ముస్లింల పూర్వీకులు ఎవరు..? ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు గానీ..

ఇంట్లో ఉన్న పూరీ నచ్చదుగానీ,ఆ చపాతీ ముఖంది కావాలంట- అని అప్పట్లో త్రిష చెప్పింది. మనం మార్చి చెప్పుకుందాం.
మన కళ్ళముందే – సెలబ్రిటీ స్టేటస్, మిలియన్ల డాలర్ల కొద్దీ సంపద, ఫారెన్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు.. ఇవన్నీ ఉండి కూడా, “సంథింగ్ మిస్సింగ్” అనుకుంటూ, ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతున్న వారిగురించి రాస్తే అవి నచ్చవు..పైగా, “మత ప్రచారం చేస్తున్నారు బాబోయ్”.. అని గావుకేకలు.

Continue reading “ముస్లింల పూర్వీకులు ఎవరు..? ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు గానీ..”

Charles le Gai Eaton(1920-2010)రచనల ప్రభావం

ఈయన 1920లో స్విట్జర్ల్యాండ్ లో జన్మించాడు. ఇతని కుటుంబం చిన్నప్పుడే బ్రిటన్ కి వలస వెళ్ళింది. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. మొదట టీచర్ గా, తర్వాత బ్రిటీష్ ప్రభుత్వ రాయబారిగా, ఈజిప్ట్,ఇండియా,ట్రినిడాడ్ లలో పని చేశారు.
యువకుడిగా ఉన్నప్పుడు what is the purpose of life అనే అనుమానం, వివిధ మతాల్ని స్టడీ చేయడానికి, చివరికి 1951లో ఇస్లాం స్వీకరించడానికీ కారణమైంది.

Continue reading “Charles le Gai Eaton(1920-2010)రచనల ప్రభావం”

పఠాన్ పై ఫత్వా ఎందుకు రాలేదు..?

“ముస్లిం పురుషుడు, అర్థనగ్నంగా బట్టలు ధరించి ఎంటర్టైన్మెంట్ పేరుతో, తన భార్య కాని మహిళలతో కలిసి డ్యాన్సులు చేయొచ్చా”- అని ఏ ముఫ్తీని గానీ, ఉలేమాని గానీ అడిగి చూడండి.
అది తప్పని నూటికి నూరు మందీ చెప్తారు.
షారూఖ్ ఖాన్ అలా డ్యాన్స్ చేస్తున్న పఠాన్ పోస్టర్ చూపించి – ఇది కరెక్టా అని అడగండి.
“అది షారూఖ్ ఖాన్ ఐతే ఏటి, వాడి బాబైతే ఏంటి, ఆ సినిమా లక్షకోట్లు కలెక్ట్ చేస్తే ఏంటి.. అలా చేయడం మాత్రం ఇస్లాం ప్రకారం తప్పు” – అనే 100% ఇస్లామిక్ స్కాలర్లు చెప్తారు. అలా చెప్పనోడు ఇస్లామిక్ స్కాలరే కాదు.

Continue reading “పఠాన్ పై ఫత్వా ఎందుకు రాలేదు..?”

ఒక ట్వీట్ – కొన్ని స్పందనలు

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ప్రకారం – ఓ స్త్రీ-పురుషుడు పెళ్ళి చేసుకుంటుంటే, అది ఇస్లాం ప్రకారం ఎలా సరైందికాదో వివరించే ఆ ముఫ్తీ గారి ట్వీట్ అర్థరహితమైంది, అసంధర్భమైంది, కొంచెం పరుష పదజాలం ప్రకారం చెప్పాలంటే -“నోటి దూల” లాంటిది. సోషల్ మీడియాలో ఆ ట్వీట్ కొచ్చిన ఇంత భారీ రెస్పాన్సూ, అటు లిబరల్స్+ ఇటు సంఘీస్ ఇద్దరూ కలిసి ఆ ట్వీట్ ని, ఇస్లాం ని అట్యాక్ చేస్తున్న తీరూ – ఇవన్నీ గమనించాక, ఆ ట్వీట్ ని మరింత లోతుగా అనలైజ్ చేయడం అవసరం అనిపించింది.

