గత వారం, రఫీయా అర్షద్ అనే హిజాబ్ ధరించే మహిళ, ఇంగ్లాండ్ లో జడ్జ్ గా సెలెక్ట్ అయింది. దీనిలో పెద్ద వింతేమీలేదు. కాకపోతే, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నేను ఇంటర్వ్యూకి వెల్తున్నప్పుడు, హిజాబ్ తో వెలితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువనీ, ఆ హిజాబ్ తీసేసి వెలితే మంచిదని, మా ఫ్యామిలీ మెంబర్ సలహా ఇచ్చాడు. సెలెక్ట్ ఐనా కాకున్నా, నేను,నేనుగానే ఉంటాను తప్ప, హిజాబ్ తీసేస్తే వచ్చే సెలెక్షన్ నాకక్కర్లేదని, హిజాబ్ తోనే ఇంటర్వ్యూకు వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను” – అని ఆమె చెప్పింది.ఇది ఆసక్తికరం.ఇప్పుడు మరో రకం జడ్జిల గురించి మాట్లాడదాం.
వీరు – “ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలతో బలవంతంగా బురఖా/హిజాబ్ ధరింపచేస్తారనీ, ఆ రకంగా వారి స్వేచ్చను హరించి వేసి వారిని అణిచేస్తారనీ,తొక్కేస్తారనీ.. ” – ఇలా ఏవేవో జడ్జిమెంట్లను యదేచ్చగా ఇచ్చేస్తుంటారు.ఇలాంటి జడ్జిలు, పైన రఫియా అర్షద్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారో. అఫ్కోర్స్ , ఎవరో ఒక్క మహిళ చెప్పిన విషయాన్ని బట్టి కన్‌క్లూడ్ చేయకూడదు. కరెక్టే. మరి – బురఖాకు వ్యతిరేకంగా మాట్లాడే ముస్లిం మహిళలు కూడా ఎక్కడో, ఒకరిద్దరు ఉంటారు తప్ప, తండోపతండాలుగా ముస్లిం మహిళందరూ బురఖాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడంలేదు కదా. అప్పుడెప్పుడో తస్లీమా నస్రీన్ అనే ఆవిడ ఓ పుస్తకం రాసింది. ఇక అడపాదడపా కొందరు ముస్లింలు ఏవో కామెంట్లు చేస్తుంటారు. వీరందరూ బురఖా ధరించే కోట్లాది ముస్లిం మహిళలకు రెప్రెజెంటేటివ్ లు కాదుకదా. అది వీరి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, ముస్లింల ఇళ్ళిల్లూ తిరిగి, ముస్లిం మహిళలతో మాట్లాడి, సర్వే చేసి చెప్పిన విషయాలు కావు కదా. బేసికల్ గా ఇలా జడ్జిమెంట్లు ఇచ్చేవారి మనసులో ఓ ఇమాజినరీ సీన్ నడుస్తుంటుంది. అదేమంటే- ఓ టినేజీ ముస్లిం అమ్మాయి, జీన్స్ ప్యాంటూ,టీషర్టూ వేసుకుని కాలెజ్ కి వెల్తుంటే, ఆమె ఇంట్లోనుండీ అడుగు బయటపెట్టే టయానికి, ఆమె నాన్నో ,అన్నో వచ్చి- ఆగు..ఆగు..ఆగు.. అని సాయికుమార్ లెవల్లో అరిచి- బలవంతంగా ఆమెచేత బురఖా తొడిగించి -“ఇప్పుడు వెళ్ళు” అని బయటికి పంపించినట్లు,
ఓ ముస్లిం మహిళ చక్కగా శారీ కట్టుకుని ఆఫీసుకో, షాపింగు కో వెల్తుంటే – ఆమె భర్తో, అత్తింటివారో ఆమెను అటకాయించి, ఆమెను బురఖాలో చుట్టేసి బయటికి పంపించినట్లు.. పాపం ఈ బాధల్ని భరించలేక, వారు బురఖాలోనే కుమిలి,కుమిలి ఏడుస్తున్నట్లూ.. వీరు ఓ పిక్చరైజేషన్ ని ఇమాజిన్ చేస్కుంటుంటారు.******
సరే – రఫియా అర్షద్ కాకుండా ఇంకొందరు మహిళల గురించి చూద్దాం.
