హలీమా ఏడెన్: శరణార్థి శిబిరం నుండి – సెలెబ్రిటీ దాకా

1997 కెన్యా-సోమాలియాలలో అధికారంకోసం, వివిధ తెగలకు చెందిన సాయుధ దళాల మధ్య అంతర్యుద్ధం జరిగింది. దీనిలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది తమ సొంత ఇండ్లనూ,ఊర్లనూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.

అలాంటి హింసాత్మక పరిస్థితుల్లో, ఓ మహిళ తన పసిబిడ్డను సంకలో మోస్తూ, మిగతా ఇద్దరు కూతుర్లతో కలిసి 12రోజులపాటు నడుస్తూ, కెన్యా-సోమాలియా బార్డర్ లోని, ఐక్యరాజ్యసమితి వారు నిర్వహిస్తున్న కకుమా శరణార్థి శిబిరానికి చేరుకుంది.

Continue reading “హలీమా ఏడెన్: శరణార్థి శిబిరం నుండి – సెలెబ్రిటీ దాకా”

తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్

ఒకుయేవా నతాలియా – 1983లో చెచెన్యాలో జన్మించింది. 15 యేళ్ళ వయసులో ఫ్యాషన్ రంగంలో మోడల్ గా అడుగుపెట్టింది. 1999లో రష్యా-చెచెన్యా యుద్ధంలో తన సొంత దేశం చెచెన్యాను రష్యా నుండీ కాపాడుకోవడానికి మిలిటరీ లో జాయిన్ అయింది. సైన్యంలో తన తోటి సైనికుడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఇస్లాం లోకి మారి అమీనా ఒకుయేవా గా పేరు మార్చుకుంది.

Continue reading “తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్”

స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్

“నీ స్టేషన్ కి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ననుకున్నావా” – అని పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది.కొత్త కానిస్టేబుల్ ఏదేదో చేసేయాలనే తాపత్రయంలో,ఎమోషన్లో ఉంటాడు. కానీ, ఓ ముదురు సీఐ చేతిలో బలైపోతాడు. ఫేస్ బుక్కులో, హిజాబ్ ప్రయోజనాల్ని వివరించే కొందరు ముస్లిం పురుషుల్ని చూస్తుంటే- నాకు ఆ కొత్త కానిస్టేబులే గుర్తొస్తుంటాడు. ఇస్లాం ను పాజిటివ్ గా చూపించాలనే ఎమోషన్లో వీరు చేసే ఇల్లాజికల్ వాదనల్నే, నాస్తికులు,హేతువాదులు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటారు.

Continue reading “స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్”

సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు

సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. కొన్ని రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.

Continue reading “సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు”

ఈ వ్యాసం బురఖా గురించి – ముస్లిం పురుషులు, కొందరు అభ్యుదయవాదుల కోసం

ఓ హైకోర్ట్ అడ్వొకేట్,
ఓ ప్రభుత్వ గ్రూప్-1 ఆఫీసర్,
ఓ వెల్నోన్ సోషల్ యాక్టివిస్ట్,
ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్,
ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్,
చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్లు,సాఫ్ట్వేర్ ఇంజినీర్లు..
ఈ లిస్టు, నేను వివిధ సంధర్భాల్లో డైరెక్ట్గా కలిసిన,ఫోన్ లో మాట్లాడిన, హిజాబ్ ధరిస్తూనే తమ డే-టు-డే యాక్టివిటీస్ చేసుకునే ముస్లిం మహిళలది. వీరందరూ ప్రస్తుతం నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు.
అట్లే,

Continue reading “ఈ వ్యాసం బురఖా గురించి – ముస్లిం పురుషులు, కొందరు అభ్యుదయవాదుల కోసం”

రొటీన్ ఇంటర్వ్యూ – రొటీన్ ఏడుపు

“ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్(MCB)” – ఇది ఇంగ్లండ్ లో, ముస్లింల సంక్షేమం కోసం పని చేసే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ. దీని ఆధ్వర్యం లో దాదాపు 500 ఇతర సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థ కు సెక్రెటరీ జనరల్ గా గత వారం ‘జారా మహమ్మద్’ అనే 29 సంవత్సరాల బ్రిటీష్ మహిళ ఎన్నికైంది. ఇస్లాం-మహిళలు అనే అంశం గురించి సమాజంలో చలామణీలో ఉన్న అభిప్రాయాల దృష్ట్యా చూస్తే ఇదో విప్లవాత్మక విషయమనే చెప్పొచ్చు.

