బీజేపీ ప్రధాన బలం అదే…

-హిందువులుండే ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పలేదు.
-చారిత్రక హిందూ చిహ్నం పక్కనున్న ఓ అక్రమకట్టడం నుండీ రోడ్ షోలు మొదలుపెట్టి, హిందూపేర్లను తీసేసి ముస్లిం పేర్లు పెడతామని స్టేటెమెంట్లివ్వలేదు.
-హిందువుల బస్తీల్లో చొరబాటుదారులున్నారనే దిక్కుమాలిన కామెంట్లు చేయలేదు.
-ఇస్లాం ని ఉద్దరించడంకోసమో, రక్షించడం కోసమో తమకు ఓట్లేయమని అడగలేదు.

MIM పైవేవీ చేయలేదు. కనీసం బీజేపీ చేసే దగుల్బాజీ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వలేదు. అన్నిటికీ మించి – తమ పార్టీ తరపున ఐదు స్థానాల్లో హిందువుల్ని నిలబెట్టారు, ముగ్గురిని గెలిపించుకున్నారు. బీజెపీ తరపున గెలిచిన ముస్లింలు జీరో.

2016 ఎన్నికల్లో కూడా MIM 44 స్థానాలు గెలిచింది. ఇప్పుడు కూడా దాదాపుగా అన్నే స్థానాల్లో పోటీ చేస్తుంది. అంతకు ముందు ఎన్నికల్లో TRS తో కలిసి మేయర్ స్థానాన్ని పంచుకున్నారు. సిటీలో MIM బందులూ,స్ట్రైకులకు దిగినట్లుగానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లుగానీ ఎప్పుడూ జరగలేదు. విషయం ఇంత స్పష్టంగా కళ్ళముందే కనిపిస్తున్నా కూడా, MIM పోటీచేయడమే తప్పన్నట్లు, MIM నీ, బీజేపీ నీ ఒకేగాటన కట్టి, “రెండు పార్టీల్నీ ఓడించాలని” పిలిపునిచ్చిన సోకాల్డ్ తటస్థ విశ్లేషకులకు లెక్కలేదు.

MIM చేసే తప్పుడు పనుల్ని నిలదీసి రాయండి, విమర్శించండి. అంతే తప్ప, కేవలం తటస్థులం అనిపించుకోవడం కోసం, బీజేపీని విమర్శించినప్పుడల్లా పక్కన యం.ఐ.యం ని కూడా జోడించడం ఎందుకు? ఇది మొహమాటమా? ఏదేమిటో తెలియని కన్‌ఫ్యూజనా? ‘అనలిస్టులం’ అనుకునేవారికే ఇంత మొహమాటం,కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు, సగటు జనాలకు మాత్రం ఉండదా.

ఆ మొహమాటాన్నీ, కన్‌ఫ్యూజన్నే బీజేపీ ఉపయోగించుకుంటుంది. ‘హిందూ’ అనే పదాన్ని అస్తమానం ఉపయోగించుకుని సగటు హిందువుల మొహమాటాన్ని ‘మన హిందువుల పార్టీగా’ అనిపించేలా చేస్తుంది. ముస్లింలకు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్లు సర్క్యులేట్ చేసి వారి కన్‌ఫ్యూజన్ ని, ఇస్లామోఫోబియానీ, భయంగా మార్చుతుంది. జనాలకు ఎవరు ఏంటి అనే విషయంలో క్లారిటీ రావడమే దీనికి ఏకైక పరిష్కారం. (విశ్లేషకులకు ఎలాగూ రాదు, వారికి ‘మాకు మొత్తం తెలుసనే’ ఇగో ఉంటుంది కాబట్టి). ఇది ఇప్పట్లో అయ్యేది కాదు. బీజేపీ కి అదే ప్రధాన బలం. ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ పెద్దగా కష్టపడక్కర్లేదు. పోటీ చేసి, నోటి కొచ్చిన అడ్డమైన హామీల్నీ, ముస్లింలకు వ్యతిరేకంగా జుగుప్సాకరమైన,మతిలేని ఆరోపణల్నీ చేస్తే చాలు. మిగతా పని మెయిన్ స్ట్రీమ్ మీడియా, తటస్థులు చేసిపెడతారు.

Leave a Reply

Your email address will not be published.