మసీదు లౌడ్ స్పీకర్!!

వేసవి కాలం.. తెల్లవారు ఘామున.. డాబా మీద మంచమేసుకుని గాధ నిద్రలో ఉన్నప్పుడు, సడెన్‌గా లౌడ్ స్పీకర్లో నుండీ పెద్ద శబ్ధం వచ్చి, మీ నిద్ర డిస్టర్బ్ ఐతే, మీకేమనిపిస్తుంది?

ముస్లిమైనా, హిందువైనా, క్రైస్తవులైనా, నాస్తికులైనా అప్పుడు కలిగేది -ఇరిటేషనే.
అదృష్టం బాగుండి ఆరోగ్యంగా ఉన్నోల్లైతే, కొద్ది సేపట్లోనే మంచంపై అటూ,ఇటూ మసలి పడుకుంటారు. నిద్రలేమి, డిప్రెషన్, యాంగ్జైటి వంటి సమస్యలు ఉన్నవారూ, వృద్దులూ మల్లీ నిద్రలోకి పోవడం అంత ఈజీ కాదు.

Continue reading “మసీదు లౌడ్ స్పీకర్!!”

మూడో టవర్ కూలింది మంట వల్ల కాదు: అమెరికన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి!!

ఏ యూనివర్సిటీ, పరిశోధన ఎప్పుడు చేసింది?
అమెరికాలోని University of Alaska Fairbanks లో, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన, పీ హెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన చేశారు. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు, బిల్డింగ్ కి సంబంధించిన అన్ని డీటైల్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కంప్యూటర్ సిములేషన్ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల డెమాలిషన్ మాడల్స్ తో క్రాస్ చెక్ చేసుకుని, పరిశోధనా ఫలితాల్ని గతనెలలో రిలీజ్ చేశారు.
(Link from university website – http://ine.uaf.edu/wtc7)

మొత్తానికి ఏం తీర్మానించారు?
అమెరికన్ ప్రభుత్వం చెప్తున్నట్లు, ఈ కూలిపోవడం అనేది మంటవల్ల అయ్యుండే అవకాశం ఏ మాత్రం లేదు, అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

Continue reading “మూడో టవర్ కూలింది మంట వల్ల కాదు: అమెరికన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి!!”

ఇస్లామోఫోబియా కాదు – గ్జెనోఫోబియా!!

గ్జెనోఫోబియా అంటే – తెలియని వాటి గురించిన భయం.

మీకొక వాట్సప్ మెసేజ్ వచ్చింది.
అమేజాన్ అడవుల్లో నివసించే అత్యంత విషపూరితమైన ఓ కప్పల జాతి గురించిన మెసేజ్ అది. మీరా మెసేజ్ ని క్యూరియాసిటీ కొద్దీ చదివి లైట్ తీసుకుంటారు తప్ప, అది చదివి భయపడటమో, ఆందోళన పడటమో చేయరు. దానిని, మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రండ్స్ కీ అదేపనిగా ఫార్వర్డ్ చేయరు.
డైనోసార్ల గురించి గానీ, అట్లాంటిక్ మహా సముద్రం లోతున నివసించే ప్రమాదకర తిమింగలాల గురించి గానీ, మేసేజ్ వచ్చినా, మీరు ఇలాగే రియాక్ట్ అవుతారు. లైట్ తీసుకుంటారు.

