సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం

రాధేశ్యామ్ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కాశ్మీరీ ఫైల్స్ చాలాపెద్ద విజయం సాధించింది.ఇది నిశ్శబ్ద విప్లవం …అని మన హిందూత్వ మూకలు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని మీడియా ప్రచారం చేస్తోంది.చాలా ట్యూబులు ఇదే చెప్తున్నాయ్.స్వామీజీలు … హిందూ సంస్థలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు తప్ప …

Continue reading “సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం”

శోకాలు పెట్టొద్దు!!!

“కనపడినోళ్ళందరికీ నీ బాధలు చెప్పుకుని శోకాలు పెట్టకు. సగం మంది పట్టించుకోరు. మిగతా సగం లోలోపల ఆనందిస్తారు. నీ బాధలపట్ల కన్సర్న్ ఉన్న ఒకరిద్దరికి నీవు అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకుంటారు.” -ఇది వ్యక్తిగత స్థాయిలోనే కాక, ఓ సమూహంగా ముస్లిం సమాజం మొత్తానికి వర్తిస్తుంది.

Continue reading “శోకాలు పెట్టొద్దు!!!”

యూపీ ఎన్నికలు – MIM ప్రభావం

BJP- 42%
SP- 32%
BSP- 13%
INC- 2.4%
MIM – 0.46% (2% for 100 seats, which AIMIM contested)
ఇదీ లెక్క. దీని ఆధారంగా కొన్ని కన్‌క్లూజన్లు డెరైవ్ చేయొచ్చు.

నియోజకవర్గాల వారీగా డాటా తీసి, ఇక్కడ ఫలానా పార్టీ పోటీ చేయకపోయి ఉంటే, ఆ వోట్లు ఫలానా పార్టీకి పడి ఉంటే, ఈ పార్టీ కాకుండా- ఆ పార్టీ గెలిచి ఉండేది – అని మరో టైపు కన్‌క్లూజన్ లు కూడ డెరైవ్ చేయొచ్చు. అలా MIM పోటీ చేసిన కారణంగానే SP ఓడిపోయిందని చెప్పగల స్థానాలేవైనా ఉంటే, ఆ డీటైల్స్ కామెంట్స్ లో రాయమని మనవి. ఆధారాలు లేకుండా, కేవలం ఊహాగానాలు చేయడం టైమ్ వేస్ట్.

Continue reading “యూపీ ఎన్నికలు – MIM ప్రభావం”

ఓవైసీ : వాద-ప్రతివాదాలు

“వోట్లను చీల్చడానికే ఓవైసీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నాడంట. “

ఇంతకీ ఏ పొత్తులగురించన్నయ్యా నువ్ మాట్టాడేది? రాజకీయ పొత్తులా, మొక్కజొన్న పొత్తులా? మొక్కజొన్న పొత్తులైతే, అలా మార్కెట్ కెళ్ళి కొనుక్కుని సంకలో పెట్టుకుని రావొచ్చు. రాజకీయ పొత్తులకి రెండు పార్టీలూ అంగీకరించాలి కదా. బాబూరావ్ కుష్వాహ, ఓం ప్రకాష్ రాజ్భర్, చంద్రశేఖర్ రావన్ వంటి నాయకులతో కలిసి సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకోసం తాను ఎంతలా ప్రయత్నించాడో TheLallantop ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఓవైసీ డీటైల్డ్ గా వివరించాడు. అతను చెప్తున్నవి అబద్ధాలని ఈ ముగ్గురు లీడర్లలో ఒక్కరూ కూడా ప్రకటించలేదు. పొత్తుకోసం అఖిలేశ్ యాదవ్ ఒప్పుకోకపోతే ఓవైసీ ఏం చేస్తాడు? అఖిలేష్ ఇంటిముందు టెంట్ వేసుకొని భగ్న ప్రేమికురాలి లాగా నిరాహార దీక్ష చేయాలా? ఫేస్ బుక్ లో నాలుగు సోది రాతలు రాసుకునేవారికే ‘వాడు నాకు లైక్ కొట్టకుంటే నేనెందుకు కొడతా’ అని దిక్కుమాలిన ఇగో లుండే కాలంలో, ఓ పార్టీ ప్రెసిడెంట్ కి వారి,వారి కన్సర్న్ లు వారికి ఉండవా?

Continue reading “ఓవైసీ : వాద-ప్రతివాదాలు”

తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్

ఒకుయేవా నతాలియా – 1983లో చెచెన్యాలో జన్మించింది. 15 యేళ్ళ వయసులో ఫ్యాషన్ రంగంలో మోడల్ గా అడుగుపెట్టింది. 1999లో రష్యా-చెచెన్యా యుద్ధంలో తన సొంత దేశం చెచెన్యాను రష్యా నుండీ కాపాడుకోవడానికి మిలిటరీ లో జాయిన్ అయింది. సైన్యంలో తన తోటి సైనికుడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఇస్లాం లోకి మారి అమీనా ఒకుయేవా గా పేరు మార్చుకుంది.

