స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్

“నీ స్టేషన్ కి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ననుకున్నావా” – అని పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది.కొత్త కానిస్టేబుల్ ఏదేదో చేసేయాలనే తాపత్రయంలో,ఎమోషన్లో ఉంటాడు. కానీ, ఓ ముదురు సీఐ చేతిలో బలైపోతాడు. ఫేస్ బుక్కులో, హిజాబ్ ప్రయోజనాల్ని వివరించే కొందరు ముస్లిం పురుషుల్ని చూస్తుంటే- నాకు ఆ కొత్త కానిస్టేబులే గుర్తొస్తుంటాడు. ఇస్లాం ను పాజిటివ్ గా చూపించాలనే ఎమోషన్లో వీరు చేసే ఇల్లాజికల్ వాదనల్నే, నాస్తికులు,హేతువాదులు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటారు.

Continue reading “స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్”

సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు

సనాఖాన్ – హిందీ,తమిల్,తెలుగు,కన్నడ కలిపి 15 సినిమాలూ, హిందీ బిగ్-బాస్, ఝలక్ దిఖ్లాజా వంటి కొన్ని టీవీ షోలూ చేసింది. కొన్ని రోజుల ముందు – సడెన్ గా తాను టీవీ/సినిమాలకూ, మొత్తంగా మోడలింగ్/ఎంటర్టైన్మెంట్ రంగానికీ స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. తన ట్విట్టర్,ఇన్స్టాగ్రాం అకౌంట్ల నుండీ, తాను గతంలో పోస్ట్ చేసిన అన్ని గ్లామరస్ ఫోటోలనూ డిలీట్ చేసేసింది. హిజాబ్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇదంతా చేయడం వెనక తన మైండ్లో నడిచిన థాట్ ప్రాసెస్ ని ఓ చక్కని పోస్టులో రాసింది.
ఈమె చెప్పిన ప్రధాన కారణాలు రెండు.

Continue reading “సైరాబాను-ముంతాజ్-జీనత్అమన్- జైరా వసీం-సనాఖాన్-తటస్థులు”

ఈ వ్యాసం బురఖా గురించి – ముస్లిం పురుషులు, కొందరు అభ్యుదయవాదుల కోసం

ఓ హైకోర్ట్ అడ్వొకేట్,
ఓ ప్రభుత్వ గ్రూప్-1 ఆఫీసర్,
ఓ వెల్నోన్ సోషల్ యాక్టివిస్ట్,
ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్,
ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్,
చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్లు,సాఫ్ట్వేర్ ఇంజినీర్లు..
ఈ లిస్టు, నేను వివిధ సంధర్భాల్లో డైరెక్ట్గా కలిసిన,ఫోన్ లో మాట్లాడిన, హిజాబ్ ధరిస్తూనే తమ డే-టు-డే యాక్టివిటీస్ చేసుకునే ముస్లిం మహిళలది. వీరందరూ ప్రస్తుతం నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు.
అట్లే,

Continue reading “ఈ వ్యాసం బురఖా గురించి – ముస్లిం పురుషులు, కొందరు అభ్యుదయవాదుల కోసం”