“సాయంత్రం 5 గంటలకు ఇస్లాం లోకి మారితే, 5.30 కల్లా అంటరానితనం నుండీ విముక్తులై, ఏ వీధిలోనైనా తలెత్తుకుని తిరగొచ్చు” – ఆగస్టు 2, 1931 నాడు చేసిన ప్రసంగంలో పెరియార్ రామస్వామి.( Source : Page number 160. from the book -“FUZZY AND NEUTROSOPHIC ANALYSIS OF PERIYAR’S VIEWS ON UNTOUCHABILITY” )తాను దేవుడు,స్వర్గం-నరకం లాంటివి నమ్మని నాస్తికున్నైనప్పటికీ, దలితులకు అంటరానితనం నుండీ విముక్తి కలిగించే గొప్పమార్గం ఇస్లాం అని పెరియార్ రామస్వామి అనేక సార్లు స్పష్టంగా చెప్పి ఉన్నారు. నాస్తికుడై ఉండి, ఇలా మతాన్ని ప్రాపగేట్ చేయడమేంటనే విమర్శలు వచ్చినా ఆయన లెక్కచేయలేదు. అనేక ఉపన్యాసాలు,రచనల్లో దలితులు ఇస్లాం/బౌద్ధం లలోకి మారి అంటరానితనం నుండీ విముక్తులవ్వాలని అభిప్రాయపడ్డారు. పెరియార్ రచనలద్వారా ప్రభావితమవ్వడం వల్లే తాను ముస్లిం గా మారుతున్నానని దలిత్ కెమెరా వ్యవస్థాపకుడు, రాయీస్ మహమ్మద్ గా మారిన రవిచంద్రన్ బత్రన్ , ఫిబ్రవరి 3, 2020 న ప్రకటించారు.నేడు పెరియార్ 141వ జయంతి.