ఒక డిబేట్- అనేక ప్రకంపనలు

ఈ డిబేట్ సుమారు నెల క్రితం అమెరికాలో(టెక్సాస్)లో జరిగింది.

ఈ డిబేట్ ని కండక్ట్ చేసిన హోస్ట్- Patrick Bet-David. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ వ్యక్తి, రచయిత, జర్నలిస్ట్. సీరియస్ అంశాల గురించి ఇతను చేసే టివీ/యూటూబ్ డిబేట్లను లక్షలాది మంది చూస్తారు. అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండేట్లని కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇతను సాంప్రదాయక క్రిష్టియన్, అంటే, క్రైస్తవ మతాన్ని సీరియస్ గా ఆచరించే వ్యక్తి. ఇరాన్ లో పుట్టాడు.

హైస్కూల్లో ఉన్నప్పుడు, ఇతని తల్లిదండ్రులు అమెరికాకు మైగ్రేట్ అయ్యారు. మొదట్లో,కొంతకాలం క్రితం వరకూ ఇస్లాం ని తీవ్రంగా విమర్శించేవాడు. కానీ, అమెరికన్ సామాజిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, అక్కడ విచ్చిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ, లింగ-మార్పిడి గ్రూపులు చేస్తున్న అఘాయిత్యాలు.. ఇవన్నీ చూసి- “వీటిని ఎదుర్కోవడంలో ఇస్లాం సమర్థవంతంగా,ధృడంగా నిలబడుతుంది” – అనే అభిప్రాయానికి ఆకర్షితుడై- ఆధునికత తెస్తున్న అనేక సవాల్లను ఇస్లాం-క్రిష్టియానిటీలు కలిసి మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు కదా- అనే ఐడియాతో, ఇద్దరు ముస్లిం ప్రముఖుల్ని, ఇద్దరు క్రైస్తవ ప్రముఖుల్ని పిలిచి – “రెలిజియస్ రౌండ్ టేబుల్” అనే డిబేట్ కండక్ట్ చేశాడు.

ఆ నలుగురు వ్యక్తులు:
1. Robert Spencer –
ఇస్లాం మీద 26 పుస్తకాలు రాశాడు. అన్నిట్లోనూ కాన్స్పెట్ దాదాపుగా ఒక్కటే – “ఇస్లాం ఎంత చెడ్డదో చూశారా” అని. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇస్లామోఫోబియా అనొచ్చు. ఎందుకంటే, ఇతను “జీహాద్ వాచ్” అనే వెబ్సైట్ నడుపుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలన, ఏ ముస్లిం, ఏ చిన్న అగ్గిపుల్ల వెలిగించినా – దానిని ఇస్లామిక్ టెర్రరిజం తో ముడిపెట్టి ఇతను వ్యాసం రాసేస్తాడు. అది ప్రపంచంలోని వివిధ భాషల్లోకి క్షణాల్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. అలా అరవై వేలకు పైగా వ్యాసాలు రాసేశాడు. మో* రాకముందు, మనదేశంలో చెడ్డీగాల్లకు ఇతనే డ్యాడీ అనడంలో అతిశయోక్తి లేదు.

2. Brother Rachid –
మొరాకోలో ముస్లిం కుటుంబంలో పుట్టాడు. కాలేజ్ లో చదువుతున్నప్పుడు క్రిష్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యాడు. అనంతరం అమెరికాకు మైగ్రేట్ అయ్యాడు. అరబిక్ టీవీ చానెల్ ని నిర్వహిస్తూ అరబ్ ప్రపంచానికి ఇస్లాం ఎంత చెడ్డతో, క్రైస్తవం ఎంత గొప్పదో వివరించే ప్రయత్నం చేస్తుంటాడు.

3. Daniel Hakikachu –
అమెరికాలో స్థిరపడిన ఇరానియన్ షియా కుటుంబంలో జన్మించాడు. చికాగో యూనివర్సిటీ లో ఫిజిక్స్ లో పీహెచ్డి చేస్తున్నప్పుడు, మతం-దేవుడు అనే కాన్స్పెట్లకు ఆకర్షితుడై, ఇస్లాం ని లోతుగా చదివి- సున్నీ ముస్లిం గా మారాడు. “ముస్లిం స్కెప్టిక్” అనే చానెల్ ద్వారా, వివిధ ఇజాల గురించి బోధిస్తుంటాడు.

4. Jake Brancatella-
అమెరికన్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టాడు. ఫిలాసఫీ లో డిగ్రీ చేశాడు. క్రైస్తవ ట్రినిటీ సిద్ధాంతం పై వచ్చిన డౌట్ల కారణంగా వివిధ మతాల్ని స్టడీ చేసి, చివరికి ముస్లిం గా మారాడు. “జాక్-ద ముస్లిం మెటాఫిజీషియన్” అనే యూటుబ్ చానెల్ ద్వారా క్రైస్తవులతో డిబేట్లు చేస్తుంటాడు.