Continue reading “రొటీన్ ఇంటర్వ్యూ – రొటీన్ ఏడుపు”

మహిళలపై దాడులు – సాంస్కృతిక, సామాజిక కారణాలు

కొందరు టీనేజీ అబ్బాయిలూ,పురుషులూ బ్రిల్ క్రీం పూసుకుని జుట్టు పైకి లేపుకుని ఎందుకు తిరుగుతారు? ‘టోర్న్ జీన్స్’ పేరుతో చినిగిన జీన్స్ ప్యాంట్ ని వేల రూపాయలు పెట్టి ఎందుకు కొంటారు? ఎందుకంటే – అది ఫ్యాషన్ ని ఫాలో అవ్వడం అని అనుకుంటారు కాబట్టి. అలా అనుకునే, ఓ అమ్మాయి కూడా ఫ్యాషనబుల్ బట్టలు ధరించొచ్చు, ముఖానికి అందమైన మేకప్ లు వేసుకోవచ్చు. అది మీడియాలో చూపించే ఫ్యాషన్ అనుకరనే తప్ప, ఎవరినో పనిగట్టుకుని ఆకర్షించాలనో,రెచ్చగొట్టాలనో కాదు. ఈ చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా, ధరించే బట్టల ఆధారంగా స్తీల క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం అనేది సర్వసాధారణం ఐపోయింది.

Continue reading “మహిళలపై దాడులు – సాంస్కృతిక, సామాజిక కారణాలు”

మొన్న జైరా వసీమ్ – నిన్న సనాఖాన్!!!

సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. రెండు రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఇలా చేయటానికి ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.

Continue reading “మొన్న జైరా వసీమ్ – నిన్న సనాఖాన్!!!”

Islam అండ్ Sex

“శారీరక కోర్కెలు చాలా నీచమైనవి. మానవుడు వాటిని త్యజించి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బతకాలి” – అని ఇస్లాం చెప్తుందనుకుంటే – మీరు ముద్దపప్పులో కాలేసినట్టే.నిజానికి, పురుషుడికి అత్యంత ఆకర్షనీయమైనది స్త్రీ యే నని ఖురాన్ నిర్ధారిస్తుంది.(అక్నాలెడ్జ్ చేస్తుంది) “పురుషుడు వాంఛించేవి – స్త్రీలు, కుమారులు, బంగారు సంపద, సారవంతమైన భూములు, మేలిమి గుర్రాలు( ప్రస్తుత కాలంలో కార్లు..?). ఇవన్నీ ఇహలోక సౌఖ్యాలు మాత్రమే.”ఖురాన్ 3:14, (ఇంచుమించు అనువాదం)లిస్ట్ లో మొట్ట మొదటిది – స్త్రీ. అందంగా ఉన్న స్త్రీ పట్ల ఆకర్షితులవ్వడం, వారితో శారీరకంగా ఇదవ్వాలని కోరుకోవడం – ఇవన్నీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ డిజైన్. ఆ డిజైనర్ నుండీ వచ్చిన ఇస్లాం/ఖురాన్, మగాడి ఆ బేసిక్ ఫీచర్ ని తప్పుపట్టడమో, దానిని వదులుకుని, బ్రహ్మచారి లా బతకమనో చెప్పదు. బట్.. అయితే.. కానీ..

Continue reading “Islam అండ్ Sex”

ముస్లిం మహిళ డ్రెస్సు – ఎందుకు వివాదాస్పదం..?

చాలా మంది ముస్లిం మహిళలు రెలీజియసే గానీ, అందరి వేషధారణా ఒకే రకంగా ఉండదు. కొందరు ఫేస్ కూడా కవర్ చేసుకుంటారు. కొందరు ఫేస్ తప్ప, పై నుండీ కిందికి ఉండే బురఖా+హెడ్ స్క్రాఫ్ ధరిస్తారు, కొందరు ఓన్లీ తలపై స్క్రాఫ్ లాంటిది చుట్టుకుని మామూలు పంజాబీ డ్రస్సుల్నే వదులుగా ఉండేలా ధరిస్తారు. కొందరు జీన్స్+టాప్స్+హెడ్ స్క్రాప్స్ కూడా ధరిస్తారు. కొందరు ఫ్యాషన్ దుస్తులు ధరిస్తారు.

ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్..?

Continue reading “ముస్లిం మహిళ డ్రెస్సు – ఎందుకు వివాదాస్పదం..?”