Ibtihaj Muhammad – ఈమె హిజాబ్ తోనే అమెరికా తరుపున ఫెన్సింగ్ ఆటలో, ఏకంగా ఒలింపిక్స్ లో పాల్గొన్నది.
Kubra Dagli – టర్కీ కి చెందిన ఈమె, హిజాబ్ తోనే , టేక్వొండో(కరాటే లాంటిది) ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది.
Kulsoom Abdullah – ఈ పాకిస్తానీ అమెరికన్ – ఎలెక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్ లో పీహెచ్డీ చేసింది. అంతే కాకుండా- వెయిట్ లిఫ్టింగ్ లో, అమెరికా దేశవాలీ పోటీల్లో అనేక పథకాలు సాధించి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించే ప్రయత్నాల్లో ఉంది. – ఇదంతా హిజాబ్ ధరించే సాధించింది.
Majiziya Bhanu – మన కేరల అమ్మాయి. హిజాబ్ ధరించే, ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో డబుల్ గోల్డ్ సాధించింది.
Dr Tahani Amer – నాసాలో సీనియర్ సైంటిస్ట్, ప్రోజెక్ట్ డైరెక్టర్. ఈమె పేరుమీద కొన్ని పేటెంట్లు కూడా ఉన్నాయి. సృష్టికర్తతో నీ ఈక్వేషన్ కరెక్ట్ గా ఉంటే, ఆ తర్వాత అందరు వ్యక్తులతో నీ ఈక్వేషన్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుందని చెప్పే, ఈ హిజాబీ సైంటిస్ట్ మాటలు వింటే, పాపం నాస్తికులు కన్ఫ్యూజ్ ఐపోవలసిందే.
Şule Yüksel Şenler : 1930 లో అట్టోమన్ సామ్ర్యాజ్యం నేలకూలి, ఆధునిక టర్కీ ఏర్పడ్డాక, టర్కీ నుండీ హిజాబ్ లాంటి ఇస్లామిక్ చిహ్నాలని తుడిచేసి దానిని మరో యూరోపియన్ దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్న అప్పటి, టర్కీ అధ్యక్షుడు ముస్తఫాకమాల్ అటాటుర్క్ ప్రయత్నాలను ఈ మహిళ ఒంటిచేత్తో ఎదుర్కొంది. ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకించి హెడ్ స్క్రాఫ్ ధరించడమే కాక, దాన్నో ఫ్యాషన్ సింబల్ గా తీర్చిదిద్దింది. ప్రభుత్వం ఈమెను అరెస్టు చేసినప్పుడు, హిజాబ్ ధరించిన ముస్లిం మహిళలు టర్కీ వీధుల్లోకి వచ్చి ఈమెకు మద్ధతుగా ర్యాలీలు చేశారు. ప్రభుత్వం దిగొచ్చి, ఈమె శిక్షాకాలాన్ని తగ్గించినా, ఈమె మాత్రం పూర్తి శిక్షాకాలం తర్వాతే బయటికివచ్చింది. బోడి క్షమాభిక్ష ఎవరిక్కావాలని, అలాకూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ధిక్కరించింది. గత సంవత్సరం, ఈమె మరణించినప్పుడు, ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్, స్వయంగా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మొన్నటికి మొన్న – ఫ్రాన్స్ ప్రభుత్వం బురఖాను నిషేధిస్తే, చాలా మంది ముస్లిం మహిళలు ఈ నిషేధాన్ని ధిక్కరించి మరీ బురఖా ధరించి వీధుల్లోకి వచ్చారు.ఇవన్నీ, ఒక్క పది నిమిషాలు గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిన విషయాలు. వీల్లందరి చేతా వారి నాన్నలు,అన్నలూ,భర్తలూ బలవంతంగా హిజాబ్/బురఖా ధరింపజేస్తున్నారని బుద్దున్నోల్లెవరూ అనరు. దీనిని బట్టి అర్థమయ్యేదేమంటే, కొందరు ప్రొజెక్ట్ చేస్తున్నట్లు, ముస్లిం మహిళలు బురఖాను గుదిబండలా భావించేంత సీన్ లేదు. ప్రతిఒక్కరూ తమ మతాల్ని,సంసృతినీ ఓన్ చేసుకున్నట్లుగానే, ముస్లిం మహిళలు కూడా దీనిని ఓన్ చేసుకుంటారు.******
