పులి – జింక!!!

పులి – జింక
కొన్నేళ్ళక్రితం మాట. ఓ రోజు బాగా బోర్ కొడుతుంటే, కాసేపు బయట తిరిగొద్దామని బయలుదేరాను.కోఠీలో ఫుట్పాత్ పై నడుస్తుండగా ఆ పక్కనే ఉన్న పుస్తకాల దుకాణంలోని ఓ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ పోస్టర్ పై భాగంలో ఈ వాక్యం రాసి ఉంది – ” అడవిలో ప్రతి ఉదయం ఓ జింక నిద్రలేస్తూనే తన పరుగు మొదలుపెడుతుంది. అది పులి కన్నా వేగంగా పరిగెత్తాలి. లేకుంటే పులికి ఆహారమవుతుంది”.

Continue reading “పులి – జింక!!!”

సాతాను సామ్రాజ్యం!!

సాతాను సామ్రాజ్యం!!
===================

జాన్ యఫ్. కెన్నడీ అని ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. 1963 లో, అతన్ని రోడ్డుపైనే కాల్చి చంపారు.అనేక విచారణా సంఘాలూ, కమీటీలూ వేశాక కెన్నడీ ని కాల్చింది ఇతనే అని ఓ క్యారెక్టర్ -Xని ప్రవేశ పెట్టారు. పైగా ఆ X ఒంటరిగానే ఇదంతా చేశాడనీ, అతని వెనుక ఇంకెవరూ లేరనీ కూడా తీర్మానించేశారు. అసలు ‘ఇంతకూ ఎందుకు చంపావయ్యా’ అని న్యాయస్థానం అతన్ని రేపో, మాపో ప్రశ్నిస్తుందనగా , ఆ Xని మరో Y అనే అతను చంపేశాడు. ‘ఆ Xని ఎందుకు చంపావ్ రా బై’ , అని అడుగుదామనుకుంటున్నంతలో, ఆ Y జైల్లోనే క్యాన్సర్ రోగంతో ‘హటాత్తుగా ‘ చనిపోయాడు. ఆ రకంగా కెన్నడీ ని ఎవరు ఎందుకు చంపారనే విషయం ఇప్పటికీ తేలలేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో సైనిక స్థావరాలు, భూమి మీద ఏక్కడ ఏ క్షిపణి లేచినా, దానిని ఠపీమని పసిగట్టే గూఢాచార వ్యవస్థ.. కానీ, తన సొంత దేశాధ్యక్షున్ని పట్టపగలు కాల్చి చంపితే,
ఆ చంపింది ఎవరో,ఎందుకు కాల్చాడో తెలుసుకోలేక పోయారు. అది మనం నమ్మాలి. Continue reading “సాతాను సామ్రాజ్యం!!”

పెట్రో డాలర్ మాయ : సొమ్మొకడిది- సోకొకడిది.!!!

పెట్రో డాలర్ మాయ : సొమ్మొకడిది- సోకొకడిది.!!!
=============== ==========
1973లో పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల(ఒపాక్) తరపున సౌదీ అరేబియా, అమెరికాతో ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన పెట్రోలు అమ్మకాలన్నీ అమెరికన్ డాలర్లలోనే చేస్తుంది. అంటే తన దగ్గర పెట్రోలు కొనే ఏ దేశమైనా, చెల్లింపుల్ని మాత్రం అమెరికన్ డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి భారత్ ఒక బ్యారల్ చమురును సౌదీ నుండి కొంటే దాని విలువ ఫలానా X అమెరికన్ డాలర్లని సౌదీ చెప్తుంది. అప్పుడు భారత్ ఎలాగోలా ఆ X అమెరికన్ డాలర్లను సంపాదించుకుని, వాటిని సౌదీకి ఇచ్చి ఆ చమురును తెచ్చుకోవాలి. ఆ X డాలర్లను భారత్ అమెరికాకు గానీ, లేక ఆ డాలర్లను కలిగి ఉన్న మరో దేశానికి గానీ, వాటికి కావలసిన వస్తువుల్నో/ఉత్పాదకాలనో/సేవలనో ఇచ్చి వాటి నుండి ముందుగా ఆ X డాలర్లను పోగుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ఏ దేశానిదైనా ఇదే పరిస్థితి. ఇక్కడివరకూ బాగానే ఉంది. సరే ఇప్పుడు అమెరికాకు చమురు కావాలంటే ఏం చేయాలి? Continue reading “పెట్రో డాలర్ మాయ : సొమ్మొకడిది- సోకొకడిది.!!!”

కడప దర్గా – దేవుని ప్రసాదం – వందేమాతరం!!

కడప దర్గా – దేవుని ప్రసాదం – వందేమాతరం!!
============================
-“కడప పెద్ద దర్గాలో మొక్కుకుంటే కోర్కెలు తీరుతాయని, దేశంలో ఎక్కడెక్కడినుండో ప్రముఖులు వస్తున్నారు. అలాంటిది నువ్వు కడపలోనే ఉంటూ ఒక్కసారికూడా అక్కడికి వెళ్ళలేదా, అదేంటి?”
-“అది కేవలం ఒక లడ్డూ మాత్రమే, దానిని తినటం వల్ల వచ్చే నష్టం ఏంటి?”
-“దేశభక్తిని ప్రేరేపించేలా ఒక చిన్న వందేమాతరం గేయాన్ని పాడినంత మాత్రాన మీ మతానికి వచ్చే నష్టం ఏంటి?”

పైకి చూడటానికి సంబంధం లేని విషయాలుగా అనిపిస్తున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే – అది ఇస్లామిక్ తౌహీద్.తెలుగులో చెప్పాలంటే – ఏకేశ్వరోపాసన.

Continue reading “కడప దర్గా – దేవుని ప్రసాదం – వందేమాతరం!!”

భక్తులందు సైన్సు భక్తులు వేరయా!!

భక్తులందు సైన్సు భక్తులు వేరయా!!
============================

భక్తుల్లో చాలా రకాలు ఉన్నారు. వీల్లల్లో సైన్సు భక్తులు ఓ ప్రత్యేక కేటగిరీ. మతం గురించి ఎవరు నాలుగు మంచి మాటలు రాసినా వీరు వాలిపోతారు. సైన్సు అంటే అదీ, సైన్సు అంటే ఇదీ అని ప్రవచనాల వరద పారించేస్తుంటారు. బేసికల్గా, మతం అనేది సైన్సుకు వ్యతిరేకమని వీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవడం వల్ల అలా రియాక్ట్ అవుతారు. అలాంటి అపర సైన్సు భక్తులందరినీ ఒకటడగాలనుంది. Continue reading “భక్తులందు సైన్సు భక్తులు వేరయా!!”

స్టీఫెన్ హాకింగ్ గారు పోయారు!!

స్టీఫెన్   హాకింగ్   గారు పోయారు!!
============================
ఎన్నో పరిశొధనలు చేసి, మరెన్నో కొత్త కొత్త విషయాలు చెప్పిన స్టీఫెన్ హాకిన్స్ గారు పోయారు.

“ఎక్కడికి పోయారు?”
ఏమో తెలీదు. ఆయన చెప్పలేదు.

“అదేంటి, ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పినాయన, ఎక్కడికి పోతున్నారో చెప్పకుండాపోయారా?”
అస్సలు, రావడం పోవడం అంటూ ఏం ఉండవంట. జస్ట్ అదలా, యాక్సిడెంటల్ గా జరిగిపోతుండంట.

Continue reading “స్టీఫెన్ హాకింగ్ గారు పోయారు!!”

నిజమైన పప్పూలెవరు?

నిజమైన పప్పూలెవరు?
======================
పప్పూ అంటే, వ్యవహారిక హిందీభాషలో ‘వెర్రిబాగులోడు/తెలివితేటలు లేనివాడు ‘  అని అర్థం వస్తుంది. 2014 ఎన్నికలముందూ, ఆ తర్వాత కూడా, మోడీ, వెంకయ్య నాయుడు లాంటి జాతీయ నేతలు , రాహుల్ గాంధీని అవహేలన చేస్తూ, అతన్ని పప్పూ అని అనేక మార్లు పిలిచారు. ఇక ఇతర BJP చిన్న స్థాయి నేతలు, వారి మద్దతుదారుల గురించైతే చెప్పక్కర్లేదు. అతన్ని పప్పూ అని పిలవకుండా వీరు ఏ చర్చనూ కొనసాగించలేరు. దీనికి ఆధారాలుగా వీరు చెప్పే అంశాలు – రాహుల్ గాంధీ కొన్నిసార్లు విలేఖరుల ప్రశ్నలకు తడబడ్డాడు. కొన్ని సమావేశాల్లో శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు -ఇలాంటివి. వీటిలో నిజం లేకపోలేదు. విలేకర్లెప్పుడూ ఇబ్బందికరమైన ప్రశ్నలే అడుగుతుంటారు. అట్లే కొన్ని వందలమంది ఆడియన్స్ ఉన్న సమావేశంలో, వారు అడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలిసి ఉండాలని రూలేం లేదు. కానీ, ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే – రాహుల్ గాంధీ, ఆ ప్రశ్నల నుండీ పారిపోలేదు. తనకు తానుగానే, ఎదుటి వారికి తనను ప్రశ్నించే అవకాశం ఇచ్చాడు.

Continue reading “నిజమైన పప్పూలెవరు?”

నేను-మా జేజబ్బ – పాకిస్తాన్!!

నేను-మా జేజబ్బ – పాకిస్తాన్!!
రవీష్ కుమార్- ప్రస్తుతం దేశంలోని హిందీ ప్రసార మాధ్యమాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎన్.డి.టి.వి. వ్యాఖ్యాత. యు.పి లోని దాద్రీలో బీఫ్ తిన్నారనే వదంతులతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి జరిగిన వార్తని కవర్ చేయడానికి ఈయన ఆ గ్రామంలో పర్యటించారు. ఆ ఘటనపై, అక్కడి ప్రజలు, ముఖ్యంగా అక్కడి హిందూ యువత ఏమనుకుంటున్నారు, అనే విషయంపై అతను ప్రధానంగా దృష్ఠి పెట్టాడు. వారిలో, ఆ మరణించిన వ్యక్తిపై సానుభూతిగానీ, ఆ ఘటనపై ఏమాత్రం పశ్చాత్తాపంగానీ లేకపోవడాన్ని చూసి తీవ్రంగా చలించిపోయాడు. తన ఆవేదనను ‘ఓ విరిగిన కుట్టుమిషన్, ఓ హత్య, పత్తాలేని పశ్చాత్తాపం ‘ అనే శీర్షికన వ్యాసరూపంలో రాశాడు. దీనిని బి.బి.సి. సహా ఇతర అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. Continue reading “నేను-మా జేజబ్బ – పాకిస్తాన్!!”

Damned if you do, Damned if you don’t :(

Damned if you do, Damned if you don’t 🙁
=============================
“ముహర్రం పండగ అసలు పండగే కాదు. ఖురాన్ బోధనల ప్రకారం అలా పీర్లను మొక్కడం, వాటిని ఎత్తుకుని ఊరేగడం లాంటివి తప్పుడు ఆచారాలు” – అని రాశావనుకో –

“నిన్న మొన్నటి దాకా, హిందూ-ముస్లింలు ఎంతో ఐకమత్యంతో ముహర్రం పండుగను కలిసిమెలిసి చేసుకునేవారు. ఇప్పుడు కొందరు ముల్లాలు వచ్చి ఈ పండుగను చేసుకోకూడదని చెప్తున్నారు. దీనితో ఇంతకు ముందులా ఈ పండగను ఇప్పుడు చేసుకోవడం లేదు.ముస్లిముల్లో మతతత్వం పెరిగిపోతుందనడానికి ఇదో నిదర్శనం” – అని కొందరు మేధావి+హేతువాది+మానవతావాదీ+నాస్తికాగ్రేసులు(All in One) వాపోతారు. Continue reading “Damned if you do, Damned if you don’t :(“

నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?

In search of PURPOSE#1
నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?
=================================

దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ, నాకు ఇస్లాం గురించి తెలిసినదానికంటే రామాయణం,మహాభారతం వంటి వాటి గురించే ఎక్కువగా తెలుసు. ఇంటర్నెట్ అందుబాటులోకి రాకముందు, ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఉన్న ఒకేఒక సోర్స్- మసీదులో ఇచ్చే ప్రసంగాలు. కానీ రామాయణం,భారతాల గురించి బోలెడన్ని సినిమాల ద్వారా, తెలుగు వాచకం పాఠాల ద్వారానూ చిన్నప్పట్నుండీ తెలుసుకుంటూనే ఉన్నాను.

మసీదుల్లో ప్రసంగాలు ఇచ్చే పెద్ద మనుషులు జనరల్గా మదరసాల్లో చదువుకుని ఉంటారు. ఈ మదరసాల్లో చాలావరకూ పేదవారు, అనాధల పిల్లలు మాత్రమే చదువుతుంటారు. బయట డిగ్రీ,పి.జీ, పీహెచ్ డీ లు ఉన్నట్లే మదరసా చదువుల్లో కూడా వివిధ దశలు ఉంటాయి. హఫీజ్,ఆలిం, ముఫ్తీ ఇలా ఉంటాయి. మసీదుల్లో ఐదు పూటలా నమాజు చదివించడానికి ఒకరిని, చాలా తక్కువ నెలజీతం తో నియమిస్తారు. వీరిని ఇమాం లంటారు. దీనికి కావలసిన కనీస అర్హత – ఖురాన్ ని మొదటినుండీ, చివరి వరకూ బట్టీ పట్టి ఉండటం.వీరిని హఫీజ్ లంటారు. వీరికి ఖురాన్ ఇంటర్ప్రెటేషన్ గురించి Expertise ఉండాలనేం లేదు. ఇస్లాం కి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారిని ముఫ్తీ అంటారు. ఇది మదరసాల్లో పి.హెచ్.డీ లాంటిది. ఇప్పుడు ఒక పీ.హెచ్.డీ చేసిన వ్యక్తి, ఓ మారు మూల గ్రామంలోని పిల్లలకి A,B,C,Dలు నేర్పే పని చేయడానికి ఒప్పుకోరు కదా, అలాగే ఓ మారుమూల పల్లెల్లోని చిన్న సైజు మసీదుకి ముఫ్తీ లాంటి వారు రారు. ఇమాం లు నమాజు చదివించడంతో పాటు, మసీదుకు రాని ముస్లింలను అప్పుడప్పుడు పోగేసి, వారిని నమాజ్ చదివేలా ఇన్స్పైర్ చేయడానికి ఖురాన్,ప్రవక్త గొప్పదనం గురించి స్పీచ్ లు(ఇజ్తెమా) కూడా ఇస్తుంటారు. Continue reading “నాస్తికుడిగా మార్చిన ప్రశ్న!! – మహాత్మా గాంధీ,మదర్ తెరీస్సాలు స్వర్గానికి వెళ్తారా, వెళ్ళరా?”