వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ – అనే ప్రశ్నకు చెప్పే స్టాండర్డ్ సమాధానం – “సృష్టికర్తను ఆరాధించడం(ఇబాదత్)”. ఇది సైద్ధాంతికంగా కరెక్టే గానీ, చాలా సార్లు అసంపూర్ణంగానూ, “కేవలం ఆరాధించడమేనా, ఇంకేం లేదా” – అనే ఓ రకమైన వెలితి-భావనను కలిగిస్తుంది.
దీనిని ఇంకొంచెం జూమ్-అవుట్ చేస్తే – ఇమారా,ఇబాదా,ఖలీఫా అనే మూడు పర్పస్ లు కనిపిస్తాయి. అల్-రాఘిబ్-అల్-ఇస్ఫహాని అనే 11 వ శతాబ్ధపు ఇస్లామిక్ స్కాలర్, ఖురాన్-హదీస్ లనుండీ, ఈ మూడు లక్ష్యాలను ప్రతిపాదించారు.
ఇమారా:
మనుగడకు కావలసిన ప్రాధమిక నైపుణ్యాలను సముపార్జించడం. తన కాళ్ళపై తాను నిలబడగలిగేలా, తనకు,తన కుటుంబం మనుగడకు కావలసిన ప్రాధమిక అవసరాలు తీర్చుకునేలా తనను తాను మలుచుకోవడం.
ఇబాదా:
అంటే సృష్టికర్తను ఆరాధించడం. నమాజ్,జకాత్,హజ్.. ఇలాంటివన్నీ ఇబాదత్ లో భాగమే. ఇక్కడ ముఖ్యమైన విషయం- ఇమారా-ఇబాదా రెండూ ప్యారలల్ గా కొనసాగుతాయి. అంటే, సొంత కాళ్ళపై నిలబడం,కుటుంబం ప్రాధమిక అవసరాలు తీర్చడం ముఖ్యమే కానీ-దానికోసం సృష్టికర్త నిషేధించిన పనులు చేయకూడదు. ఉదాహరణకు – “నా కుటుంబం మనుగడకోసం నేను ఆల్కహాల్/డ్రగ్స్ అమ్మితే తప్పేంటని”- అడిగే ఆస్కారం లేదు. తల్లిదండ్రులు-భార్యా-పిల్లల కోసం, నీతిగా/న్యాయంగా చేసే ప్రతి పని, అది ఎంత చిన్నదైనా సరే, ఇబాదత్ లో భాగమే నంటుంది ఇస్లాం.
ఖలీఫా:
అంటే – సృష్టికర్త తరుపున, సృష్టికర్త యొక్క ప్రతినిధి గా ఉండటం. సృష్టికర్త లక్షణాలైన జాలి,దయ,కరుణ,నీతి,న్యాయం వంటివాటిని మనకున్న కెపాసిటీ(డబ్బు,సమయం,పరపతి,నాలెడ్జ్,సోషల్ మీడియా రీచ్..etc)మేరకు అమలుపరచడం. అమలు పరచాలనే లక్ష్యంతో, ఆ కెపాసిటీని నిరంతరం మెరుగుపర్చుకుంటూ ఉండటం.
అమెరికన్ స్కాలర్ -“టామ్ ఫక్కీన్” ఈ అంశం గురించి ఇచ్చిన స్పీచ్ వీడియో –