కడుపు నింపే బక్రీద్!! 

కడుపు నింపే బక్రీద్!!  

=================== 

నేను: ఏ వూరు పెద్దాయనా మీది?
ఓ పెద్దాయన: సుంకేసుల కాడ.
నేను:పెద్ద మాంసమైనా తీసుకుంటరు కదా?(బీఫ్ గురించి)
పెద్దయన: మాకట్టా ఏం లేదయ్యా. ఏదైనా ఒకటే.
నేను: ఏ మాత్రం వస్తుంది ఒక్కొక్కరికి?
పెద్దాయన: 2,3 కిలోలు.
నేను:ప్రతి సంవత్సరం వస్తరా?
పెద్దాయన: అవ్నయ్యా ప్రతేడూ వస్తంటం.
నేను:ఏం చేస్తారు ఒక్కసారిగా ఇంత మాంసం?
పెద్దాయన:తీస్కపోయి ఎండేసుకుంటం.

Continue reading “కడుపు నింపే బక్రీద్!! “

చరిత్ర మరచిన స్వతంత్ర్య సమర యోధుడు – షేర్ అలీ అఫ్రీది!!

భారత ఉపఖండానికి వైశ్రాయ్ గా ఉన్నవారిలో,  హత్య చేయబడ్డ ఏకైక వైశ్రాయ్ ఎవరు?
దీనికి సమాధానం – లార్డ్ మయో. ఇది సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఇంపార్టెంట్ బిట్- అని కోచింగ్ సెంటర్లలో చెప్తుంటారు.

ఎవరు చంపారు, ఎందుకు చంపారు వంటి వివరాలలోకి మాత్రం ఎవరూ వెల్లరు. ఒకవేళ ఎవరైనా డౌట్ అడిగినా, ఏవో వ్యక్తిగత కారణాలతో ఎవరో చంపేశారులెమ్మని దానిని దాటవేస్తారు.
Continue reading “చరిత్ర మరచిన స్వతంత్ర్య సమర యోధుడు – షేర్ అలీ అఫ్రీది!!”

నీకు పౌరసత్వం లేదు … పో… పో…

నీకు పౌరసత్వం లేదు … పో… పో…
– వాహెద్
—————————————-
అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా విధానాల్లో మార్పులు వచ్చాయి. అమెరికాలో భవిష్యత్తేమిటో అన్న ఆందోళన మనవారిలో మొదలైంది.
ఇక్కడ బిజేపి అధికారంలోకి వచ్చింది. అస్సాంలో మనవాళ్ళెంతమంది, పరాయివాళ్ళెంత మంది తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. దశాబ్దాలుగా అస్సాంలో నివసిస్తున్న కుటుంబాలు ఇప్పుడు ఇక్కడి వాళ్ళు కాదు పొమ్మంటే ఏం చేయాలో పాలుబోని స్థితి. నిన్నటి వరకు సాగు చేసిన పొలంపై హక్కులేదు. నిన్నటి వరకు నివసించిన ఇల్లు పరాయిదైపోయింది.

Continue reading “నీకు పౌరసత్వం లేదు … పో… పో…”