1857 సైనికుల తిరుగుబాటు – రహ్మతుల్లా కైరానవీ

రహ్మతుల్లా కైరానవీ – 1818లో, ఉత్తరప్రదేశ్ లోని శాంలీ జిల్లా, కైరానా పట్టణంలో జన్మించారు. ఈయన పూర్వీకులు అరేబియా ప్రాంతం నుండీ మొఘల్ పాలకుల కాలంలో భారత దేశానికి వలస వచ్చారు. ఈయన మూడవ ఇస్లామిక్ ఖలీఫా – ఉస్మాన్(ర) గారి వంశానికి చెందిన 34 వ తరం వ్యక్తి. అక్బర్ చక్రవర్తి – వీరి వంశస్తులకు కైరానా ప్రాంతంలో వందల ఎకరాల భూములు బహుమానంగా ఇవ్వడంతో వీరి కుటుంబం అక్కడ స్థిరపడింది.

రహ్మతుల్లా కైరానవీ గారి విద్యాభ్యాసం 6 వ సంవత్సరం నుండీ ఖురాన్ తో మొదలైంది. అరబిక్, పార్సీ భాషల్లో పట్టు సాధించారు. అనంతరం ఢిల్లీ వెళ్ళి, మ్యాథమేటిక్స్, మెడిసిన్ లు చదివారు. అనంతరం అక్కడే ముఫ్తీగా, షరియా స్కాలర్ గా బాధ్యతలు నిర్వహించేవారు. 1857లో జరిగిన సైనిక తిరుగుబాటు – సుఖంగా, సౌకర్యవంతంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని తలకిందులు చేసింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం మంచిది కాదని ఎంతమంది వారించినా వినకుండా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ముస్లింలు జీహాద్ చేయాలని ఈయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు విఫలమయ్యాక, బ్రిటీష్ వారు ఈయనను బంధించి వీరి ఆస్తులన్నిటినీ జప్తుచేశారు. వీర్ సావర్కర్ లాగా క్షమాపణ చెప్పి, బ్రిటీష్ వారికి విధేయత ప్రకటించి ఉంటే వదిలేసేవారేమో, కానీ రహ్మతుల్లా కైరానవీ గారు అలా చేయలేదు. ఫలితంగా, ఆయనకు కట్టుబట్టలతో దేశబహిష్కారం శిక్ష విధించబడింది. ********19 వ శతాబ్దం మొదట్లో, భారత ఉపఖండంలో ఈస్ట్ ఇండియా పాలన సుస్థిరం కాగానే, ఆ వెనకే ఇంగ్లాండ్ నుండీ మతప్రచారం కోసం,క్రైస్తవ మిషనరీల రాక కూడా ప్రారంభమైంది. వీరి ప్రధాన టార్గెట్ – ముస్లింలు మరియు దలితులు. కలకత్తా, ఢాకాలలో క్రైస్తవ మిషనరీలు ప్రింటింగ్ ప్రెస్ లను స్థాపించి ముస్లింలకు ఇస్లాంపై, ప్రవక్తపై అనుమానాలు,అపనమ్మకం కలిగేలా అసంఖ్యాకంగా పుస్తకాలు ముద్రించి, ఉచితంగా పంచిపెట్టేవారు. ముస్లిలపై ఈ పుస్తకాలు కలిగిస్తున్న ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన రహ్మతుల్లా కైరానవీ గారు – వీరి వాదనలకు కౌంటర్ గా ఇఝారుల్-హక్(సత్యం ఆవిష్కరింపబడింది) అనే పుస్తకం రాశారు. కొన్ని సంవత్సరాలపాటు రీసెర్చ్ చేసి రాసిన ఈ పుస్తకంలో – క్రైస్తవ మిషనరీల ఆరోపణల్ని లాజికల్గా, ఆధారాలతో తిప్పి కొట్టడంతో పాటు, క్రైస్తవులు బోధిస్తున్న ట్రినిటీ సిద్ధాంతంలోని అసంబద్ధతను కూడా వివిధ కోణాల్లో వివరించడం జరిగింది. 18,19,20 శతాద్భాల్లో భారత ఉపఖండంలో జరిగిన క్రైస్తవ-ఇస్లాం ల మతవ్యాప్తి, వీటి మధ్య జరిగిన సైద్ధాంతిక సంఘర్షణల గురించి పరిశొధన చేసిన జర్మన్ స్కాలర్ Christine Schirrmacher – మాటల్లో చెప్పాలంటే – ” ‘Izhâr al-haqq’ served as a summary of all possible charges against Christianity and was therefore used after al-Kairânawî’s death as a sort of encyclopaedia since al-Kairânawî extended the material of former polemicists like ‘Ali Tabarî, Ibn Hazm or Ibn Taymiyya to a great extent.” *******బ్రిటీష్ వారు దేశ బహిష్కారం శిక్ష విధించాక, రహ్మతుల్లా కైరానవీ గారు బొంబాయ్ చేరుకుని అక్కడినుండీ ఓడలో యెమెన్ కి వెళ్ళారు. యెమెన్ నుండీ కాలి నడకన మక్కాకు పయనమయ్యారు. 2 సంవత్సరాల సుధీర్ఘ పయనం తర్వాత మక్కాలో అడుగుపెట్టారు. ఈయన నాలెడ్జికి అబ్బురపడిన అక్కడి మక్కా పాలకులు, మక్కాలో ఈయనను బోధకుడిగా నియమించారు. 1873లో ఈయన మక్కాలో – “మద్రసా సౌలాతియా” అనే మద్రసాను స్థాపించారు. అది ఈనాటికీ మక్కాలోని ప్రముఖ మదరసాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ మదరసా స్థాపనకు ఆర్థిక సహాయం చేసింది – టిప్పు సుల్తాన్ వంశస్తురాలు – సౌలత్-ఉన్నీసా. ఈమె పేరుమీదుగానే – ఆ మద్రసాకు మద్రసా సౌలాతియా ని పేరు పెట్టారు. ********ఇఝారుల్-హక్ పుస్తకం రాస్తున్నప్పుడు – అది భవిష్యత్తులో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో రహ్మతుల్లా కైరానవీ గారు ఏమాత్రం ఊహించి ఉండరు. మాడరన్ ఇస్లామిక్ దావా(ఇస్లాం వైపుకు ఆహ్వానించడం)కి ఆద్యుడిగా భావించే షేక్ అహ్మద్ దీదాద్ కి ఈ పుస్తకమే ప్రధాన ఇన్స్-పిరేషన్. అహ్మద్ దీదాద్ ప్రసంగాల కారణంగానే జకీర్ నాయక్, బ్రదర్ ఇమ్రాన్ లాంటి తరువాతి జనరేషన్ దావా రంగంలోకి వచ్చారు. రహ్మతుల్లా కైరానవీ గారు, 1891 లో స్వర్గస్తులయ్యారు. ఆయనను మక్కాలోని జన్నతుల్ మౌలా( మహమ్మద్ ప్రవక్త(స) గారి కుటుంబీకులు,పూర్వీకుల సమాధులు ఉన్న ప్రదేశం) లో ఖననం చేశారు.

-మహమ్మద్ హనీఫ్.
శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.