మొదటిసారి ఖురాన్ చదివాక…
====================
గోడకు కొట్టిన బంతి వెనక్కు రావడమనేది, ఆ బంతి ఎలాంటిది అనే అంశంపై,దానిని కొట్టే శక్తిపైనే కాకుండా, ‘ఆ గోడ ఎలాంటిదీ’ అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. గోడ గట్టిగా ఉంటే ఒకలా, అప్పుడే పూతపూసి పచ్చిగా ఉంటే ఇంకోలా, దానిపై గడ్డి మొలిచి ఉంటే మరోలా, ఆ బంతి వెనక్కు వస్తుంది.
ఖురాన్ చదవడం కూడా అలాంటిదే. అది చదివే వ్యక్తి యొక్క మైండు ఓ గోడలాంటిది. ఖురాన్ ఎవరికి ఎలా అర్థమవుతుందనే విషయం -వివిధ అంశాలపై ఆ చదివే వ్యక్తికున్న అవగాహనపై, అతను ఏ ఉద్దేశ్యంతో చదువుతున్నాడు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. 9 వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి తెలుగు ఖురాన్ చదివే ప్రయత్నం చేసినట్టు గుర్తు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, రెండవ చాప్టర్ – అల్ బఖరా ని మించి ముందుకు కదల్లేదు. ఒకటి రెండు పేజీలు చదవగానే నిద్ర తన్నుకుంటూ వచ్చేసేది. దీనికి అందులో వాడిన గ్రాంధిక తెలుగు ఓ కారణం కాగా, మరో ప్రధాన కారణం – అందులోని కంటెంట్. ప్రతిపేజీలోనూ అందులో క్రైస్తవులు, యూదుల ప్రస్తావన ఎందుకుందో అస్సలర్థమయ్యేది కాదు. సుమారు క్లాసుకు 80 మంది ఉన్న మా ప్రభుత్వ పాఠశాలలో, క్రిస్టమస్ కు కొత్త బట్టలు తొడుక్కునే పిల్లోల సంఖ్య మహా అంటే ఓ ఐదుగురు. ఇక ఆ యూదులెవరో, ఆల్లెక్కడుంటారో, అసలుంటారో లేదో కూడా తెలీదు. ఇక క్లాసులో ఫుల్లుగా ఉన్న హిందువుల గురించి ఒక్క ముక్కా రాయకుండా, ఉన్నారో లేదో తెలీయని యూదుల గురించి ఈ పుస్తకం ఎందుకు అన్ని సార్లు మాట్లాడుతుంది అనే విషయం ఓ పెద్ద కొచెన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు, అర్థమైదనిపించింది ఏంటంటే – ” మహమ్మద్ గారు ఆయనకు తెలిసిన అంశాలు, ఆయన చూసిన అంశాల గురించి బాగా ఆలోచించి ఖురాన్లో రాశారు. ఆయన అప్పట్లో ఇండీయాకు రాలేదు కాబట్టి, ఆయనకు హిందువుల గురించి తెలీదు కాబట్టీ దాని ప్రస్తావన చేయలేదు”
మొత్తానికి – “ఖురాన్ అరేబియా ఎడారి ప్రాంతం వారి గురించి కొన్ని వందల ఏళ్ళక్రితం రాసింది కాబట్టి, ప్రస్తుత కాలానికి దానిలో మనకు ఉపయోగపడేదేమీ లేదు “- అనే కంక్లూజన్ కి వచ్చింతర్వాత , మళ్ళీ చాలా ఏళ్ళ వరకూ ఖురాన్ చదివే ప్రయత్నం చేయలేదు.
సరే ఆ సంగతి కాసేపు పక్కనపెడదాం.
‘క్యూరియాసిటీ ‘ – అనే ఓ టైపు జబ్బు నాకు బాగా ఉండటం వల్ల, చేతికందిన ప్రతి పుస్తకాన్నీ, లాప్ టాప్ లో ఐతే దొరికిన ప్రతి వెబ్సైట్ లింకునీ చదువుతూ ఉండటం వల్ల, పెద్దయ్యాక కాసిన్ని కొత్త విషయాలు తెలిశాయి.
వాటిలో కొన్ని..
1. “మా పూర్వీకులు క్రైస్తవులు, మీది క్రైస్తవ దేశం కాబట్టి, నాకు మీ దేశ పౌర సత్వం ఇవ్వండి” – అని ఏ దేశాన్ని అడిగినా, చివరికి వాటికన్ సిటీని, దాని పక్కనే ఉన్న ఇటలీని అడిగినా ఇవ్వరు గాక ఇవ్వరు.
2. “మా పూర్వీకులు ముస్లింలు , మీది ఇస్లామిక్ దేశం కాబట్టి, నాకు మీ దేశ పౌర సత్వం ఇవ్వండి” – అని ఏ దేశాన్ని అడిగినా, చివరికి మక్కా ఉన్న సౌదీ అరేబియాను అడిగినా ఇవ్వరు. వాల్లే కాదు కదా, బంగ్లాదేశూ, ఆఫ్ఘనిస్తానూ కూడా ఇవ్వవు.
