సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం

రాధేశ్యామ్ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కాశ్మీరీ ఫైల్స్ చాలాపెద్ద విజయం సాధించింది.ఇది నిశ్శబ్ద విప్లవం …అని మన హిందూత్వ మూకలు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని మీడియా ప్రచారం చేస్తోంది.చాలా ట్యూబులు ఇదే చెప్తున్నాయ్.స్వామీజీలు … హిందూ సంస్థలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు తప్ప …

Continue reading “సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం”

శోకాలు పెట్టొద్దు!!!

“కనపడినోళ్ళందరికీ నీ బాధలు చెప్పుకుని శోకాలు పెట్టకు. సగం మంది పట్టించుకోరు. మిగతా సగం లోలోపల ఆనందిస్తారు. నీ బాధలపట్ల కన్సర్న్ ఉన్న ఒకరిద్దరికి నీవు అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకుంటారు.” -ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాక, ఓ సమూహంగా ముస్లిం సమాజం మొత్తానికి వర్తిస్తుంది.

Continue reading “శోకాలు పెట్టొద్దు!!!”

“ఓవైసీ వల్ల బీజేపీకి లాభమే”

ఓవైసీ ఒంటరిగా పోటీ చేస్తే అది బీజేపీ కి లాభం, సెక్యులర్ పార్టీలకు నష్టం అనేది బేసిక్ కూడికలు,తీసివేతలు తెలిసిన వారందరికీ కూడా అర్థమయ్యే విషయమే. దీనికి పెద్దగా డిటెక్టివ్ అనాలసిస్ లు అవసరం లేదు. ఎంత లాభం అనే విషయం మిగతా పార్టీల బలాబలాల్ని బట్టి మారుతుంటుంది.

Continue reading ““ఓవైసీ వల్ల బీజేపీకి లాభమే””

సూటిగా.. సుత్తి లేకుండా..

జగన్ ఏం హామీలిచ్చాడు, YSRCP మ్యానిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధంలేకుండా. చాలా మంది రెడ్డీస్.. దాదాపుగా.. జగన్ పార్టీకే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని YSRCP నాన్-రెడ్డీస్ కి వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతరులు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

చంద్రబాబు ఏం హామీలిచ్చాడు, టీడీపీ మేనిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధం లేకుండా చాలా మంది చౌదరీలు( కమ్మాస్) టీడీపీ కే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని టీడీపీ చౌదరేతరులకు వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతర వర్గాల వారు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

Continue reading “సూటిగా.. సుత్తి లేకుండా..”

ఇదో టైపు ఫోబియా, ఆత్మ న్యూనత

ఎక్కడైనా తీవ్రవాద దాడి జరగగానే ముస్లింలే చేశారని ముందుగా అనౌన్స్ చేయడం -> అది బాగా వైరల్ అవ్వడం -> తర్వాత అది చేసింది ముస్లింలు కాదని తెలియగానే, సైలెంట్ గా దానిని కప్పెట్టేయడం -> ఇదో రొటీన్ తంతు, ప్రపంచ వ్యాప్తంగా.

మన దేశంలో ఇలాంటి మరో ప్యాటర్న్ : సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు ఓడిపోగానే, MIM పార్టీని బ్లేమ్ చేయడం -> దానిని వైరల్ చేయడం -> నియోజకవర్గాల వారీ డేటా ప్రకారం MIM పార్టీని నిందించడానికేం లేదని తెలియగానే ముఖానికి నల్లరంగేసుకుని సైలెంటైపోవడం – ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగే రొటిన్ తంతు.

Continue reading “ఇదో టైపు ఫోబియా, ఆత్మ న్యూనత”

కట్టప్ప ఎన్నికల్లో నుల్చోకూడదు!!

బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో, 39 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒకే ఒకస్థానంలో నెగ్గింది. అది – కిషన్ గంజ్.

ఆ ఎన్నికల్లో , యం.ఐ.యం – బీహార్ లో ఒకే ఒక్క స్థానం లో పోటీ చేసింది. అదేంటో ఊహించండి.అది – కిషన్ గంజ్.

Continue reading “కట్టప్ప ఎన్నికల్లో నుల్చోకూడదు!!”

కంగ్రాక్ట్స్ కేసీఆర్ !!!

“ఏ.. మేం హిందువులం కాదా.
మేం యాగాలు చేయలేదా. మేం చేసినన్ని యాగాలు దేశంలో ఇంకెవరన్నా చేసిండ్రా. నువ్ చెప్తేనే చేసినమా.
నువ్ మా కంటే పెద్ద హిందువువా.
చిన్న జీయర్ కాళ్ళకు మొక్కుతా.. కంచి పీఠాధిపతి కి సాష్టాంగ వందనం చేస్తా. పొద్దున లేసి మంత్రం చదువుతా. నువ్ చెప్తేనే చేసినమా ఇయన్నీ..
నువ్వెవరు హిందూ మతం గురించి చెప్పనీకి..”
ఇవి నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ సంధించిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు. ఈ ఆర్గ్యుమెంట్ కి చెడ్డీ బ్యాచ్ దగ్గర సమాధానం లేదు, ఉండదు.

Continue reading “కంగ్రాక్ట్స్ కేసీఆర్ !!!”

కపట యుద్ధాలు

ఒక చెంపపై కొడితే – రెండో చెంప చూపమనే గాంధీ సిద్ధాంతం, హైస్కూల్లో ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది.

కానీ, రెండో చెంప మీద కూడా కొడితే ఏం చేయాలనే డౌట్ అప్పట్లో రాలేదు. రెండో చెంప మీద కొట్టడంతో పాటూ, కడుపులో కుల్లబొడిస్తే..? వంగబెట్టి ముడ్డి మీద తన్నితే..? “జీ హుజూర్, తోఫా ఖుబూల్ కీ జియే అనాలా..?”

Continue reading “కపట యుద్ధాలు”

స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్

“నీ స్టేషన్ కి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ననుకున్నావా” – అని పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది.కొత్త కానిస్టేబుల్ ఏదేదో చేసేయాలనే తాపత్రయంలో,ఎమోషన్లో ఉంటాడు. కానీ, ఓ ముదురు సీఐ చేతిలో బలైపోతాడు. ఫేస్ బుక్కులో, హిజాబ్ ప్రయోజనాల్ని వివరించే కొందరు ముస్లిం పురుషుల్ని చూస్తుంటే- నాకు ఆ కొత్త కానిస్టేబులే గుర్తొస్తుంటాడు. ఇస్లాం ను పాజిటివ్ గా చూపించాలనే ఎమోషన్లో వీరు చేసే ఇల్లాజికల్ వాదనల్నే, నాస్తికులు,హేతువాదులు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటారు.

Continue reading “స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్”

సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు

సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. కొన్ని రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.

Continue reading “సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు”