ముస్లింల పూర్వీకులు ఎవరు..? ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు గానీ..

ఇంట్లో ఉన్న పూరీ నచ్చదుగానీ,ఆ చపాతీ ముఖంది కావాలంట- అని అప్పట్లో త్రిష చెప్పింది. మనం మార్చి చెప్పుకుందాం.
మన కళ్ళముందే – సెలబ్రిటీ స్టేటస్, మిలియన్ల డాలర్ల కొద్దీ సంపద, ఫారెన్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు.. ఇవన్నీ ఉండి కూడా, “సంథింగ్ మిస్సింగ్” అనుకుంటూ, ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతున్న వారిగురించి రాస్తే అవి నచ్చవు..పైగా, “మత ప్రచారం చేస్తున్నారు బాబోయ్”.. అని గావుకేకలు.

కానీ, 200,300 ఏళ్ళ ముందు ఇస్లాంలోకి వచ్చిన ముస్లింల గురించి, వారెవరనే అంశం గురించి మాత్రం తెగ ఇంట్రెస్టు. ఎందుకంటే, వాటికేమీ ప్రూఫులుండవ్ కదా.. ఎవరికి నచ్చినట్లు వారు తీర్మానించేసుకోవచ్చు.

అప్పటి హిందువులందర్నీ మెడమీద కత్తిపెట్టి ముస్లింలుగా మార్చారని చెప్పుకుంటే కొందరికి రక్తనాలాల్లో కరెంట్ ప్రవహిస్తుంది…ఈ వంకతో మనం కూడా ఇప్పటి ముస్లింలను ఏదైనా చేసేయొచ్చని.

“అప్పట్లో మా వోల్లందరూ మీ వోల్లే; మీరు-మేమూ ఒక్కటే;మీది తెనాలే-మాది తెనాలే” అని ఇంకొందరు చెప్పుకుంటుంటారు. అలా చెప్తేనన్నా వారి మద్దతు లభిస్తుందని వీరి తాపత్రయం.

“మేం నిజాం వారసులం, మేం రూలర్స్” అని ఇంకొందరు బాలయ్య బాబు లెవల్లో తొడకొట్టుకుంటారు. అది వినేసి – “వీల్లందరూ అంతే వదినో” – అని ఇంకొందరు పంచాయతీలు పెట్టుకుంటారు.

మొత్తానికి నిజం ఏంటి..? అసలేం జరిగింది. ఏం జరగబోతోంది.. నాకు తెలియాలి, తెలిసి తీరాలి- అని మీకనిపిస్తే అది ఎమ్మెస్ నారాయణ తప్పు, మీది కాదు.

ఇంతకూ నిజం గురించి చెప్పాలంటే, నేను ఆదిత్య365 సైన్మాలోలా టైమ్‌ట్రావెల్ చేసి చెప్పట్లేదు కాబట్టి, నేను చెప్పేది 100% కరెక్ట్ అని గ్యారెంటీ లేదు. కాకపోతే, నేను bits and pieces గా విని/చదివి ఉన్న సమాచారాన్ని, నా కామన్ సెన్స్ ప్రకారం ఏది నిజమై ఉండొచ్చు అనే అంచనాతో రాస్తున్నాను. మీ దగ్గర దీనికంటే క్రెడిబుల్ ఇన్‌ఫర్మేషన్ ఉందనిపిస్తే, అదేంటో కామెంట్లలో రాయగలరు.

1.ఇతర రాజ్యాలనుండీ వచ్చిన తొలితరం ముస్లిం రాజులు, రాణులు,మంత్రులు,అధికారగణం మరియు సైనికులు : వీల్లెవరూ ఈస్టిండియా కంపెనీ బ్రిటీష్ అధికారులు/సైనికుల లాగా, సర్వీసైపోగానే తమ దేశానికి తిరిగి వెళ్ళలేదు. ఇక్కడే సెటిల్ అయ్యారు. అంటే, వారి పిల్లలు..పిల్లల పిల్లలు.. ఆ పిల్లల పిల్లలు..తరతరాలపాటు అందరూ ఇక్కడే స్థిరపడ్డారు, ఇక్కడి జనంలో,మట్టిలో కలిసిపోయారు. 2. పాకిస్తాన్ జాతిపిత మహమ్మదాలి జిన్నా, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు మగ్బూల్ భట్ లు, ఎలా హిందూ అగ్రవర్ణాలనుండీ ముస్లింలుగా మారారో ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా యూటూబ్ వీడియోల్లో డీటైల్డ్ గా వివరించి ఉన్నారు. చూడగలరు. రాజు మనవాడైతే బాగుంటుందనీ, రాజుదగ్గర ప్రాపకం కోసం చాలా మంది అగ్రవర్ణాల వారు ముస్లింలుగా మారి ఉంటారనడంలో సందేహం లేదు. 3. “బలప్రయోగం ద్వారా ఎవరినైనా ముస్లిం గా మార్చడం తప్పని” ఖురాన్ లో స్పష్టంగానే ఉంది.(2:256) అయినప్పటికీ ముస్లింలందరూ 100% దీనికి కట్టుబడి ఉండేవుంటారని చెప్పలేం. కొందరు అత్యుత్సాహం తోనో, తమ పాలనకు ఢోకా ఉండదనే భరోసాతోనో, అక్కడక్కడా బలవంత మార్పిల్లకు పాల్పడి ఉండొచ్చు. కానీ, వీరి సంఖ్య చాలా తక్కువే. 4. సూఫీ ఉద్యమం: జనాభాలో పాతిక శాతం మందిని, కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా ఊరవతలకు నెట్టేస్తే, సూఫి గురువులు వారిని అక్కునచేర్చుకున్నారు. హిందూ దలితులు- ఇస్లాం లోకి మారిన దలితుల మధ్య సోషల్ స్టేటస్ లో వచ్చిన డిఫరెన్స్ ని బండి నారాయణ స్వామి రాసిన ఓ కథలో చాలా చక్కగా చిత్రించారు.

నిజాం సంస్థానంలోని ఓ గ్రామంలో , దలితులు గుక్కెడు నీల్లు తాగనివ్వండని చెరువు గట్టుమీద నిలబడి ప్రాధేయపడుతుంటే, చెరువులో స్నానం చేస్తున్న బ్రామ్మడు – “నీల్లు ముట్టుకున్నారంటే చీరేస్తా” అని బెదిరిస్తుంటాడు. ఇంతలో, కొన్ని రోజుల ముందు ముస్లిం గా మారిన ఆ దలితుల్లోనే ఒకడైన సైదులు, ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి, ఆ నీల్లలో వజూ( నమాజు ముందు కాల్లు,చేతులు కడుక్కోవడం) చేసి, ఆ నీల్లను బామ్మడి ముందే నోటినిండా పుక్కిలించి ఊస్తాడు. ఇది చూసి బామ్మడికి ఎక్కడో కాల్తుంది గానీ, ఏమీ అనలేడు, ఎందుకంటే, సైదులు వజూకి అడ్డుపడితే, విషయం నిజాం దగ్గరికెల్తుంది కదా అదీ ఆయన భయం. ఇది చాలా కన్విన్సింగ్ స్టోరీ. పైగా, దలితులు మూకుమ్మడిగా ఇస్లాం లోకి మారారని స్వామి వివేకానంద లాంటివారే తమ రచనల్లో రాసి ఉన్నారు.

5. ఐదో కేటగరీ – మొదట్లో చెప్పిన “ఇంట్లోని పూరీ” టైపు. అంటే, నేని ఇదివరకే రాసిన స్వచ్చంద కన్వర్షన్లు. ఉదాహరణకు – మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ ఆండ్ర్యూ టేట్ – కనీసం పదివేలకోట్ల ఆస్తి, విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్,కోరినంత మంది అందగత్తె గర్ల్-ఫ్రెండ్స్, ఇవన్నీ చాలక ఇస్లాం లోకి ఎందుకు కన్వర్ట్ అయ్యాడు? వివక్ష నుండీ విముక్తికోసమా? డబ్బు/పరపతికోసమా? అతని సోదరుడు, క్రిస్టీన్ టేట్, అతని మ్యానేజర్… అందరూ సంపదలో తూలుతున్నవారే. అందరూ ముస్లింలుగా ఎందుకు మారారు? మరో బ్రిటీష్ బిలియనీర్ ఆల్ఫీ బెస్ట్ ఎందుకు మారాడు? వీరందరూ గత 1,2 నెలల్లోనే ముస్లింలుగా మారారు. టొనీ బ్లెయిర్ మేనకోడలు? బీబీసీ జర్నలిస్ట్?లెక్కకు మించి అమెరికన్ ప్రొఫెసర్లు? చివరికి పాస్టర్లు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం – ఇస్లాం కున్న లాజికల్ కన్విన్సింగ్ పవర్. అఫ్కోర్స్, ఇస్లాం నుండీ ఇతర మతాల్లోకి మారినోల్లు కూడా ఉన్నారు. కానీ, కంపేరిటివ్ గా చూస్తే, వారి సంఖ్య నెగ్లిజిబుల్.. మరి ఇండియాలో గత 1000 ఏళ్ళలో ఇలా కన్విన్స్ అయి ముస్లింలుగా మారినోల్లు ఎంతమంది ఉండొచ్చు..?

మొత్తానికి ఇస్లాం లోకి కన్వర్షన్లకు పైన చెప్పిన అన్ని కారణాలూ ఉన్నాయి. ఇప్పుడు ఏ కారణం చేత ఎంతమంది ముస్లింలుగా మారారనే లెక్కలు స్పష్టంగా లేవు. ఊహాగానాలు తప్ప..

నిజానికి ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ తో ఇస్లాం లోకి వచ్చారనేది అంతగా ఇంపార్టెన్స్ ఉన్న విషయం కాదు. ఓ సారి ముస్లిం గా ప్రకటించుకున్నాక, ఖురాన్, ప్రవక్త బోధనల్ని తెలుసుకుని,వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్.

www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.