3. “మా పూర్వీకులు హిందువులు, మీది హిందూ దేశం కాబట్టి, నాకు మీ దేశ పౌర సత్వం ఇవ్వండి”” అని నేపాల్ని అడిగినా ఇవ్వరు.
4. “మా పూర్వీకులు బుద్దిస్టులు, మీది బుద్దిష్ట్ దేశం కాబట్టి, నాకు మీ దేశ పౌర సత్వం ఇవ్వండి”
అని జపాన్ నో, శ్రీలంకనో అడిగినా ఇవ్వరు.
5. కానీ, బట్, మా పూర్వీకులు యూదులు, నాకు మీ దేశ పౌరసత్వం ఇవ్వండి అని ఇజ్రాయెల్ అని అడిగితే – వారు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించి ఆ దేశ పౌరసత్వం ఇస్తారు.
ఎందుకలా? యూదు లకు మాత్రమే ఏంటా ప్రత్యేకత?
హిట్లర్ అనే వ్యక్తి 60 లక్షల మంది యూదుల్ని చంపించాడు.( ఈ నంబర్ అంత లేదనీ, యూదు మీడియా, సానుభూతి కోసం, కావాలనే ఈ నంబర్ ని చాలా ఎక్కువ చేసి ప్రచారం చేసిందనే ఇంకో వాదన కూడా ఉంది. నిజానిజాలు పైవాడికే ఎరుక) మొత్తానికి కాన్సన్ ట్రేషన్ క్యాంపుల్ని పెట్టి భారీ సంఖ్యలోనే యూదుల్ని చంపించాడు. అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ దేశం నుండీ మరో దేశానికి పరుగులు తీసిన యూదులు, సరిగ్గా 80 సంవత్సరాలు కూడా తిరక్కుండానే ఓ శక్తివంతమైన దేశంగా లేచి నిలబడ్డారు.
అసలుకి, 1948లో, పాలస్తీనా అనే అరబ్బుల దేశంలో, తమకు ఓ 5% స్థలం ఇచ్చేలా అప్పటి ప్రపంచ దేశాల నాయకుల్ని ఒప్పించడం, తరువాత, ప్రపంచం మొత్తం చూస్తుండగానే – ఆ 5% కాస్తా 95% ఆక్రమించుకుని, పాలస్తీనా అరబ్బులని మిగిలిన 5% ఓపెన్ జైల్లో బంధించి వారి జీవితాల్ని దుర్భరం చేయడం, పిల్లలు, స్త్రీలు, నర్సులు అనే తేడా లేకుండా కొన్ని లక్షలమందిని పట్టపగలు, కెమెరాల సాక్షిగానే ఇజ్రాయెల్ సైన్యం కాల్చి చంపడం.. ఇదంతా చూస్తూ కూడా సో కాల్డ్ ఐక్యరాజ్యసమితి అన్నీ మూసుకుని కూర్చోవడం.. ఇదంతా ఎలా సాధ్యం?
అమెరికా ప్రతి సంవత్సరం వివిధ దేశాలకు కోట్లాది నిధుల్ని ఇస్తుంటుంది. అలా ఇచ్చే మొత్తం నిధుల్లో 30% పైగా నిధులు, కేవలం ఒక్క ఇజ్రాయెల్ కే వెల్తాయి. అసలేమాత్రం పేద దేశం కాని ఇజ్రాయెల్ కి అమెరికా ఎందుకన్ని నిధుల్ని ఇస్తున్నట్లు? ఇంతా చేసి ప్రపంచ జనాభాలో యూదులు 1% కంటే తక్కువ శాతం ఉన్నారు. (0.2%) అమెరికాలోని మొత్తం జనాభాలో కేవలం 2% మాత్రమే ఉన్నారు. కానీ, అమెరికాలోని అన్ని వ్యవస్థల్ని ఓ రకంగా చెప్పాలంటే -వెనకుండి నడిపించేది యూదులే.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అంతగా జనసాంద్రతలేని, మంచి సారవంతమైన భూములున్న ఆఫ్రికా ఖండంలో యూదు దేశం ఏర్పాటు చేసుకొమ్మని, రెండవ ప్రపంచయుద్ధంలో విజేతలుగా నిలిచిన దేశాలైన బ్రిటన్,ఫ్రాన్స్, రష్యా..లాంటి దేశాలు యూదుల్ని అడుక్కున్నాయి. కానీ, యూదులు దానికి ససేమిరా అని – అరబ్బుల జనావాసాల మధ్యలో ఉన్న జెరూసలేమే తమకు కావాలని పట్టుబట్టిమరీ సాధించుకున్నాయి. ఎందుకంటే అదే వారి తౌరా గ్రంధంలో చెప్పబడిన ప్రామిస్డ్ ల్యాండ్.
