ఈ చైన్ ఎలా బ్రేక్ అవ్వాలి..?

ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ “ఘర్ వాపసీ” అంటూ ఏదో కూశాడు.దీని గురించి అసదుద్దీన్ ఓవైసీ ఇంకేదో చెప్పాడు. “వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓవైసీ” – అనే న్యూస్ ట్రెండింగ్. ఈ ట్రెండింగ్ అనేది కేవలం గోదీ మీడియాలోనే కాదు. దాదాపు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లోనూ ఇదే తంతు. సోషల్ మీడియాలో కొందరు తటస్థ మేధావులు ఉంటారు కదా. వారు, తటస్థులు కాబట్టి, ఓవైసీని ఒక్కన్నే తిట్టకుండా, మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని కూడా కోట్ చేసి, ఇద్దర్నీ కలిపి తిడతారన్నట్లు, ఆ రకంగా తాము బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసినట్లు ఫీలవుతుంటారు.

కానీ, ఇక్కడ అసలు విషయం ఏందంటే – మోహన్ భగవత్ కూసింది – పూర్తి రాజ్యాంగ వ్యతిరేక, రాజ్యాంగాన్ని పరిహాసం చేసే వ్యాఖ్యలు. కానీ, అసదుద్దీన్ చెప్పింది – రాజ్యాంగం పక్కాగా,చక్కగా అనుమతించబడిన మాట. ఈ విషయం అర్థం కావాలంటే, ఇస్లాం గురించిన కనీస నాలెడ్జ్ ఉండాలి. మన సో కాల్డ్ తటస్థ మేధావులకు లేనిది అదే.

***********

వివరాల్లోకి వెళ్ళే ముందు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ విభాగం వారు, అనేక దేశాల్లో, అనేక సమాజాల్లో, వివిధ వయసున్న పిల్లల మానసిక ఎదుగుదలపై చేసిన స్టడీ గురించీ, “Humans ‘predisposed’ to believe in gods and the afterlife” అంటూ వారు నిర్ధారించిన అంశం గురించి, ఈ పరిశోధన ఆధారంగా ప్రచురితమైన రెండు పుస్తకాల గురించీ గత వారం రాశాను.
ఇస్లామిక్ కోర్ కాన్స్పెట్ కూడా ఇదే. హ్యూమన్స్ మాత్రమే కాకుండా, “ఎవెరీ క్రియేషన్ ఈజ్ ప్రిడిస్పోజ్డ్ టు బిలీవ్ ఇన్ గాడ్” అని ఇస్లాం చెప్తుంది. కేవలం ప్రిడిస్పోజ్డ్ మాత్రమే కాకుండా, ప్రతి జీవి తమవైన ప్రత్యేక పద్దతుల్లో సృష్టికర్తని ప్రార్థిస్తాయనీ/ఆరాధిస్తాయనీ ఖురాన్ చెప్తుంది. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి –
“Do you not see that Allah is glorified by all those in the heavens and the earth, even the birds as they soar? Each ˹instinctively˺ knows their manner of prayer and glorification. And Allah has ˹perfect˺ knowledge of all they do” – Quran 24:41
“All living beings roaming the earth and winged birds soaring in the sky are communities like yourselves.1 We have left nothing out of the Record. Then to their Lord they will be gathered all together.” Quran 6:38.
సృష్టికర్తపై నమ్మకముంచి, ఏదోఒకనాటికి సృష్టికర్త వైపుకే మరలాల్సి ఉంటుందనే భావనతో, సృష్టికర్త ఆదేశాలకనుగుణంగా జీవించే ప్రతి జీవీ ముస్లిమే అనేది – ఇస్లాం చెప్పే మాట. పక్షులు,జంతువులు,పిల్లలు.. అట్లే, “సృష్టికర్త అంటూ ఎవ్వరూ లేరు” – అనేటైపు స్టేట్మెంట్లివ్వని, ఓ క్రియేటెడ్ అంశాన్ని క్రియేటర్ గా డిక్లేర్ చేయని మానవులందరూ, జీసస్, మోసెస్, ఇబ్రహీం, దావూద్, జోసెఫ్, ఆదామ్..వంటి ప్రవక్తలు.. వీరందరూ ముస్లిం లేననీ ఇస్లాం చెప్తుంది.
***********
ఇప్పుడు మళ్ళీ మోహన్ భగవత్-ఓవైసీ ల దగ్గరకు రండి.
“ఇండియా హిందువుల దేశమనీ, ఇక్కడి హిందువులని బలవంతంగానో, ప్రలోభపెట్టో ముస్లింలుగా,క్రైస్తవులుగా మార్చారు కాబట్టి, వారందరూ తిరిగి హిందూ మతంలోకి వచ్చేయాలనీ, ఘర్ వాపసీ చేసేసుకోవాలనీ, మోహన్ భగవత్ పిలుపినిచ్చాడు. ముస్లింలు,క్రైస్తవులూ చోరీకాబడిన సొమ్ములాంటోల్లు కాబట్టి,వారిని రికవరీ చేసుకుంటామని ఆయన ప్రకటించారు”
ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే స్టేట్మెంట్. రాజ్యాంగం ప్రకారం ఇండియా హిందూదేశమో,హిందువుల దేశమో కాదు. అది ఇక్కడ నివసిస్తున్న ప్రజల దేశం. ఈ ప్రజలు స్వచ్చందంగా ఎలాంటి మత విశ్వాసాలనైనా కలిగిఉండవచ్చనీ, ఏ మాతాచారాలనైనా పాటించవచ్చనీ రాజ్యాంగం చెప్తుంది.
“రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మోహన్ భగవత్”, “వివాదాస్పద వ్యాఖలు చేసిన భగవత్”, వంటి హెడ్లైన్స్ ఏవీ వాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా, “ఇది హిందువుల దేశం” అనే టైటిల్ పెట్టింది.

