రైటా – రాంగా..?

ప్రవక్తపై ప్రేమ మరీ ఎక్కువైపోయి, అది భక్తి స్థాయికి చేరి, చివరికి ఆ ప్రవక్తకే విగ్రహాలు పెట్టి, ఆయన్నే దేవున్ని చేసిన ఎగ్జాంపుల్స్ కళ్ళముందే ఉన్నాయి కాబట్టి, ప్రవక్త రూపాన్ని బొమ్మలుగా గీయడం గానీ, శిలలపై చెక్కడం గానీ ఇస్లాం లో పూర్తిగా నిషేదించబడింది.ఓ ముస్లిం గా నేనెట్టిపరిస్థితుల్లో ఆ పని చేయను. ఇతర ముస్లిం లు కూడా చేయరు. కాకపోతే, ముస్లిమేతరులకు ఇలాంటి రిజర్వేషన్స్ ఏమీ లెవు కాబట్టి వారిలో కొందరు చేసే అవకాశం ఉంది.

ఉదాహరణకు : చార్లీ హెబెడో అనే పత్రిక – ప్రవక్త వ్యక్తిత్వాన్ని, చెడుగా చూపే కొన్ని కార్టూన్లు గీసింది, ఫ్రెంచ్ చట్టాలప్రకారం అది తప్పు కాదని డిఫెండ్ చేసుకుంది. అది తప్పనుకున్న కొందరు ముస్లింలు – శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ పత్రికకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు. – ఇది కరెక్టు. కొందరు ముస్లింలు – ఆ పత్రిక కార్యాలయంపై దాడులు,కాల్పులు జరిపారు. – ఇది రాంగు. ఆ దాడులు చేసినవారు ఎంతమందైనా అందరినీ పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలి. ఓ టీచరు ఆ కార్టూన్లను తీసుకెళ్ళి, క్లాస్ రూం లో చూపించాలనుకున్నాడు. ఎందుకు..? విద్యార్థులకి “ఫ్రీడమ్మాఫ్ స్పీచ్” గురించి చెప్పడానికంట. ఈయన లాజిక్ ప్రకారం – “ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్” గురించి చెప్పడానికి, దలితుల్ని, అమెరికన్ నల్లజాతివారినీ కించపరిచే ఫోటోలు, వీడియోలూ ప్రదర్శించాలి కాబోలు. సరే ఆయనకు కరెక్ట్ అనిపించిందేదో ఆయన చేశాడు. ఆయనపై కొందరు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు – స్కూల్ అథారిటీస్ కి కంప్లైంట్ ఇచ్చారు. – ఇది కరెక్టు. ఆ స్కూల్ వారు ఏ చర్య తీసుకున్నారో తెలీదు. ఒకానొక ఆగంతకుడు ఆ టీచర్ ని చంపేశాడు. – ఇది రాంగు. పోలీసులు అతన్ని స్పాట్ లో చంపేశారు – సజీవంగా పట్టుకుని చట్టప్రకారం శిక్షించి ఉంటే బాగుండేది.. స్టిల్ ఓకే. ఇక్కడ మాక్రోని ఎంటరయ్యాడు. -దీనికి ఇస్లామిక్ టెర్రరిజమే కారణమని ప్రకటించేశాడు. ఇంకా ఇస్లాం ని డైరెక్ట్ గా బ్లేమ్ చేస్తూ చెత్తవాగుడు వాగాడు. అంతటితో ఆగకుండా – అన్ని ప్రభుత్వ భవనాలపై, ప్రవక్తను కించపరిచే కార్టూన్లను, అధికారికంగా రోజంతా ప్రదర్శించాడు. ఓ వ్యక్తి చేసిన పనికి, మొత్తం ఇస్లాం ని దోషిగా నిలబెట్టడం – రాంగ్ మాత్రమే కాదు. ఏ మాత్రం మతిలేని దగుల్బాజీ పని. తర్వాత – చర్చ్ పై ఎవరో దాడి చేశాడు. ముగ్గురిని చంపేశాడు. ఇది ఎవరు,ఎందుకు చేసినా రాంగే. చేసినోళ్ళని శిక్షించాలి. ఇదంతా ముస్లింలే, కార్టూన్లకోసమే చేశారని మీడియా డిక్లేర్ చేసేసింది. అదే రోజు, జనాలపై దాడిచేయబోయిన మరో ఆగంతకున్ని పోలీసులు కాల్చి చంపారు. మొదట్లో, అతను కూడా ముస్లిం టెర్రరిస్టే ననీ, ‘అల్లా హు అక్బర్” అని అరిచాడనీ మీడియా మొత్తం రాసేసింది. కాకపోతే, అతను ముస్లిం కాదనీ, శ్వేత జాత్యాహంకార వ్యక్తి అనీ, ‘అల్లా హు అకబర్’ అని అరవలేదనీ రెండో రోజే తేలడంతో, ఆ వార్తని సైలెంట్ గా కప్పెట్టేసింది.**************ఆ పత్రిక, ఆ కార్టూన్లు గీసినోడూ, ఆ టీచరూ, ఆ టీచర్ని చంపినోడూ, చర్చ్ మీద దాడిచేసినోడూ.. వీల్లందరూ ప్రైవేటు వ్యక్తులూ,సంస్థలూ – వీళ్ళు చేసింది రైటా,రాంగా – ఏం చేసి ఉంటే బాగుండేది – ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. వీరిని ఫ్రాన్స్ చట్టాల ప్రకారం ఏం చేయాలో, అదే చేయాలి. ఓ దేశాధినేతగా మాక్రోని చేసిందే చాలా ఇంపార్టెంట్. దాని ఎఫెక్ట్, ఇతర దేశాల్లోని ముస్లింలపై కూడా ఉంటుంది. కాబట్టి, ఫ్రెంచ్ ఉత్పత్తుల్ని స్వచ్చందంగా బహిష్కరించి, తమ నిరసనను ప్రకటించడమనేది, ప్రతి ముస్లిమూ చేయాల్సిన, చేయదగిన కనీస పని. అదే ఇప్పుడు జరుగుతుంది. పైగా, ఫ్రెంచ్ ఉత్పత్తులన్నీ చాలా వరకూ విలాస వస్తువులూ,సౌందర్య సాధనాలూ, సబ్బూ,పౌడరూ, తలకేసుకునే రంగులూ.. ఇలాంటివే. వీటికి అల్టర్నేట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వీటిని వాడకుంటే వచ్చే నష్టం కూడా ఏమీలేదు. ప్రవక్త బోధనల ఆధారంగా ఓ నెలరోజుల పాటు పచ్చిమంచినీరు కూడా ముట్టకుండా, పగలంతా పస్తులుండే ముస్లింలకు ఈ బోడి ఫ్రెంచి ప్రాడక్టులని బహిష్కరించడం పెద్ద కష్టం కాదు. మొత్తానికి – మెటీరియలిస్టిక్, కన్స్యూమరిస్టిక్ వ్యవస్థకి ప్రతిరూపమైన మాక్రోని, తాను కరెక్ట్ అనుకున్నది తను చెప్పాడు. ఇస్లాం నూ, ప్రవక్తనూ నమ్మే ముస్లింలు, ఫ్రెంచ్ మెటీరియల్స్ నీ, కన్స్యూమర్ గూడ్స్ నీ బహిష్కరించడం ద్వారా, తామేం చేయగలరో అది చేస్తున్నారు. సింపుల్. ఎవరి ఫీలింగ్స్ స్ట్రాంగ్ అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.