ప్రవక్తకు అవమానం – వివిధ స్పందనలు

మా పాత టీమ్‌లో ఒకడుండేవాడు. అతన్ని ఒక్కమాటలో “టెక్నికల్ తోపు” అనొచ్చు. మిగతా వాళ్ళు సాల్వ్ చేయలేమని చేతులెత్తేసిన కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని కూడా, అతను ఓ గంట లో సాల్వ్ చేయగలడు, అంత మేధావి. ‘360 డిగ్రీ అనాలిసిస్’ అనే పదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అతను.

Continue reading “ప్రవక్తకు అవమానం – వివిధ స్పందనలు”

ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్

ఇటీవల ఉర్లోని ఓ ఫ్రెండ్ కి కాల్ చేశాను. మాటల మధ్యలో,దేశ రాజకీయాల గురించి చర్చ వచ్చింది. “తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయిగానీ, చెడ్డీగాల్లు బ్యాక్గ్రౌండ్ లో ఏమేం స్కెచ్చు లేస్తున్నారో తెలీదు, వారికొచ్చే ఫండ్స్, వారి ప్రాబల్యం క్రమంగా పెరిగిపోతున్నట్లు మాత్రం క్లియర్ గానే కనిపిస్తుంది” – అన్నాడు. మరో కామెంట్ కూడా చేశాడు. అది – “మనోళ్ళు కూడా ఏమీ తగ్గట్లేదు. పొద్దున 4 గంటలనుండీ మొదలు పెడ్తారు, ప్రతి ఐదు-పది నిమిషాలకీ, “రోజ్ దారో ఉఠో.. సహర్ కరో.. వక్థ్ హోజారా…” – అంటూ, లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నారు. చుట్టూ ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు.అసలే వేసవి కాలం, పైన డాబాలమీద పడుకుంటుంటారు, వారికి డిస్టర్బెన్స్ ఎందుకు అనే ఆలోచనలేమీ లేవు. వీళ్ళు చేసే ఇలాంటి పనులే, చెడ్డీ గాల్లు వారి మీటింగ్ లలో హైలెట్ చేస్తుంటారు.. ఈ విషయం మనోళ్ళకు ఎప్పటికి అర్థం కావాలో ఏమో” -అన్నాడు.

Continue reading “ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్”

కట్టుకథల్ని బట్టబయలు చేసిన ఆక్స్ ఫర్డ్ పరిశోధన

1.9 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు,
57 మంది రీసెర్చర్స్,
20 దేశాల్లో,
40 ప్రత్యేక పరిశోధనలు,
వీటన్నిటి వల్లా.. చివరికి తేలిందేమంటే – మనిషి పుట్టుకతోనే సృష్టికర్తపైన, మరణానంతర జీవితంపైన నమ్మకంతో పుడతాడని.

Continue reading “కట్టుకథల్ని బట్టబయలు చేసిన ఆక్స్ ఫర్డ్ పరిశోధన”

డ్రగ్ నియంత్రణలో తాలిబాన్ బెస్ట్!!!

ఈ మాట అన్నది ఏ ముల్లానో, ముస్లిమో అనుకుని భ్రమపడేరు.

Department of Social Sciences, Loughborough University, Loughborough, Leicestershire, UKకి చెందిన Professor Graham Farrell,
Department of Criminal Justice, University of Cincinnati, Cincinnati, OH, USAకి చెందిన Professor John Thorne లు కలిసి పరిశోధన చేసి, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ విభాగం వారి వివిధ రిపోర్టులూ, తాలిబాన్లతో ఈ డ్రగ్ కంట్రోల్ విభాగం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి – ఆఫ్ఘనిస్తాన్లో తమ ఆధీనంలోని ప్రాంతాల నుండీ హెరాయిన్ తయారీకి ఉపయోగించే ‘ఒపియం పాపీ’ అనే గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంలో తాలిబాన్లు 99% సఫలీకృతమైనట్లు ప్రకటించారు.

Continue reading “డ్రగ్ నియంత్రణలో తాలిబాన్ బెస్ట్!!!”

రవీష్ కుమార్ స్వర్గానికి వెళ్తారా, లేదా?

ఇటీవల జకీర్ నాయక్ ని, ఈ ప్రశ్న అడిగారు. ఆయన ఏదో సమాధానం చెప్పారు. దానిని చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు.

ఈ ప్రశ్నకు నాకు తోచిన సమాధానం ఇది.

********* ప్రశ్నవేయగానే ఠంచనుగా సమాధానం కోసం వెతుక్కోకుండా, కొన్ని సార్లు ప్రశ్ననే ప్రశ్నించాల్సి ఉంటుంది.

Continue reading “రవీష్ కుమార్ స్వర్గానికి వెళ్తారా, లేదా?”