అదే హైదరాబాద్లోనో, బెంగులూర్లోనో ఎలుకలకి ఓ వైరస్ వచ్చిందని గానీ, అది మనుషులకి పాకితే తీవ్రమైన రోగాలొస్తాయని గానీ మెసేజ్ వస్తే, మీరు వెంటనే ఆ మెసేజ్ ని హైదరాబాద్/బెంగులూర్లలో ఉంటున్న మీ ఫ్రండ్స్ కి, బంధువులకి ఠపీమని ఫార్వర్డ్ చేస్తారు. ఫలానా ఏరియాల్లో ఉంటున్న హోటల్లలో, ఇలాంటి ఎలకల్నే చంపేసి, చికన్ బిరియానీలో కలిపి వండిస్తున్నారని మెసేజ్ వస్తే, ఆ ఏరియాలోని హోటల్లకు అస్సలెల్లొద్దని మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్తారు. ఆ మెసేజ్ నిజమో కాదో, మీకు తెలీదు. ఒకవేల ఆ మెసేజ్ నిజం కాకుంటే, మీ ఫ్రెండ్స్ కొచ్చేనష్టం ఏమీలేదు. అదే గనక ఆ మెసేజ్ నిజమే ఐతే, అలాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేసి, మీ ఫ్రెండ్స్ జీవితాన్ని కాపాడినవారవుతారు. కాబట్టి, నిజమో కాదో తెలీకున్నా, మీరు ఆ మెసేజ్ ని పది మందికి ఫార్వర్డ్ చేయడానికే మొగ్గు చూపుతారు. ఆ పది మంది, ఇంకో వంద మందికి.. ఇలా ఆ మెసేజ్ వెల్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ అలాంటి మెసేజ్ నాకొచ్చినా, నేనూ అలాగే చేస్తాను. అది హ్యూమన్ సైకాలజీ.

Continue reading “ఇస్లామోఫోబియా కాదు – గ్జెనోఫోబియా!!”

BJP=MIM : ఆరు పాటలు,నాలుగు ఫైట్లూ, ఓ ఫార్ములా సినిమా!!

  1. కొన్నేల్ల క్రితం, బంగ్లాదేశీ writer తస్లీమా నస్రీన్ మిటింగ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు, యం.ఐ.యం నాయకులు కొందరు ఆమెపై దాడి చేశారు.
    ==>ఇది చాలా తప్పు. చట్టపరంగా,నైతికంగా కూడా. ఆ దాడి చేసినోల్లందరినీ జైల్లో వేసి మక్కిలిరగదన్నాలి.
  2. అక్బరుద్దీన్ ఓవైసీ చాన్నాల్ల క్రితం, 15 నిమిషాలు– అంటూ ఏదో వాగాడు.
    ==>అది కూడా చాలా పెద్ద తప్పు.ఆ స్పీచ్ కి దాదాపు నలభై రోజులు జైల్లో ఉన్నాడు. అది తగిన శాస్తి అని నాకనిపిస్తుంది. రేపు కోర్టు ఇంకా పెద్ద శిక్షవిధించినా కూడా మంచిదే.
  3. గత సంవత్సరం , కరీం నగర్ లో, మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ఓవైసీ అని మీడియా రెండు రోజుల పాటు హంగామా చేసింది. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటోల్లు కూడా ఓవైసీ స్పీచ్ దుర్మార్గమైనదని జడ్జిమెంట్లిచ్చారు.
    ==> నేనా స్పీచ్ మొత్తం విన్నాను. ఎక్కడా తప్పుపట్టాల్సింది కనిపించలేదు. స్పీచ్ మొత్తాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, ఒరిజినల్ వీడియో లింక్ ఇచ్చాను. నాగేశ్వర్ అగ్న్ఞానాన్ని ఖండిస్తూ పోస్ట్ రాశాను.

దీనినే ఆబ్జెక్టివిజం అంటారు. ప్రీ కన్సీవ్డ్ ( pre- conceived) నోషన్స్ లేకుండా, మనోడు, పరాయోడు అనే ఫీలింగ్స్ లేకుండా – ఓ అంశాన్ని విశ్లేషించడం. చాలా మంది మేధావులమనుకునే వారికి కూడా ఇది లేకపోవడం – ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంటుంది.

Continue reading “BJP=MIM : ఆరు పాటలు,నాలుగు ఫైట్లూ, ఓ ఫార్ములా సినిమా!!”