మసీదుపై దాడి!!!

పుట్టుక లాగే, చావు కూడా ఓ అనివార్యమైన లాంఛనం. Its Just a Procedure. కళ్ళముందు నుండీ ఓ తెర తొలగిపోయే ప్రక్రియ. అందుకే చావు వార్తలేవీ నన్ను పెద్దగా బాధించవు. కానీ, ఆ చావు ఎలా వచ్చింది, దానికి సంబంధించిన పరిణామాలు వివిధ ఆలోచనలను, ఆవేశాలను కలిగిస్తుంటాయి.

టెర్రరిస్ట్ దాడులు, బాంబు పేలుల్లు జరిగినప్పుడల్లా, ఇస్లాం,అల్లాహు అక్బర్, జీహాద్.. ఇవి కాకుంటే, ఇంకేవో అరబిక్ పదాలు వార్తల్లోకి రావడం, ఇస్లాం ని ఉద్దరించడం కోసం తామే ఇది చేశామని ప్రకటించడం, లేదా, మీడియా ఆ విధంగా డిక్లేర్ చేసేయడం ప్రతిసారీ జరిగేదే. అలాంటివి చూసినప్పుడల్లా, చాలా బాధ,ఆవేశం కలుగుతుంది. ఇస్లాం పేరు మీద చిమ్మే ప్రతి రక్తపు బొట్టూ, ఇస్లాం శాంతియుతమని నమ్మి,దానిని ఆచరించే కోట్లమంది ముస్లింలను బోనులో నిలబెట్టేదే.

కానీ, ఈ రోజు న్యూజిలాండ్ లో జరిగిన దాడి గురించి తెలిసినప్పుడు మాత్రం, ఏ కొంచెం బాధగానీ, ఆవేశం గానీ కలగలేదు. ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కొన్నిరోజులు బాధపడ్తారు, కొన్నాల్లకు జీవితంలో మూవ్ ఆన్ అవుతారు. కాలం అన్ని గాయాల్ని మాన్‌పుతుంది. మనిషి ఓ ఒక్క ఎమోషన్నో ఎక్కువకాలం కంటిన్యూ చేయలేడు. బాధ కూడా అంతే. పైగా, ఆ 49 మంది చావు, ప్రతి బిలీవంగ్ ముస్లిం, తమకు రావాలని కోరుకునే చావు. శుక్రవారం మధ్యాహ్నం నమాజు చేస్తూ చావడాన్ని మించిన గొప్పచావు ముస్లింలకు ఇంకేం ఉంటుంది.

ఇలా కొందరిని చంపేస్తే, ముస్లింలు భయపడి మసీదులకి వెళ్ళడం మానేస్తారని అతను భావించినట్లున్నాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అక్కడ జరగబోతుంది. ప్రతి శుక్రవారం ఆ మసీదుకు మరింత మంది ముస్లింలు వెల్తారు. అతనికి సరైన శిక్ష, ప్రతి శుక్రవారం అతన్ని మసీదుముందు నిలబెట్టి ఆ వచ్చిన వారు ప్రశాంతంగా నమాజు చేసుకుని వెళ్ళడాన్ని చూపించాలి. వారిలో కొందరు అతనికి – క్యాజువల్ గా అస్సలాం అలైకుం ( మీకు శాంతి కలుగుగాక) అని కూడా విష్ చేస్తారు. అదే అతనికి సరైన శిక్ష.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.