‘వాల్లందరూ వెధవలే’ అనుకునేవాన్ని!!

15 ఏళ్ళు దలిత ఉద్యమంతో మమేకమై ఉన్న, దలిత్ కెమెరా అనే యూటూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు కూడా ఐన రవిచంద్రన్ – ఇస్లాం మతం స్వీకరించి, మహమ్మద్ రాయిస్ గా మారారు. ఇస్లాంలోకి ఎందుకు మారాడో వివరిస్తూ ఓ వ్యాసం కూడా రాశారు. ఇది చదివి ముస్లింలకు సమ్మగా అనిపించొచ్చు. కానీ, ముస్లింలు ఆలోచించాల్సింది దీనిగురించి కాదు.

ఇస్లాం లోకి మారకముందు, ముస్లింల గురించి ఆయన ఒపీనియన్స్ ఎలా ఉండేవో – కారవాన్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ప్రచురించింది. అదీ ముస్లింలు పట్టించుకోవాల్సింది.

Continue reading “‘వాల్లందరూ వెధవలే’ అనుకునేవాన్ని!!”

ఇస్లాం లో కుల వివక్ష!!

‘మానవులందరూ ఒకేజంట సంతానం’ అనేది ఇస్లాం లో కోర్ కాన్సెప్ట్. ఇది ఇస్లాం కి ఆత్మ లాంటిది. దీనిలో ఎలాంటి కన్‌ఫ్యూజనూ, యాంబిగ్విటీ లేదు. ముస్లింలకు ఖురాన్ తర్వాతే, తెగల అనుబంధాలూ, రక్త సంబంధాలూ, చివరికి కుటుంబ సంబంధాలైనా. ఇస్లాం మొదలైన తొలిరోజు నుండీ ఈ పాటర్న్ ని క్లియర్ గా గమనించొచ్చు.

అక్కడొకటీ, ఇక్కడొకటీ జరిగిన, విన్న సంఘటనల్ని బట్టి -జనరలైజేషన్లు, కన్‌క్లూజన్లూ చేయడం వల్ల ఉపయోగం లేదు.

2005 లో, ఆంధ్రాలో, సయ్యద్,ముఘల్,పఠాన్ లకు తప్ప ఇతర ముస్లింలందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలియగానే – అరే.. ఎందుకూ పనికి రాని ఈ సయ్యద్,ముఘల్,పఠాన్ అనే తోకలు మనకెందుకొచ్చినయ్ రా బై – అని ఈ వర్గాలవారు తెగ బాధపడ్డారు.ఇప్పటికీ బాధపడుతున్నారు. పదో క్లాసు కంటే తక్కువ క్లాసుల్లో ఉన్న పిల్లల పేర్లనుండీ చాల మంది తల్లిదండ్రులు – ఈ తోకల్ని తీసిపడేసి, షేక్ అని పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతర షేక్ ముస్లింలు లైట్ తీసుకున్నారు తప్ప, మీరు వేరు-మేం వేరూ, ఇలా షేక్ అని పేరు మార్చుకుని మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు – అని ఎవ్వరూ అనలేదు. దానినో ఇష్యూ చేయలేదు. అదీ ఆ తోకలకున్న వ్యాల్యూ.

అఫ్కోర్స్ ఇస్లాం గురించి తెలీని ముస్లింలు, సయ్యద్ అనే పేరున్నోల్లందరూ అరేబియానుండీ వచ్చామని భావించే మూర్ఖపు ముస్లింలకు కొదువ లేదు. వారిని బట్టి ఇస్లాంపై ఓ అంచానాకు రావడం కరెక్ట్ కాదు కదా.

నా పేరు – షేక్ మహమ్మద్ హనీఫ్. ఈ మూడు పదాల్లో , మొదటిది,చివరిది బేకార్. చిత్తుకాగితానికున్న విలువకూడా వాటికి లేదు. మధ్యలోని పదమే అసలైంది. అదే నా ఐడెంటిటీ.

ఇస్లాం పై స్వామి వివేకానంద చేసిన కామెంట్లు

“ప్రపంచంలోని ప్రతిమానవుని ఆత్మా, నా ఆత్మలాగే, సర్వసమానమనే భావన హిందువుల్లో ఎప్పుడూ లేదు. మరో పక్క, నా అనుభవం ప్రకారం – మానవ సమానత్వాన్ని అత్యంత గొప్పగా చెప్పిన మతమేదైనా ఉందంటే – అది ఇస్లామే, ఇస్లాం మాత్రమే.”
-“మహమ్మదీయ మతం జనాలకు ఓ సందేశం ఇచ్చింది. అది సమానత్వం. అదే ప్రేమ.
జాతి,వర్ణం లాంటి బేధాలకు ఆస్కారమే లేదు.”

Continue reading “ఇస్లాం పై స్వామి వివేకానంద చేసిన కామెంట్లు”

నేను రాయీస్ మహమ్మద్ గా ఎందుకు మారానంటే -రవిచంద్రన్ బాత్రన్,దలిత ఉద్యమకారుడు

(దిప్రింట్ కి ,ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)

కులం గురించి గత 14 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను,
‘దలిత్ కెమెరా’ ఛానెల్ కోసం, దలితులకు సంబంధించిన అనేక అంశాలపై 8 ఏళ్ళపాటు వివిధ డాక్యుమెంటరీలు షూట్ చేశాను. ఈ మొత్తం ప్రయాణం ద్వారా ఒక్క అంశం మాత్రం తిరుగులేని నిజమని అర్థమైంది. అది – బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు, “కులాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం – హిందూఇజం ని వదిలేయడమే.”
ఆయన అడుగుజాడల్లోనే నడిచి, నేను కూడా జనవరి 30, 2020 తేదీన, కేరళ త్రిస్సూర్ జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతమైన కొడుంగల్లూర్ లో హిందూమతాన్ని వదిలేసి – ఇస్లాం స్వీకరించాను. భారతదేశంలో మొట్టమొదటి మసీదు కొడుంగల్లూర్ లోనే కట్టబడింది. ఇప్పుడు నేను ‘రాయీస్ మహమ్మద్’ ని.

Continue reading “నేను రాయీస్ మహమ్మద్ గా ఎందుకు మారానంటే -రవిచంద్రన్ బాత్రన్,దలిత ఉద్యమకారుడు”