్డ్  విజయగాధల్ని  జనాలకు తెలియజేస్తున్నాయి.  ఒకరి విజయ గాధలుమరొకరికి స్పూర్తిని కలిగిస్తాయి, కాబట్టి అలాంటి  ఇంటర్వ్యూలకు  వ్యూవర్షిప్ ఎక్కువగానే ఉంటుంది. కానీ,  తరచి చూస్తే,విజయం కంటే – పరాజయంలోనే,  నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది.  అలాంటి పరాజయగాధే ఇది.


జయప్రకాశ్ నారాయన – తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వారు ఉండరు. దేశవ్యాప్తంగా కూడా ఈయన చాలా ఫేమస్.మేధావి అనే పదానికి ఎగ్జాంపుల్ లా,మంచితనానికి పేటెంట్ దారుడిగా, ఈయనకనిపిస్తుంటారు. యూటూబ్ లో ఈయనపేరుతో సెర్చ్ చేస్తే కొన్ని వందల కొద్దీవీడియోలు వస్తాయి. అన్నిట్లోనూ ఈయనసమాజంలో జరుగుతున్న చెడు గురించి,ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు పనుల గురించీఆవేశంగా,ఆవేదనగా మాట్లాడుతుంటారు. మధ్య,మధ్యలో – తాను IAS, MLA, లోక్ సత్తాఉద్యమ కారుడిగా చేసిన మంచిపనులగురించీ, సాధించిన విజయాల గురించీవివరిస్తుంటారు.
ఆయన సాధించిన విజయాలలోముఖ్యమైనదిగా ఆయన చెప్పుకునేది – ఆర్టీఐ బిల్ కి తాను డ్రాఫ్ట్ రాశాననేది. ఈ బిల్లుగురించి తెలిసినవారెవరైనా – ఇది చాలా గొప్పపని అనీ,  దేశానికి చాలా అత్యవసరమైనదనీకశ్చితంగా ఒప్పుకుంటారు. ఇంతవరకూబాగుంది.  ఆర్టీఐ కి తాను డ్రాఫ్ట్ రాశాననిచెప్పుకుంటారు కానీ, తనకు రాసే అవకాశంఎలా వచ్చింది – దాని వెనక జరిగిన విషయాల గురించి మాత్రం ఆయన  పెద్దగా మాట్లాడరు. ఆ కథేంటో, దాని గురించి  ఆయన ఎందుకుమాట్లాడరో ఇప్పుడు చూద్దాం.

2004లో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.సహజంగా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకిరాగానే, పాత కమిటీలను రద్దు చేసి, కొత్తకమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలను,తమ పార్టీకి చెందిన వ్యక్తులతో నింపేస్తుంది.  2004లో, తమ ప్రభుత్వానికి సూచనలు,సలహాలను ఇవ్వడానికి 10 మంది సభ్యులతోజాతీయ సలహాసంఘాన్ని( National Advisory Committee  –NAC)  ఏర్పాటుచేయబోతున్నామని సోనియాగాంధీప్రకటించినప్పుడు, ఇది కూడా అన్నికమిటీల్లాంటిదేననీ, దీనిని కాంగ్రెస్లోని ముసలినాయకులతో నింపేస్తారనీ అందరూభావించారు. కానీ, ఆ కమిటీ సభ్యులు పేర్లుచూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే,ఆ కమిటీలో ఒక్కరూ కాంగ్రెస్ వ్యక్తి లేరు, పైగా,కాంగ్రెస్ ని, కాంగ్రెస్ విధానాల్ని నిత్యంవిమర్శించేవారిని ఆ కమిటీలో సభ్యులుగానియమించారు.

వీరి పేర్లను ఓ సారి పరిశీలించండి  –
యోగేంద్ర యాదవ్ – సామాజిక విశ్లేషకుడు -అనంతరం ఆం ఆద్మీ పార్టీలో కీలక సభ్యుడు.
యం.యస్. స్వామినాధన్ – వ్యవసాయశాస్త్రవేత్త
అరుణారాయ్ – ఈవిడ IAS జాబ్ కి రిజైన్ చేసికార్మికులు, శ్రామికుల హక్కుల కోసంపోరాడారు.