ఐడెంటిటీ – సమానత్వం

కొన్నేళ్ళ క్రితం, ఆంధ్రజ్యోతి పత్రికలో, “నేను-మా జేజబ్బ-పాకిస్తాన్” – అనే టైటిల్ తో నేను రాసిన ఓ వ్యాసంలో ఈ క్రింది విషయాలు మెన్షన్ చేశాను. <==నేను పుట్టింది 1981లో, మా నాన్న పుట్టింది 1950లో. కాబట్టి దేశవిభజనతో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఎవరైనా అడగాలనుకుంటే, దేశవిభజన సమయంలో నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదని మా జేజబ్బని అడిగి ఉండవచ్చు. ఆయన 1987లోనే మరణించారు కాబట్టి, నిరక్షరాస్యుడు కావడంతో, డైరీలు గట్రా లాంటివేమీ రాయలేదు కాబట్టీ, ఆయన ఎందుకు వెళ్ళలేదనే విషయం కశ్చితంగా తెలిసే ఆస్కారం లేదు. కాకపోతే, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే దానికి సమాధానం దొరికే అవకాశం ఉంది.

Continue reading “ఐడెంటిటీ – సమానత్వం”

’ఆ నలుగురు’ ముస్లింలు ఎవరు, ఎందుకు చేస్తునారు?

ప్రస్తుతం దేశంలో ఏ మూల చూసినా, పల్లె,పట్నం అనే తేడా లేకుండా, కరోనా మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో ముస్లింలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు.చనిపోయిన వారి మతంతో సంబంధం లేకుండా, ఏ మతస్థులకు ఆ మత ఆచారమం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కరోనా సోకుతుందేమోననే భయంతో, కడుపున పుట్టిన బిడ్డలు, సొంత తోబుట్టువులే శవం దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న ప్రస్తుత పరిస్థుతుల్లో, ముస్లింలు తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆ పార్దీవదేహాలను గౌరవ మర్యాదలతో మోసి, స్మశానవాటికలకు తరలిస్తున్నారు.

Continue reading “’ఆ నలుగురు’ ముస్లింలు ఎవరు, ఎందుకు చేస్తునారు?”

ఖురాన్ లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు..?

పదో క్లాసులోనో,ఇంటర్లోనో మొదటిసారిగా తెలుగులో ఖురాన్ చదివే ప్రయత్నం చేసినట్లు గుర్తు. కానీ, రెండో చాప్టర్ అల్-బఖరా ని దాటి ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు. కొన్ని లైన్స్ చదవగానే నిద్రరావడమో, అక్కడి కంటెంట్ అర్థం కాక, మైండ్ వెంటనే వేరే విషయాలపైకి డైవర్ట్ అవ్వడమో జరిగేది.

Continue reading “ఖురాన్ లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు..?”

పాలస్తీనా -ఇజ్రాయెల్ లలో ఎవర్ని సపోర్ట్ చేయలి?

ఓ పురుషుడు,ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మహిళ తనకున్న కొద్దిపాటి బలంతో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

“పాపం, అతన్ని ఎలా గోల్లతో రక్కిందో చూడండి.
ఎలా అతని జుట్టుపట్టుకుని లాగిందో చూడండి.
ఎలా అతన్ని కాల్లతో తన్నిందో చూడండి” – అంటూ మాట్లాడేవారు తటస్థంగా ఉన్నట్లా?

Continue reading “పాలస్తీనా -ఇజ్రాయెల్ లలో ఎవర్ని సపోర్ట్ చేయలి?”

హదీస్ కలెక్షన్ ఎప్పుడు, ఎలా జరిగింది..?

ఖురాన్ – మహమ్మద్ ప్రవక్త(pbh) కు దేవదూత ద్వారా వచ్చిన దైవసందేశం. ఇది అరబిక్ పోయెట్రీ రూపంలో ఉంటుంది. దేవదూతనుండి సందేశం రాగానే, ప్రవక్త అనుచరుల్ని సమావేశపరిచి ఆ వాక్యాల్ని చదివి వినిపించేవారు. అప్పటి అరబిక్ సమాజం మెమరీ బేస్డ్ సమాజం కావడంతో, వచ్చిన వాక్యాలు వచ్చినట్లు వారు కంఠతా పట్టేసేవారు. తరువాత వాటినే నమాజులో కూడా ఉచ్చరించేవారు. ఫలితంగా, ప్రవక్త జీవిత కాలంలోనే చాలా మంది ప్రవక్త అనుచరులకు ఖురాన్ మొత్తం కంఠతా వచ్చేసింది.

Continue reading “హదీస్ కలెక్షన్ ఎప్పుడు, ఎలా జరిగింది..?”