ఇస్లాం లో కులాలు

ఇస్లాం లో కులాలు లేవు. సృష్టికర్తను నమ్మేవారు,నమ్మని వారు అని రెండే కేటగరీలు అక్కడ. నమ్మేవారికి – “మానవులందరూ ఒకే జంట సంతానం” అనే ఖురాన్ వాక్యం ఒక్కటి చాలు.

నమ్మని వారిలో రెండు కేటగరీలున్నారు..
1. “వివక్షను రూపుమాపడంలో అన్నిమతాల్లాగే ఇస్లాం కూడా ఫెయిల్.. కాబట్టి మతాలతో మంచి జరగదు.. మతాలు వేస్ట్” – అని డిక్లేర్ చేసేటోల్లు కొందరు.
2.అక్కడక్కడా, ఎక్కడో ఓ చోట.. ఫలానా ప్లేస్ లో.. ముస్లింలలో వివక్ష ఉందంట.. కాబట్టి ముస్లింలలో వివక్ష ఉందని ముస్లింలు డిక్లరేషన్ ఇస్తే, ఆ బేసిస్ మీద ప్రభుత్వం నుండీ రిజర్వేషన్లో,తాయిలాలో తెచ్చుకుని.. తర్వాత తీరిగ్గా వివక్షను రూపుమాపుకోవచ్చు కదా- అని సంస్కరణవాదులు కొందరు చెప్తుంటారు.

నా మాట:
మొదటి కేటగరీ వారితో మాటల్లేవ్.. వారి ఆనందానికి వారిని వదిలేయడమే.
రెండో కేటగరీ వారికి -రిజర్వేషన్లతో వివక్ష ఎప్పటికీ పోదు.. అలా పోయిన దాఖలాలు లేవు. కొన్నిసార్లు రిజర్వేషన్లే రివర్స్ వివక్షను కూడా రాజేస్తాయి.

పుట్టుకను బట్టి తాను/తాము గొప్పోల్లమని భావించే ముస్లింలు ఎవరైనా తారసపడితే -“ఒరే బుద్ధిలేదారా.. ఖురాన్/ప్రవక్త బోధనల్ని అర్థం చేసుకుని ఆచరించకుండా, ఈ ఎక్కువ-తక్కువలేంట్రా బేవకూఫ్ అని గడ్డిపెట్టాలి”. అలా భావించే సోకాల్డ్ ఉత్తమ/అగ్ర ముస్లిం లను, మిగతా ముస్లిం సమాజం బహిష్కరించాలి(వెలివేయాలి).

దిక్కుమాలినిజం… కేరాఫ్ ఫ్రాన్స్

“అసలు మహిళలబట్టల గురించి మగాల్లకెందుకు? నువ్వెందుకు ఆ విషయం గురించి రాస్తావ్” – అని ఓ తెలుగు ఉద్దరిస్టు గతంలో ఓ సారి నన్ను నిలదీసింది.”

” నువ్వడిగింది బాగానే ఉందక్కా.. కాకపోతే, బురఖా పిత్తురుస్వామ్య భావజాలమనీ, మహిళల్ని తొక్కేస్తుందనీ,బురఖాని విసిరికొట్టేసినోళ్ళే వీరవనితలనీ” – రాసే ఉద్దరిస్టు మగాల్లు గజానికొక్కరు చొప్పున ఉన్నారు. వారి బురఖా వ్యతిరేక పోస్టుల కింద “ముస్లిం మహిళలబట్టల గురించి మగాల్లకెందుకు?” అనే కామెంటు ఎప్పుడైనా రాశావా” అని అడిగా..

Continue reading “దిక్కుమాలినిజం… కేరాఫ్ ఫ్రాన్స్”