ఆటోఫజీ కి నోబెల్

ఆటోఫజీ అంటే, “తన్ను తాను తినేయడం” అని అర్థం. కొన్ని కణాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమని తాము తినేసుకుని/నాశనం చేసుకుని అంతరించిపోతాయి. ఈ కాన్స్పెట్ మొదటిసారి 1950 లో వెలుగులోకి వచ్చింది. యోషినోరీ ఓసుమి అనే జపనీస్ శాస్త్రవేత్త, ఈస్ట్ కణాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి, దీనిని ఆధారాలతో నిరూపించాడు. అంతటితో ఆగకుండా, మానవ శరీర కణాలలో కూడా ఆటోఫజీ లక్షణం ఉందని నిరూపించాడు. ఆటోఫాగీ ఆధారంగా క్యాన్సర్,అల్జీమర్స్ లాంటి వ్యాధికారక కణాల్ని నిర్మూలించవచ్చని ప్రతిపాదించాడు. ఈ పరిశోధనలకు గానూ, 2016 లో ఈయనకు వైద్యరంగం లో నోబుల్ బహుమతి లభించింది.

Continue reading “ఆటోఫజీ కి నోబెల్”

కౌంటర్ ఆర్గ్యుమెంట్లు – సోషల్ మీడియా ట్రెండ్

“మతాలన్నీ ముఢాచారాలని కలిగిఉన్నాయనీ, వీటికి శాస్త్రీయత ఉండదనీ. జనాలు ఏది,ఎందుకు చేస్తున్నారో తెలీకుండా గుడ్డిగా చేస్తుంటారనీ, మెదడు అస్సలు ఉపయోగించరనీ” – విమర్శిస్తుంటారు.

“దర్గాలకు వెళ్ళి సమాధులకు మొక్కడం, పీర్లను ఎత్తుకుని ఊరేగడం ” – లాంటి వన్నీ మూఢాచారాలని నేనంటే – “నీకు సూఫీయిజం గొప్పతనం తెలీదు, అది వివిధ మతాలోల్లనందర్నీ ఎలా దగ్గర చేస్తుందో నీకు తెలీదు, నువ్వు ఫండమెంటలిస్టువి అని వీల్లే మళ్ళీ విమర్శిస్తారు.

Continue reading “కౌంటర్ ఆర్గ్యుమెంట్లు – సోషల్ మీడియా ట్రెండ్”