రెండున్నర గంటల పాటు సాగిన డిబేట్ లో ఎవరేం మాట్లాడారనే విషయం – PBD Podcast అనే యూటుబ్ చానెల్ లో సెప్టెంబర్ 21,2023 నాటి వీడియోలో చూడొచ్చు.

ఈ డిబేట్ లో ఆసక్తికర అంశం – ఇది కండక్ట్ చేసిన వ్యక్తి -ఒక కన్సర్వేటివ్ క్రిష్టియన్. అతని ప్రోగ్రాం చూసేవారిలో ఎక్కువమంది అమెరికన్ క్రైస్తవులే. కానీ, ఈ నలుగురు వక్తల్లో ఎవరి అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారు అని ఓటింగ్ పెడితే, దాదాపు 70% శాతం మంది ముస్లిం వక్తలతో అని ఓట్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాం జరిగిన రెండురోజుల తర్వాత – Robert Spencer, Patrick Bet-David. ని- “నువ్వు ముస్లింలతో కుమ్మక్కయ్యావ్, నువ్వు కూడా త్వరలో ముస్లిం గా మారిపోతావ్” అని నిందిస్తూ ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా, “మీమీ భావాలు ప్రేక్షకులతో పంచుకోమని నేను నలుగురికీ సమాన అవకాశం ఇచ్చాను. ముస్లిం వక్తలు దానిని వినియోగించుకున్నారు. మీరు వినియోగించుకోలేకపోయారు, మీ ఫ్రస్టేషన్ ని నేను అర్థం చేసుకోగలను” అని ప్యాట్రిక్ సమాధానం ఇచ్చాడు. దీంతో స్పెన్సర్ ప్యాట్రిక్ ని బ్లాక్ చేసేశాడు. అతన్నొక్కన్నే కాదు, క్రిస్టియన్ నని చెప్పుకుంటూ, ఆ డిబేట్లో నువ్వు మాట్లాడిందేమిటని నిలదీసిన చాలా మంది క్రైస్తవులకే సమాధానం చెప్పుకోలేక, అందర్నీ బ్లాక్ చేసే ఉద్యమానికి తెరలేపాడు.

క్రైస్తవ వక్తలు అంతగా ఏం మాట్లాడారు..?
ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. హింస, మహిళల అణచివేత అంటూ చాలా మంది క్రైస్తవులు ఇస్లాం ని విమర్శిస్తుంటారు. లేదా, అలా విమర్శించే నాస్తికుల వెనక నిలబడి చప్పట్లు కొడుతుంటారు. కానీ, వీరికి తెలియని, తెలిసినా తెలీనట్లు నటించే అంశమేమిటంటే- ఈ రెండు అంశాల్లో బైబిల్లో అంశాలు ఖురాన్ తో పోల్చితే చాలా రెట్లు తీవ్రంగా ఉంటాయి. ఆ డిబేట్లో ముస్లిం వక్తలు ఈ విషయాన్ని హైలైట్ చేయగా, దీన్ని కవర్ చేసుకోవడానికి, బైబిల్ లో అలాంటి కట్టుకథలు, అభూతకల్పనలు ఉన్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నాలుక్కరుచుకున్నారు. అసలు ఇస్లాం-క్రిష్టియానిటీ ల మధ్య కామన్ గ్రౌండ్ గురించి డిస్కస్ చేద్దామనే సదాశయంతో, పాట్రిక్ ఈ డిబేట్ కి ఆహ్వానిస్తే, ప్రోగ్రాం మొదటినుండీ ఇస్లాం ని అట్యాక్ చేయడం మొదలుపెట్టింది క్రైస్తవ వక్తలే. దీనితో తిక్కరేగి ముస్లిం వక్తలు కౌంటర్ అట్యాక్ స్టార్ట్ చేయగానే, తమ సొంత బైబిల్ నే కట్టుకధల గ్రంధంగా ప్రకటించుకుని అడ్డంగా బుక్కయ్యారు.

మొత్తానికి, ఇస్లామోఫోబియాను స్ప్రెడ్ చేయడాన్నే తమ కెరియర్ గా మార్చుకున్నోల్ల బండారం, ముస్లిం స్కాలర్లతో జరిపిన ఒక్కడిబేట్ ద్వారా బట్టబయలైంది. డివైన్ జస్టిస్ అంటే ఇదే కాబోలు.

Leave a Reply

Your email address will not be published.