Continue reading “తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్”

“ఓవైసీ వల్ల బీజేపీకి లాభమే”

ఓవైసీ ఒంటరిగా పోటీ చేస్తే అది బీజేపీ కి లాభం, సెక్యులర్ పార్టీలకు నష్టం అనేది బేసిక్ కూడికలు,తీసివేతలు తెలిసిన వారందరికీ కూడా అర్థమయ్యే విషయమే. దీనికి పెద్దగా డిటెక్టివ్ అనాలసిస్ లు అవసరం లేదు. ఎంత లాభం అనే విషయం మిగతా పార్టీల బలాబలాల్ని బట్టి మారుతుంటుంది.

Continue reading ““ఓవైసీ వల్ల బీజేపీకి లాభమే””

సూటిగా.. సుత్తి లేకుండా..

జగన్ ఏం హామీలిచ్చాడు, YSRCP మ్యానిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధంలేకుండా. చాలా మంది రెడ్డీస్.. దాదాపుగా.. జగన్ పార్టీకే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని YSRCP నాన్-రెడ్డీస్ కి వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతరులు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

చంద్రబాబు ఏం హామీలిచ్చాడు, టీడీపీ మేనిఫెస్టోలో ఏముంది.. వంటి అంశాలతో సంబంధం లేకుండా చాలా మంది చౌదరీలు( కమ్మాస్) టీడీపీ కే ఓటేస్తారు. ఆ పార్టీ తమదిగా భావిస్తారు. అలాగని టీడీపీ చౌదరేతరులకు వ్యతిరేక పార్టీ కాదు. దానికి ఇతర వర్గాల వారు కూడా ఓటేస్తారు. ఇతర వర్గాల నాయకులు కూడా ఆ పార్టీలో చాలామంది ఉన్నారు.

Continue reading “సూటిగా.. సుత్తి లేకుండా..”

ముస్లిం ఓట్ల చీలిక – కొన్ని కామెంట్లు!!

ఈ డిస్క్లైమర్ చివర్లో చెప్తారు, నేను ముందే చెప్తున్నా – నాకు యం.ఐ.యం పార్టీలో నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైంది – వాటిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, అంటే – ఎవరు ఎక్కడి నుండీ పోటీచేయాలి, ఎవరెవరితో, ఏ అంశాల ఆధారంగా పొత్తు పెట్టుకోవాలి – వంటి ముఖ్యమైన విషయాల గురించి, ఎలాంటి విధానాలూ, చర్చలూ, డిస్కషన్లూ లేకుండా, కేవలం ఓవైసీ సోదరులిద్దరు మాత్రమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు. ఇది మంచి పద్దతి కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ లో పార్టీలు నడవాల్సిన పద్దతి ఇది కాదు. బట్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్స్ లో, కంపారెటివ్ గా చూసుకుంటే, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ముస్లింలు యం.ఐ.యం.కే ( Or PFI, ముస్లిం లీగ్, ఆ ఏరియాల్లో ఏది బలంగా ఉంటే దానికి) ఓటు వేయడం మంచిదనేది నా అభిప్రాయం. ఇది క్లియర్.

Continue reading “ముస్లిం ఓట్ల చీలిక – కొన్ని కామెంట్లు!!”

ఇదో టైపు ఫోబియా, ఆత్మ న్యూనత

ఎక్కడైనా తీవ్రవాద దాడి జరగగానే ముస్లింలే చేశారని ముందుగా అనౌన్స్ చేయడం -> అది బాగా వైరల్ అవ్వడం -> తర్వాత అది చేసింది ముస్లింలు కాదని తెలియగానే, సైలెంట్ గా దానిని కప్పెట్టేయడం -> ఇదో రొటీన్ తంతు, ప్రపంచ వ్యాప్తంగా.

మన దేశంలో ఇలాంటి మరో ప్యాటర్న్ : సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు ఓడిపోగానే, MIM పార్టీని బ్లేమ్ చేయడం -> దానిని వైరల్ చేయడం -> నియోజకవర్గాల వారీ డేటా ప్రకారం MIM పార్టీని నిందించడానికేం లేదని తెలియగానే ముఖానికి నల్లరంగేసుకుని సైలెంటైపోవడం – ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగే రొటిన్ తంతు.

Continue reading “ఇదో టైపు ఫోబియా, ఆత్మ న్యూనత”

కట్టప్ప ఎన్నికల్లో నుల్చోకూడదు!!

బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో, 39 స్థానాలు బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒకే ఒకస్థానంలో నెగ్గింది. అది – కిషన్ గంజ్.

ఆ ఎన్నికల్లో , యం.ఐ.యం – బీహార్ లో ఒకే ఒక్క స్థానం లో పోటీ చేసింది. అదేంటో ఊహించండి.అది – కిషన్ గంజ్.

Continue reading “కట్టప్ప ఎన్నికల్లో నుల్చోకూడదు!!”