రష్యా గర్జించింది-ప్రాపగాండా ఓడింది

ఈనాడు,
సాక్షి,
ఆంధ్రజ్యోతి.. ఇంకా ఇండియాలోని అనేక హిందీ,ఇంగ్లీష్ ఛానెల్లు, ఇంకా వందలాది ఆన్లైన్ ఛానెల్లు – వీటిని ఫాలో అయ్యేవారందరికీ, ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి ఓ అంచనా వచ్చేసి ఉంటుంది. అదేమంటే –
“రష్యా ఈ యుద్ధంలో ఓడిపోబోతోంది..

“రష్యా ఈ యుద్ధంలో ఓడిపోబోతోంది.. తీవ్రంగా నష్టపోతుంది. రష్యన్లందరూ పుతిన్ మీద పట్టరాని కోపంతో ఉన్నారు. పుతిన్ కి ఏదో జబ్బు ఉంది. త్వరలో చనిపోబోతున్నాడు.. యుద్ధంలో పాల్గొనడం ఇష్టంలేక, రష్యన్లందరూ దేశంవదిలి పారిపోతున్నారు.. ఊహించని విధంగా ఉక్రెయిన్ రష్యాను ఏదేదో చేసేసింది. దాని అధ్యక్షుడు మహా తోపు..” – ఇదీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా నడుపుతున్న ప్రాపగాండా మాయాజాలం.

కానీ, నిజంగా జరిగిందేంటి..?
రష్యా ఉక్రెయిన్ లోని నాలుగు ప్రావిన్స్ లను తనలో కలిపేసుకుని(ఆక్రమించుకుని), ఇకనుండీ అవికూడా రష్యాలో అంతర్భాగమనీ, అక్కడి ప్రజలందరికీ రష్యన్ పాస్పోర్టులు జారీచేస్తామనీ ప్రకటించింది. అమెరికా,నాటోలు ఇచ్చిన ఆయుధాలు పట్టుకుని ఉక్రెయిన్ గనక ఆ ప్రావిన్సుల్లోకి అడుగుపెడితే, దానిని రష్యా మీద దండయాత్రగా పరిగణించి అణుబాంబులతో సమాధానం ఇస్తానని హెచ్చరించింది.

ఈ పరిణామాలన్నీ గమనిస్తే – ఒక విషయం స్పష్టమవుతుంది. మీడియాలో వచ్చేదాన్లో “వార్తలు తక్కువ- ప్రాపగాండాలు ఎక్కువ”.
దీనిని నిరూపించే ఆధారాలు కళ్ళముందే చాలా ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సర్వం కోల్పోయి, హిట్లర్ ఆత్మహత్య చేసుకునే క్షణం వరకూ కూడా, తమ జర్మనీ ప్రపంచాన్ని జయించబోతోందనే భ్రమల్లో సగటు జర్మన్లు ఉండేవారు. అందుకే వారు రెండుసార్లు ఓట్లు వేసి మరీ హిట్లర్ ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదీ ప్రాపగాండా మహత్యం.

ఇదే ప్రాపగాండా ఆధారంగా- మనం విశ్వగురువులం కాబోతున్నామనీ, పుతిన్ కు కూడా సలహాలిచ్చే స్థాయికి ఎదిగిపోయామనీ కొన్ని కోట్లమంది భావిస్తున్నారు. వీరికి కళ్ళముందే చైనా ఆక్రమిస్తున్న ప్రాంతాలు,పడిపోతున్న కరెన్సీ విలువలు, రైలుపట్టాలపై పడుకుని అసువులు బాసిన వలస బతులుకు.. ఇలాంటివేవీ కనపడవు. రెండువేల రూపాయల నోట్ లో చిప్ ఉండబోతుందనే వాట్సప్ మెసేజ్ రాగానే, దానిని టపీమని ఇంకో నాలుగు గ్రూపులకు ఫార్వర్డ్ చేసే హైలీ స్కిల్డ్ సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు,ప్రొఫెసర్లు,IAS,IPSలున్న కాలం ఇది. పాపగాండాకి వీరే మహా రాజపోషకులు. చివరికి బలిపశువులు కూడా వీరే.

Leave a Reply

Your email address will not be published.