స్త్రీ జనోద్ధారకులారా, ఇది చూడండి!!

స్త్రీ జనోద్ధారకులారా, ఇది చూడండి!!
=========================
ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందని, కించపరుస్తుందనీ, ఇంకా ఏదేదో చేస్తుందనీ అస్తమానం తెగ గింజుకునే, ఫెమినిస్టులు ఉరఫ్ స్త్రీ జనోద్ధారకులకు ఈ క్రింది సమాచారం మెదడుకు మేత లాంటిది.
ఇది 2013లో, ప్రముఖ బ్రిటన్ పత్రిక – దగార్డియన్ లో వచ్చిన కథనం.

https://www.theguardian.com/world/2013/oct/11/islam-converts-british-women-prejudice
“ప్రతి సంవత్సరం సుమారు 5000 మంది ముస్లిమేతర కుటుంబాలలో పుట్టిన     బ్రిటీషర్లు , ఇస్లాం లోకి మారిపోతున్నారట. వారిలో స్త్రీలే అధిక సంఖ్యలో ఉన్నారట”
ఈ వ్యాసంలో, “వీరు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు” – అనే ప్రశ్నకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం జరిగింది. అలా కన్వర్ట్ అయిన  ఆరుగురు స్త్రీల ఇంటర్వ్యూలను ఇక్కడ ఇచ్చారు. ఈ రకంగా కన్వర్ట్ అయిన వారి ఇంటర్వ్యూలు యూటూబ్ లో బోలెడు ఉంటాయి. ఆసక్తి ఉన్నోల్లు -“వై ఐ కన్వర్టెడ్ టు ఇస్లాం ” అని యూటూబ్ లో టైప్ చేస్తే చాలు, వేలకొద్దీ ఇంటర్వ్యూలు వస్తాయి.
ఈ ఇంటర్వ్యూలలో ముఖ్యంగా గుర్తించాల్సిన అంశాలు –
1. ఇలా, యూరోపియన్, అమెరికన్, ఆస్ట్రేలియన్ దేశాలలో కన్వర్ట్ అయిన వారందరూ అప్పటికే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు. కాబట్టి, మన దేశంలో జరుగుతున్నట్లుగా, వారికి కాసిన్ని డబ్బులో, రేషన్ సరుకులో ఇచ్చి కన్వర్ట్ చేయించారనే వాదన అక్కడ పనిచేయదు.
2. వీరి కన్వర్షన్ ప్రక్రియ ‘ఖురాన్ ని విష్లేశణాత్మకంగా  చదవడం” వల్లే జరిగి ఉంటుంది దప్ప – తమకు క్యాన్సర్ నయమైందనో, తాయెత్తు కట్టుకోవడం వల్ల తెల్లరే సరికల్లా ఉద్యోగం వచ్చింది కాబట్టి తాము కన్వర్ట్ అయ్యామనో వారెవరూ చెప్పరు.
3. ఇలా కన్వర్ట్ అయిన వారిలో, చాలా మంది ఉన్నత విద్యావంతులు. వీరిలో సాక్షాత్తూ చర్చిలలో బైబిల్ బోధించే ఫాదర్లే చాలా మంది ఉన్నారు. ఇంకా, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, చివరికి సైంటిస్ట్లు ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరూ ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే – అన్నీ వున్నా కూడా, జీవితం లో ఏదో కోల్పోతున్నా మనే వెలతి వల్ల, సృష్టికర్తతో తమకు డైరెక్ట్ అనుబంధం లేకపోవడం వల్ల. ఇలాంటి గ్యాప్ ని ఇస్లాం పూరిస్తుంది.
4. ఈ కన్వర్ట్ అయిన వారిలో చాలా మంది 15,20,25 సంవత్సరాల క్రితం కన్వర్ట్ అయి- ఇస్లాం ద్వారా ప్రశాంత జీవితం గడుపుతున్నవారు ఉంటారు. అంటే, దాని ఉద్దేశ్యం – వీరి కన్వర్షన్ అనేది – బాగా అలోచించి, ఓ బలమైన సైధ్ధాంతిక పునాదిపై తీసుకున్న నిర్ణయమే తప్ప, అదేదో క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయం కాదు.
నిజం ఇలా ఉండగా, కొందరు హేతువాదులూ, స్త్రీజనోద్ధారకుల ప్రగల్బాలు మాత్రం –
1. మతం అవుట్ డేటేడ్. సైన్సు మతానికి ప్రత్యామ్న్యాయం.
నిజం : సైన్సు బోధించే ప్రొఫెసర్లు, సాక్షాత్తూ సైటిస్టులే చాలా మంది ఇస్లాం లోకి కన్వర్ట్ అయిన వారు ఉన్నారు.
2. మతాలన్నీ మహిళల్ని అణచివేస్తున్నాయి. ఇస్లాం అన్నింటికన్నా ఎక్కువగా అణచివేస్తుంది.
నిజం: యు.యస్, యు.కే, యూరప్, ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. దీనిని బట్టి ఏం తెలుస్తుంది?
ఓ అంశం గురించి తెలుసుకోకుండా మాట్లాడటం చాలా ఈజీ. పైగా అలాంటివారి మాటల్లో బోలెడంత కాంఫిడెన్స్ కనిపిస్తుంది. అగ్ఞానాన్ని మించిన కాంఫిడెన్స్ మరేదీ ఇవ్వదు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని ఊరికే అనలేదు కదా.
-Mahammad Haneef
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.