వీటికి కౌంటర్ గా ఓవైసి చెప్పింది చూడండి-“సునో ఆరెస్సెస్ వాలో, హర్ కోయీ దునియామే పైదా హోతా, ముసల్మాన్ జైసా పైదా హోతా. ఉస్కా మాహోల్, ఉస్కా మా బాప్, ఉసే దూస్రే,దూస్రే మజహోబో కో లేకర్ చలే జాతే.. ఓ తుమ్హారీ మర్జీ. అవుర్ సహీ కహా ముఫ్తీ అహ్మద్ సాబ్ నే, కి దీన్ మే కోయీ జబర్దస్తీ నహీ. హిదాయత్ తో సబ్ కీ సామ్నే హై. హమారా మాన్నా హై కి జో కోయీ పైదా హోతా, ఓ ముసల్మాన్ పైదా హోతా.. ఆప్ ఆవో వాపస్. అవుర్ హక్ కుచ్ పైసా నహీ దేసక్తే భాయ్ సాహబ్ ఆప్కో. ( ఓ ఆరెస్సెస్ వారూ వినండి. పుట్టే ప్రతి బిడ్డా ముస్లిమే. అనంతరం, తల్లిదండ్రులు, సమాజం వారిని వివిధ మతాల వైపు తీసుకెల్తాయి.అది వారి ఇష్టం. కాబట్టి, మీరే(ఈ కౌంటర్ మోహన్ భగవత్ కి కాబట్టి, మీరే అంటే మోహన్ భగవత్ గానీ, ఆరెస్సెస్ వారు గానీ అనేది కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ అర్థమయ్యే విషయం) ఘర్ వాపసీ చేసుకుని ముస్లింలుగా మారండి. కానీ, ఇస్లాం ప్రకారం, ఎవరినైనా బలవంతంగా ముస్లింలుగా మార్చడం నిషిద్ధం. పైగా, ముస్లింలుగా మారితే మేమెరికీ డబ్బులు కూడా ఇవ్వం” – ఇదీ ఓవైసీ చెప్పింది. దీన్లో వివాదాస్పదం ఏముంది..?

ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన మతం ఆచరించవచ్చనీ, దాని గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చనీ రాజ్యంగం చక్కగా అనుమతిచ్చింది. ఓవైసీ ఇక్కడ మత ప్రచారం కూడా చేయడం లేదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీ చేసిన ఓ వాదనకు కేవలం కౌంటర్ మాత్రమే ఇస్తున్నాడు. ఇలాంటి దాన్ని “మళ్ళి వివాదాస్పద ప్రసంగం చేసిన ఓవైసీ” అని రోజంతా హెడ్లైన్లు ప్రసారం చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ని దివాలాకోరులనాలా, ఇంగిత గ్ఞానం లేనోల్లనాలా, లేక ఆరెస్సెస్ తో కుమ్మక్కైన ఉన్మాదులనాలా..?

వీరి సంగతి కాసేపు పక్కన పెట్టి, సో కాల్డ్ తటస్థ,నాస్తిక,లిబరల్ మేధావుల సంగతి చూద్దాం. వీరు పొద్దున లేచినప్పటినుండీ రాజ్యాంగమూ, మానవ హక్కులూ, మానవత్వమూ.. అని ఊదరగొడుతుంటారు. అలాంటోల్లకు కనీసం మోహన్ భగవత్/ఆరెస్సెస్ చేసేది రాజ్యాంగ వ్యతిరేక చర్య అనీ, ఓవైసీ చెప్పింది రాజ్యంగానికి లోబడిన భావ ప్రకటనా స్వేచ్చ అనీ తెలియాల్సిన అవసరం లేదా? బేసికల్ గా వీరికి ఇస్లాం గురించి ఎలాంటి కనీస నాలెడ్జీ ఉండదు, కానీ మొత్తం తెలుసనుకునే భ్రమలో ఉంటారు. ఇలాంటోల్లు చాలా మంది ఫేస్ బుక్ లో లిబరల్ మేధావులుగా చలామనీ అవుతున్నారు. ఇస్లాం గురించి తెలీని నామ్ కే వాస్తే ముస్లింలు కూడా కొందరు వీరి చుట్టు చేరి చప్పట్లు కొడుతుండటంతో వీరి కాంఫిడెన్స్ పీక్ లో ఉంటుంది.
*******

మొత్తానికి, ఇస్లాం ప్రమాదకరమైందనీ, ముస్లింలకు గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందనీ చెడ్డీ సంఘాలు ఓ వైపు నుండీ ప్రచారం చేసుకుంటూ పోతుంటాయి.
వీరితో కుమ్మక్కైన మీడియా, తటస్థత పేరుతో, ఏదేమిటో తెలియని నాస్తిక,లిబరల్ మేధావులు… ఈ వాదనకు పరోక్షంగా వంతపాడుతుంటారు.
ఇస్లాం గురించి తెలుసుకోకుండా, తెలుసుకున్న నాలుగు ముక్కల గురించీ చెబితే పక్కోల్లు ‘మతవాది’ అనే ముద్రవేస్తారనే భయంతో,మొహమాటంతో చాలా మంది ముస్లింలు సైలెంట్ గా ఉండటమే మేలనుకుంటారు. ఈ చైన్ ఎక్కడ, ఎలా బ్రేక్ అవ్వాలో ఎవరికి వారు ఆలోచించండి.


-మహమ్మద్ హనీఫ్
శుక్రవారం.ఇన్.

Leave a Reply

Your email address will not be published.