జీన్ డ్రేజ్ – ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎకనమిస్ట్,పేదరిక నిర్మూలనకు మురికివాడల్లో నివసిస్తూ,పేదల స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికిప్రయత్నించే గొప్ప వ్యక్తి. అమర్త్య సేన్ తో కలిసిఅనేక పుస్తకాలు రచించాడు.
హర్ష్ మందర్ – ఈయన ఐఏయస్ ఉద్యోగాన్నివదిలి, మత కలహాల బాధితుల తరుపునపోరాడుతున్నాడు. పేదరిక నిర్మూలనకు, ఆర్థికసమానత్వం సాధించడానికి, కార్మికులహక్కులు వంటి వాటికోసం వివిధ సంఘాలతోకలిసి పనిచేస్తున్నాడు.
వీరందరితోపాటూ – జయప్రకాశ్ నారాయన.

వీరందరూ – పదవులు, అధికారం కోసంపాకులాడకుండా – సమాజంలో మార్పు కోసంనిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తున్నవారనేవిషయంలో ఎవరికీ ఎలాంటీ అణుమానాలూఉండవు.  కాంగ్రెస్ లోని వృద్ధ నాయకుల్నికాదని,  సోనియా గాంధీ ఇలాంటి వారందరినీఎందుకు కమిటీలోకి తీసుకున్నారనేది ఆలోచించాల్సిన ప్రశ్న.

దీనికి ఏకైక సమాధానం – వీరైతే సమాజానికి,దేశానికి పనికొచ్చే సరైన సూచనలూ,సలహాలూ ఇవ్వగలరని. మరో కారణం ఏదీఉండే అవకాశం లేదు. ఈ రకంగా – దేశానికిమంచి చేయాలనే సోనియా గాంధీ సంకల్పాన్నిఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా,  ఈకమిటీ చేసిన అనేక సూచనల్ని యూపీఏప్రభుత్వం ఇంప్లిమెంట్ కూడా చేసింది. అనేకచట్టాల్ని చేసింది. పనికి ఆహార పధకం,సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం,ఆహార హక్కు చట్టం .. ఇవన్నీ,  పై కమిటీసభ్యులు సూచించినవే. సోనియా గాంధీ/మన్మోహన్ సింగ్ ల నాయకత్వం లోనిప్రభుత్వం వీటినీ నిష్ఠగా అమలు చేసింది.వీటన్నిటిలోకీ ప్రత్యేకమైనది – సమాచారహక్కు చట్టం.

సమాచార హక్కు చట్టం :
ఫలానా టెండర్ ఏ ప్రాతిపదికన,ఏ కంపెనీకి,ఎంత ధరకి కట్టబెట్టారు? టెండరింగ్లో పాల్గొన్నఇతర కంపెనీలేవి? 
ఫలానా నాయకుడి ఆస్తులు గత ఎన్నికలఅఫిడవిట్లో ఎంత? ఇప్పుడెంత? ఎంతపెరిగాయి, ఎలా పెరిగాయి? అతనిపై ఏ ఏకేసులున్నాయి? 
ఫలానా ఫైలు స్టేటస్ ఇప్పుడేంటి? ఎక్కడుంది.ఎందుకు ఆలస్యం అవుతుంది?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రజలకుతెలియాలంటే , గతంలో ఉన్న ఒకే ఒక మార్గం -ఎవరైనా విలేకరి ప్రాణాలకు తెగించి చేసే‘ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం’. లేదా, ఎవరైనాప్రభుత్వాధికారి, అపోజిషన్ పార్టీలతో‘అండర్స్టాండింగ్’ కి వచ్చి చేసే లీకులు.
కానీ, ఇప్పుడు ఏ భారత పౌరుడైనా, కేవలం ఓచిన్న కార్డు ముక్క రాసి, పై విషయాలన్నీసమాచార హక్కు చట్టం కింద పొందవచ్చు.అంతటి విప్లవాత్మక చట్టం అది.

అదంతా పాత కథ:
సమాచార హక్కు చట్టం గురించి ఇప్పటివరకూచెప్పిందంతా పాత కథ.  గత వారం, నరేంద్రమోడీ గారీ ప్రభుత్వం సమాచార హక్కుచట్టానికి అనేక సవరణలు చేసే బిల్లునుపార్లమెంటు లో ప్రవేశపెట్టింది. అపోజిషన్అభ్యంతరాలతో సంబంధం లేకుండా – ఇది లోక్సభ, రాజ్య సభల్లో పాస్ కూడా ఐపోయింది. ఈసవరణలు – సమాచార హక్కు చట్టం కోరలుపీకేశాయి.  ప్రజలకు ఏ సమాచారం ఇవ్వొచ్చో,ఏది ఇవ్వకూడదో నిర్ణయించే అధికారంప్రభుత్వానికి కట్టబెట్టేశాయి.
ఆ రకంగా – సోనియా గాంధీ  ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం – ప్రజలకు ఇచ్చిన ఓ అమూల్యమైన హక్కును – నరేంద్ర మోడీఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసి, సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టింది.
ఇప్పుడు మళ్ళీ జయప్రకాశ్ నారాయణదగ్గరకు రండి. ఈయన ముందుగా డాక్టర్అయ్యారు. రోగులకు చికిత్స చేయడం కాదు,ప్రభుత్వానికి చికిత్స చేయాలనే సంకల్పం తో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి –  IAS అయ్యారు.   ఐయేయస్ లు కేవలం ప్రభుత్వఆదేశాలను అమలు చేయడం తప్ప  ఇంకేమీచేయలేరని తెలుసుకుని – ఐయేయస్ నివదిలేశారు.  పారదర్శకత, అవినీతిరహితసమాజం వంటి అంశాల గురించి ప్రజల్లోచైతన్యం కలిగించడానికి లోక్ సత్తా నుస్థాపించారు. ఇంతలో, “మీ ఆలోచనలకుకార్యరూపం దాల్చుదాం రమ్మని” సోనియాగాంధీ ఆహ్వానించి – ఈయనకు NAC లో సభ్యత్వం ఇచ్చింది. ఏకంగా కేంద్రప్రభుత్వానికే సలహాలిచ్చే అవకాశంకల్పించింది. ఆర్టీఐ చట్టం తెచ్చింది.  ‘ఎవరికోఎందుకు సలహాలివ్వాలి, నేనే పార్టి పెట్టి, నేనేప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా’ – అనేఆలోచనతో జయప్రకాశ్ నారాయణఎన్నికలబరిలోకి దిగారు. దీనిలోతప్పుపట్టాల్సింది ఏమీ లేదు. ఎన్నికల్లోఒంటరిగా నిలబడి గెలిచి అధికారంలోకిరావడం, అంత ఈజీగా జరిగేపని కాదనితొందరగానే తెలుసుకున్నారు. ఏదో ఓ పెద్దపార్టీతో పొత్తు పెట్టుకోవాలనినిర్ణయించుకున్నారు. దీనిలో కూడా అంతగాతప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, పెద్దలక్ష్యాల్న్సి సాధించాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు కాప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.

కానీ, ఆయన పొత్తుపెట్టుకున్నది బీజేపీతో.నరేంద్ర మోడీ అప్పటికే గుజరాత్ సీయం గా పదేల్లు పని చేసి ఉన్నారు. పారదర్శకత,చట్టబద్ద పాలన వంటి విషయాల్లో నరేంద్రమోడీ ట్రాక్ రికార్డు – మేధావి అయిన జయప్రకాష్ కి తెలియకుండా ఉండే అవకాశంలేదు. గుజరాత్ లోకాయుక్త నియామకం, అక్కడ జరిగిన ఫేక్ ఎన్ కౌంటర్లు, మహిళపై స్నూప్ గేట్  ఆరోపణలు.. ఇవన్నీ .. కేవలంప్రైమ్ టైం అర్నాబ్ గోస్వామి షోలుచూసేవారికి తెలియకపోవచ్చు గానీ, కాస్తంతబుర్ర ఉపయోగించేవారికందరికీ తెలిసినవే.

ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మోడీ ఒకవైపు -తనకు అప్పటికే పెద్దపీట వేసి, తనతో ఆర్టీఐ కిడ్రాఫ్ట్ రాయించిన సోనియా ఒకవైపు – ఈఇద్దరిలో ఆయన పొత్తుపెట్టుకోవడానికి బీజేపీనే ఎంచుకున్నారు.  ఎందుకు..?ఎందుకయ్యుంటుంది..?

ఎందుకంటే, బీజేపీకి గెలిచే అవకాశాలుఎక్కువున్నాయని. అంతకు మించి వేరే కారణం ఏదీ కనిపించదు. కొందరు టీడీపీ నడిపిన కులసమీకరణలు  అని కూడా తీర్మానిస్తుంటారు, అది వేరే విషయం. అంటే, జేపీ, తాను ఇంతకాలం టీవీ స్టూడియోల్లోవళ్ళెవేసిన పారదర్శకత, అవినీతి, చట్ట బద్ధపాలన వంటి విషయాలన్నిటికీ తూట్లు పొడిచి,ఎలాగోలా యం.పీ ఐపోవాలనే ఆశతో బీజేపీతో చేతులు కలిపారు.  వ్రతం చెడింది-ఫలితమూ దక్కలేదు. బీజేపీ గెలిచింది -ఈయన ఓడిపోయారు -అన్ని రకాలుగా.  గత ఐదేళ్ళ బీజేపీ పాలనపై పాపం ఈయన ఎక్కడానోరువిప్పడు, ఎందుకంటే -ఆయన స్వయంగా పొత్తుపెట్టుకున్న పార్టీ కదా, దానిని విమర్శించే నైతిక హక్కుకూడా ఈయనకు లేదు కాబట్టి.   

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, రాష్ట్రాన్ని దివాలా తీస్తాయనిచెప్పడానికి ఈయన మీడియా ముందుకొస్తారుగానీ, తాను స్వయంగా రాసిన ఆర్టీఐ ని నరేంద్రమోడీ ప్రభుత్వం చిత్తుకాగితంలా చించేస్తున్నప్పుడు మాత్రం ఈయన నోరుకూడా విప్పడు.  ఏ విలువల గురించి జీవితాంతం మాట్లాడాడో, అవే విలువల్ని జీవిత చరమాంకంలో తుంగలో తొక్కాడు. అదీ ఫెయిల్యూర్ అంటే.

ఇక్కడే నాస్తికత్వం లోని లిమిటేషన్ కూడా అర్థం అవుతుంది. జేపీ ఓ లక్ష్యం కోసం జీవితమంతా పోరాడాడు. ఆ లక్ష్యం అలాగేఉంది కానీ, వృద్ధ్యాప్యం మాత్రం తరుముకొస్తుంది. లక్ష్యం కోసం, ఎక్కడొ చోటకాంప్రమైజ్ అయ్యి, ఏదో ఒకటి చేయకముందే టపా కట్టేస్తే, ఇక ఆ లక్ష్యానికి, ఆ పోరాటానికి విలువేముంది. బహుశా ఈ ఆలోచనే ఆయన్ని బీజేపీతో జతకట్టేలా చేసింది.

అదే విశ్వాసికి ఐతే – తన పోరాటానికిప్రతిఫలం  ఈలోకంలో కాకున్నా, పరలోకంలోనైనా  తప్పక  దొరుకుతుందనే నమ్మకం ఉంటుంది. తన త్యాగాలను ప్రజలు, చుట్టూ ఉన్న సమాజం గుర్తించకున్నా, పై వాడు తప్పక గుర్తిస్తాడనే నమ్మకం ఉంటుంది.  ఆ నమ్మకమే ప్రతికూలపరిస్థితుల్లోనూ సిద్ధాంతంపై నిలబడేలా, నీతినియమాలకు కట్టుబడి జీవించేలా చేస్తుంది.  అఫ్కోర్స్.. అలాంటి జీవితాల్ని మీడియా  హైలైట్ చేయదు.  టివీ స్టుడియోల్లోపెద్దపీట వేసి కూర్చోబెట్టదు. ఎందుకంటే దానిలెక్కలు దానికుంటాయి కదా.  Thanks to JP, for  all  the preachings, through words and actions.

– మహమ్మద్ హనీఫ్
శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.