వ్యాక్సీన్ తయారీలో ఆవులు:

సుమారు పదేల్ల క్రితం, హైదరాబాద్, అశొక్ నగర్లో గ్రూప్-1 మెయిన్స్ కి కోచింగ్ తీసుకున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీ కి హరిక్రిష్ణ అనే ఆయన ఫేమస్.

Continue reading “వ్యాక్సీన్ తయారీలో ఆవులు:”

జకీర్ నాయక్: సున్నీ-షియాల్లో ఎవరు కరెక్ట్..?

గ్లోబల్ ముస్లిం పాపులేషన్ లో తమను తాము షియాలుగా పిలుచుకునేవారు 10% కంటే తక్కువ. అలా తమని తాము షియాలుగా పిలుచుకోని వారు 90%. సున్నీ-షియాల్లో ఎవరు కరెక్ట్ అనే ప్రశ్నకు, జకీర్ నాయక్ మెజారిటీల సైడ్ తీసుకుని, సున్నీలే కరెక్ట్, షియాలు రాంగ్ అని స్టేట్మెంట్ ఇవ్వడం నిమిషం పని. దాని ద్వారా అతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు. పైగా, ముస్లిమేతర మేధావులు చెప్తున్నట్లు, సున్నీ-షియాల మధ్య అంత పెద్ద గొడవలే ఉంటే, “సున్నీలే కరెక్ట్” అని చెప్పినందుకు, సున్నీల్లో జకీర్ నాయక్ పాపులారిటీ కూడా మరింతగా పెరుగుతుంది. ఐనప్పటికీ జకీర్ నాయక్ ఆ పని ఎందుకు చేయడు? ఖురాన్,హదీస్ లే ఫైనల్ అని ఎందుకు చెప్తాడు? ఆలోచించండి. ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఆల్రెడీ మొత్తం తెలుసుకున్న మేధావులమని ఫిక్సైపోతే,కొత్తగా తెలుసుకునేదేం ఉండదు. సెటైర్లేసుకుని తాత్కాలికానందాలు పొందడం తప్ప

సున్నీ-షియా : ఓ దాదా

దారినపోయే దానయ్య(దాదా): ఇస్లాంలో, సున్నీ-షియా లని ఉన్నారంట కదా, వాల్లిద్దరి మధ్య తేడా ఏంటి? ముస్లిం: ఖురాన్,ప్రవక్త బోధనల్లో సున్నీ,షియా అనే పదాలు లేవు. జస్ట్ ‘ముస్లిం’ అనే ఉంది. దాదా: లేకుంటే అన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి. నువ్వు ఇంతకూ సున్నీవా, షియా వా? ముస్లిం: నేను జస్ట్ ముస్లిం ని. ప్రవక్త మరణం తర్వాత ఎవరు ఖలీఫా కావాలి అనే రాజకీయపరమైన అభిప్రాయబేధాలతో కొందరు తమను తాము షియాలుగా పిలుచుకుంటారు. వారు నమ్మేది కూడా ఒకే ఖురాన్ నే, ఒకే ప్రవక్తనే – ఆ బోధనల్లో ఎక్కడా సున్నీ,షియా అనే పదాలు లేవు.

Continue reading “సున్నీ-షియా : ఓ దాదా”

ఐడెంటిటీ – సమానత్వం

కొన్నేళ్ళ క్రితం, ఆంధ్రజ్యోతి పత్రికలో, “నేను-మా జేజబ్బ-పాకిస్తాన్” – అనే టైటిల్ తో నేను రాసిన ఓ వ్యాసంలో ఈ క్రింది విషయాలు మెన్షన్ చేశాను. <==నేను పుట్టింది 1981లో, మా నాన్న పుట్టింది 1950లో. కాబట్టి దేశవిభజనతో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఎవరైనా అడగాలనుకుంటే, దేశవిభజన సమయంలో నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదని మా జేజబ్బని అడిగి ఉండవచ్చు. ఆయన 1987లోనే మరణించారు కాబట్టి, నిరక్షరాస్యుడు కావడంతో, డైరీలు గట్రా లాంటివేమీ రాయలేదు కాబట్టీ, ఆయన ఎందుకు వెళ్ళలేదనే విషయం కశ్చితంగా తెలిసే ఆస్కారం లేదు. కాకపోతే, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే దానికి సమాధానం దొరికే అవకాశం ఉంది.

Continue reading “ఐడెంటిటీ – సమానత్వం”

మతం మారాము – కులం పోయింది

‘మతం మారినా కులం పోదని’ – కొందరు తీర్మానాలు చేస్తున్నారు. నా వ్యక్తిగత విషయమే తీసుకుంటే, మా పెద్దోల్లు చెప్పిందాన్ని బట్టి, మా జేజబ్బగానీ, వాళ్ళ నాన్నగానీ కలిమా చదివి ఇస్లాం స్వీకరించారని అర్థమవుతుంది. అంతకు ముందు వారి కులమేదో ఎగ్జాక్ట్ గా తెలీదు. వారి జీవన విధానాన్ని బట్టి, అగ్రకులాలతో అంటరానివారిగా తీర్మానించబడిన కులం వారని మాత్రం తెలుస్తుంది.

Continue reading “మతం మారాము – కులం పోయింది”