1917 ఆగస్ట్ లో, బ్రిటన్ క్యాబినేట్లో -‘పాలస్తీనాలో యూదులకు ఓ ప్రత్యేక దేశం స్థాపించాలా- వద్దా ‘ అనే అంశం మీద చర్చ జరిగింది. ఈ క్యాబినేట్లో ఉన్న ఏకైక యూదు సభ్యుడు – ఎడ్విన్ స్యామ్యుల్ మాంటెగు. ( తర్వాత మన దేశానికి సంబంధించిన మాంటెగూ- చేంస్ ఫర్డ్ సంస్కరణలని ప్రవేశపెట్టింది ఈయనే).
ఈ మాంటేగూ అనే ఆయన – పాలస్తీనాలో యూదు రాజ్యం స్థాపించడం అనేది పరమ దుర్మార్గమైన ఆలోచన అనీ, చరిత్రలో ఇప్పటివరకూ ముస్లింలు-యూదుల మధ్య పెద్దగా వైరం లేకుండా సఖ్యతతో కలిసిమెలిసి ఉంటున్నారనీ, అలాంటి సఖ్యతని ఇది శత్రుత్వంలా మార్చుతుందనీ చెప్పి- ఆ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించాడు.
అయినప్పటికీ పాలస్తీనాలో ఇజ్రాయిల్ రాజ్యం స్థాపించబడింది.
అంటే, రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకునే బలమైన బ్రిటన్ పార్లమెంటును కూడా, తమకు కావలసిన విధంగా ఆడించగల శక్తి యూదులకు ఎక్కడి నుండీ వచ్చింది?
ప్రపంచంలో కెల్లా ధనవంతుల లిస్ట్ అని, టైంస్ మేగజిన్ ప్రతి సంవత్సరం ఓ లిస్టును విడుదల చేస్తుంది. ఇతర దేశాల్లోని మీడియా సంస్థలు ఆ లిస్టు ఆధారంగా వార్తల్ని వండి వడ్డించుకుంటాయి. కానీ, ఈ లిస్టులోకి ఎక్కకుండా, దానిని అతీతంగా నడిచే ఓ కుటుంబం ఉంది. – దాని పేరు రూత్చైల్డ్ ఫామిలీ. ఓ రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యూదు కుటుంబం శాశిస్తుంది. యూరప్ లో జరిగిన వివిధ యుద్ధాల వెనక, ఐ.యం.యెఫ్, వరల్డ్ బ్యాంకు లు నడిపే ప్రపంచ రాజకీయాల వెనక ఈ కుటుంబం ఉంటుంది.
హాలీవుడ్, పాప్ మ్యూజిక్ లాంటి ఎంటర్టైన్మెంట్ వ్యవస్థల్ని స్థాపించింది, వెనకుండి నడిపిస్తున్నదీ యూదులే. ఈ రకంగా, ప్రపంచ జనాభాలో కేవలం 0.2శాతమే ఉన్నప్పటికీ, ఇతర జనాభాపై, వారి దైనందిన జీవితాలపై యూదుల ప్రభావం సుష్పష్టం. ఒక రకంగా చెప్పాలంటే, పైకి మాత్రం -“మతమూ, దేవుడు వంటి వన్నీ పాతకాలం నాటి ఐడియాలు, హేతువాదం, సైన్సు మాత్రమే గొప్పవి” – అనే సిద్ధాంతాన్ని ప్రాపగేట్ చేసి ఇతర మతాల్ని నిర్మూలిస్తూనే, లోలోపల మాత్రం యూదు ఐడెంటిటీని, యూదు లీనేజ్ ని, ప్రామిస్డ్ ల్యాండ్ వంటి యూదుల మత ఆలోచనలను సజీవంగా, తర తరాలుగా ముందుకు తీసుకెల్లడం ఎలా సాధ్యమవుతుందనేది ఓ పెద్ద మిస్టరీ.
“కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సాతాను సామ్రాజ్యం ఉంది” – ఇది అరుంధతి సినిమాలో ఫకీర్ పాత్ర చెప్పే డైలాగు. సాతాను సామ్రాజ్యం ఏమో గానీ, ప్రపంచ చరిత్రను, రాజకీయాల్నీ గమనిస్తే, చుట్టూ ఉన్న ప్రపంచంలో యూదు కుట్రల ప్రభావం ఉంది, అని మాత్రం ఈజీగానే అర్థమవుతుంది.
ఈ బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా, ఇప్పుడు ఖురాన్ తెరిచి చూస్తే, దానిలో సృష్టికర్త, “ఓ యూదు బిడ్డలారా!!”, “ఓ ఇజ్రాయీలులారా(బనీ ఇజ్రాయీల్) ” .. అని పదే పదే ఎందుకు వారిని అడ్రస్ చేశారో అర్థమవుతుంది. ఖురాన్లోని వాక్యాలు, కేవలం ఓ ఎడారి ప్రాంతంలోని వ్యక్తి 1400 ఏళ్ళక్రితం ఊహించి చెప్పినవి కావని అర్థమవుతుంది.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in