Continue reading “ఒక ట్వీట్ – కొన్ని స్పందనలు”

కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునికత

ప్రసవం తర్వాత, పుట్టిన బిడ్డ కాళ్ళమధ్యలో చూసి పుట్టింది అమ్మాయో,అబ్బాయో చెప్పేయడం పాత,అనాగరిక పద్దతి.
ఇప్పుడు ట్రెండ్ మారింది.
లింగాల్లో స్త్రీ,పు మాత్రమే కాకుండా, “స్త్రీ బాడీలో ఉన్న పు”, “పు బాడీలో ఉన్న స్త్రీ”, “మార్పు చెందిన స్త్రీ”, “మార్పు చెందిన పు”, ఇలా రకరకాల లింగాలుంటాయంట. ఆ చిన్న బిడ్డల్ని “నువ్వు ఫలానా” అని మనం చెప్పడం, ఆ రకంగా వారిని పెంచడం వారి హక్కుల్ని కాలరాసి వారికి ద్రోహం చేయడమేనంట.

Continue reading “కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునికత”

న్యూటన్ మత విశ్వాసం

మానవ చరిత్రలో గ్రేటెస్ట్ సైంటిస్ట్ లలో ఒకరిగా చెప్పుకునే వ్యక్తి – ఐజాక్ న్యూటన్.
ఇతను 1642-1727 మధ్య ఇంగ్లాండ్ లో జీవించాడు.

ఇవాలా రేపూ, కాలేజీ సదువులు వెలగబెట్టేవారిలో చాలా మంది మతమూ-సైన్సూ ఆపోజిట్ బైనరీలనే భ్రమల్లో బతుకుతూ, తమను తాము నాస్తికులుగా డిక్లేర్ చేసుకుని, మతాల్ని నమ్మేవారందరూ మూఢవిశ్వాస్తులనీ వీరు మాత్రం గ్ఞానోదయం కలిగిన అపరమేధావులనీ ఫీలవుతూ, ఫేస్బుక్కూ,ట్విటర్లలో తమ మిడిమిడి జ్ఞానాల్ని ప్రదర్శిస్తుంటారు.

Continue reading “న్యూటన్ మత విశ్వాసం”

గ్రేటా థంబర్గ్ – ఆండ్రూ టేట్

గ్రేటా థంబర్గ్ ఎవరు?
సైంటిస్టా? పర్యావరణం గురించి పరిశోధనలు ఏమైనా చేసిందా? ఏమీ లేదు.. ఇవేమీ కాదు. ఒక సారి పర్యావరణం గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది, నాలుగు కన్నీటి బొట్లు రాల్చింది. అంతే, ఇక “అథెయిస్టిక్ లిబరల్ ప్రాపగాండా” మిషనరీ ఆమెను క్లైమేట్ చేంజ్ కి పోస్టర్ గర్ల్ ని చేసింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేసింది.

Continue reading “గ్రేటా థంబర్గ్ – ఆండ్రూ టేట్”

మీడియా – మైండ్ కంట్రోల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ “సన్నీఫాజ్” నిన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది –
ర్యాండమ్ గా జనాల దగ్గరకెళ్ళి “ఆండ్రూ టేట్” గురించి మీ అభిప్రాయం ఏమిటని అడగడం.

అతను మాట్లాడిన పది మందిలో, తొమ్మిది మంది ఆండ్రూ టేట్ పేరు వినగానే – అతను – చెడ్డోడనీ, స్త్రీ ద్వేషి అనీ, అలాంటోడు సమాజంలో బతకడానికి అర్హుడు కాదనీ- ఇలా అతని పట్ల తీవ్రంగా ద్వేషాన్ని వెల్లగక్కారు.

ఆండ్రూ టేట్ చేసిన ఏ పని కారణంగా, లేదా, అతను చెప్పిన ఏ మాట కారణంగా వారు అతని పట్ల ఈ అభిప్రాయానికి వచ్చారని అడిగితే మాత్రం – ఏ ఒక్కరి దగ్గరా సరైన సమాధానం లేదు.

Continue reading “మీడియా – మైండ్ కంట్రోల్”

నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు

సహీ ముస్లిం, 20 వ పుస్తకంలో, హదీస్ నంబర్ – 4688 లో ఈ విషయం నమోదు చేయబడి ఉంది.
ప్రవక్త(స) అనుచరులలో ఒకరైన అబూహురైరా గారు ప్రవక్త(స) నుండీ ఈ విషయం విన్నట్లుగా బలమైన ఆధారాలతో రికార్డ్ చేయబడింది.

అంతిమ దినం నాడు అందరికంటే ముందుగా నరకంలోకి ప్రవేశపెట్టబడేది ముగ్గురు ముస్లింలను. వారు –

  1. ఇస్లాం తరుపున యుద్ధం చేస్తూ వీరమరణం(షహీద్) పొందిన యోధుడు.
  2. అనేక దానధర్మాలు చేసిన ధనవంతుడు.
    3.ఖురాన్ ను ఔపోసనపట్టిన పండితుడు/స్కాలర్.
Continue reading “నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు”