ముస్లిం మహిళలు బురఖా ఎందుకు ధరిస్తారు..?

“ఇప్పుడూ… రెండు చాక్లెట్లు ఉన్నాయి. ఒకదానికి పైన కవర్ లేదు. ఇంకో దానికి కవర్ ఉంది. చీమలూ,ఈగలూ దేనిమీద వాల్తాయి. నువ్వు ఏ చాక్లెట్ ని ప్రిఫర్ చేస్తావ్?”

– ఓహో, అంటే నీ దృష్టిలో స్త్రీ కూడా చాకెల్ట్ లాంటిదేనన్నమాట. చాక్లెట్ ని కవర్ లో చుట్టిపెట్టినట్లు, మహిళల్ని కూడా నల్లటి బట్టతో(బురఖా) చుట్టేసెయ్యాలన్నమాట. మగాడి ఆకలి/మోహం తీర్చడం తప్ప స్త్రీ జీవితానికి వేరే అర్థమే లేదన్న మాట. అబ్బా.. ఎంత గొప్పమతమో!!!

అంతే.. క్లీన్ బౌల్డ్. ఫుట్బాల్ పరిభాషలో చెప్పాలంటే – సెల్ఫ్ గోల్.

ఈ రకమైన ‘సెల్ఫ్ గోల్’ ఆన్సర్లు ఇచ్చే ముస్లిం పురుషులకూ,మత పెద్దలకూ కొదువలేదు. పైగా అదో భీబత్సమైన,తెలివైన లాజికల్ ఆన్సర్ అని కూడా వీరు ఫీలైపోతుంటారు.

మరి ముస్లిం మహిళలు బురఖా ఎందుకు ధరిస్తారు – అనే ప్రశ్నకు, సమాధానం ఏంటి..?

ముస్లిం మహిళలు ఎందుకు బురఖా ధరిస్తారంటే, ముస్లిం మహిళలు దైవగ్రంధంగా భావించే ఖురాన్లో, ఇంకా తాము అత్యధికంగా గౌరవించే,ప్రేమించే ప్రవక్త బోధనల్లో – ‘నిండుగా/హూందాగా/మోడెస్ట్ గా బట్టలు ధరించండి’ అనే ఇన్స్ట్రక్షన్స్ వారికి ఉన్నాయి కాబట్టి.” అంతే – ఇదే సమాధానం.

నిండుగా బట్టలు ధరించడం వల్ల లాభమా-నష్టమా, సౌకర్యమా-అసౌకర్యమా ఇవన్నీ అనవసర విషయాలు. ఓ వ్యక్తి మనస్ఫూర్తిగా ఓ విషయాన్ని నమ్మితే, ఆటోమేటిక్ గా దానిని ఫాలో అవుతారు. రమజాన్ నెలలో, మండు వేసవిలో, రోజంతా పచ్చి మంచినీల్లు కూడా ముట్టకుండా ఉపవాసాలుండటం చాలా కష్టమైన పని. కానీ, ముస్లిం స్త్రీలు,పురుషులు – చివరికి బయట ఎండలో పనులు చేసుకునే వారు కూడా ఎంత కష్టమైనా ఉపవాసాలుంటారు. ఎందుకు..? ఎందుకంటే – అది వారికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్ అనీ, దానిని ఫాలో ఐతే తమకు మంచి జరుగుతుందని వారు భావిస్తారు కాబట్టి. అట్లే, ముస్లిం స్త్రీలు కూడా తమకై తాము, తమ ఇష్టంతో భురఖా ధరిస్తారు. దీనిలో ఎవరి ప్రోద్బలమూ ఉండదు.

అందరూ నిజంగా ఇష్టంగానే ధరిస్తారా?
ఏదైనా ఇంట్లో, పురుషుడు/భర్తా/తండ్రీ – ఇస్లాం ని ఫాలో అవ్వకుండా, తాగుడూ,తిరుగుడూ లాంటి అలవాట్లు కలిగి ఉంటే , అలాంటి ఇళ్ళలోని మహిళలకు కూడా ఒక్కోసారి మతంపై నమ్మకం కోల్పోయి, “పురుషులకు లేని మతం, మనకు మాత్రమే ఎందుకు”- అనే టైపు ఆలోచనలు రావచ్చు. కానీ, ఇది చాలా రేర్ గా, ఏవో కొన్ని ఇళ్ళలో మాత్రమే జరుగుతుంది. అవి ఎక్సెప్షన్ కేసులు. మిగతా చాలా ఇళ్ళలో ముస్లిం స్త్రీ,పురుషులు ఇస్లాం ఫాలో అవ్వడం అనేది – చాలా నాచురల్ గా జరిగే ప్రక్రియ. కాబట్టి ‘బురఖా’ ధరించడం అనేది, ఎప్పుడూ ఇష్యూ అవ్వదు. మీడియాకు మాత్రమే ఇదో పెద్ద ఇష్యూలా కనిపిస్తుంటుంది. సినిమాల్లో,టీవీల్లో, చివరికి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ లో కూడా , అందమైన స్త్రీ శరీర ఒంపుల్ని, చూసీ, చూసీ అలవాటై ఉన్న కళ్ళకూ, ‘పురుషులతో ఆకర్షింపబడాలని ప్రతీ స్త్రీ కోరుకుంటుందని’ బ్రెయిన్ వాష్ చేయబడ్డ జనాలకూ – ఒక్కసారిగా నిండు బట్టలతో ఉన్న స్త్రీ కనపడగానే – పాపం ఆమెను ఎవరో తొక్కేస్తున్నారనే ఫీలింగ్ తన్నుకొస్తుంది. ఇదో టైపు మైండ్ కండిషనింగ్.

కానీ, అది నిజం కాదు బ్రోస్… ఆల్లకూ ఓ మైండ్ ఉంది. ఆలోచనా ఞానం ఉంది. దానికి తగ్గట్లే వారికేం కావాలో, ఏం ధరించాలో, మతాన్ని ఫాలో అవ్వాలో,లేదో – వారు డిసైడ్ చేసుకోగలరు. మీకు గనక, వారు గతిలేక ఇస్లాం ని ఫాలో అవుతున్నారనిపిస్తే – ముస్లిం మహిళలకి(ముస్లిం పురుషులకి కాకున్నా) విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక, సొంత కాల్లపై నిలబడ్డాక – వారు ఇస్లాం నుండీ బయటపడి, ముస్లిమేతరుల్ని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంది కదా. అలా చేస్తేనే, వారు ఇస్లాం ని స్వచ్చందంగా ఫాలో అవుతున్నారో,లేదో తెలుస్తుంది.

అప్పుడు కూడా వారు ఇస్లాం ఫాలోఅవుతారు. యూరప్,అమెరికా, ఆస్ట్రేలియా లాంటి వెస్ట్రన్ దేశాల్లో, యూనివర్సిటీల్లో చదువుకున్న ఉన్నత విద్యావంతులైన స్త్రీలు, ఇస్లాం కి ఆకర్షింపబడి ముస్లింలుగా మారుతున్నారు. బురఖాతోనే, డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, చివరికి పోలీసులుగా కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అణుమానముంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి.
కాబట్టి – మీ సింపతీని, సానుభూతిని మొత్తం ముస్లిం మహిళలపైనే కురిపించేయకుండా.. కూసింత దాచిపెట్టుకోండి.

Leave a Reply

Your email address will not be published.