బురఖా విషయం చర్చకు వచ్చినప్పుడల్లా కొందరు ముస్లింలు కొన్ని చెత్త ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు. “చాక్లెట్ ని కవర్ లో చుట్టి ఉంచాలి, లేకుంటే దానికి చీమలు పడ్తాయి. కేక్ బయట ఉంటే చెడిపోతుంది. బంగారం బయటుంటే దొంగలు ఎత్తుకుపోతారు, కాబట్టి భద్రంగా దాచుకోవాలి” — ఈ టైపు దేడ్ దిమాక్ లాజిక్ లతో, తాము బురఖాను భీబత్సంగా డిఫెండ్ చేస్తున్నామనుకుంటుంటారు. నిజానికి ఇవన్నీ సెల్ఫ్ డిఫీటింగ్ ఆర్గ్యుమెంట్లు. ” అంటే నీ దృష్ఠిలో, స్త్రీ కూడా ఓ ప్రాణం లేని చాక్లెట్టు, కేకు, బంగారు లాంటిదేనా ” అని ఎవరైన ఓ కౌంటర్ ఆర్గ్య్మెంట్ గానీ చేశారంటే ఖేల్ ఖతం, దుక్నం బంద్. కాబట్టి అలాంటి ఆర్గ్యుమెంట్లకు దూరంగా ఉండాలి.
“ఎక్కువబట్టలైనా,తక్కువబట్టలైనా… ఓ స్త్రీకి తనకు నచ్చిన బట్టలు ధరించే స్వేచ్చ ఆమెకుండాలి. దీని గురించి ఇతరులు తెగ ఇదై పోవాల్సిన అవసరం లేదు” – మన ఆర్గ్యుమెంట్ ఇంత వరకే ఉండాలి.
ఇక ఖురాన్,హదీస్ లు – బట్టలు,నడవడిక,జీవన విధానం వంటివాటిలో స్త్రీ-పురుషులకు ఎలాంటి నియమాలు,సలహాలూ ఇచ్చాయనేది ఇస్లామిక్ స్కాలర్స్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్. వారు చెప్పేదాన్ని బట్టి, ఏ నియమాన్ని ఎంతవరకూ ఫాలో కావాలనే విషయాన్ని మహిళలు స్వంతంగా డిసైడ్ చేసుకుంటారు.
అలాగని, ముస్లిం మహిళలందరూ పూర్తి సుఖసంతోషాలతో, ఇస్లాం ప్రకారం వారికి ఇవ్వబడిన హక్కులన్నీ అనుభవిస్తూ జీవిస్తున్నారని చెప్పడానికి కూడా లేదు.
పెళ్ళిలో పురుషుడే స్త్రీకి మహర్ చెల్లించాలి. వధువు కుటుంబం నుండీ ఎలాంటి ఖర్చులూ పెట్టించకూడదు. కానీ, చాలా మంది ముస్లిం పురుషులు యదేచ్చగా దీనిని ఉల్లంఘించి, ముస్లిం స్త్రీలనుండీ కట్నాలు తీసుకుంటున్నారు. వారితో విందులు,లాంచనాలని లక్షలకు లక్షలు ఖర్చుపెట్టిస్తున్నారు. చాలాసార్లు తలాక్ నియమాలను ఏకపక్షంగా ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి అన్-ఇస్లామిక్ ఆచారాలకు వ్యతిరేకంగా ముస్లిం పురుషులే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరం ప్రయత్నిద్దాం.ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం , ఈ పేజ్ ని లైక్ చేయండి,ఛానెల్ ని సబ్‌స్రైబ్ చేయండి.
యూటూబ్ లింక్ https://youtu.be/0R2o3XXrVgQ
shukravaram FaceBook Page link : https://www.facebook.com/Shukravaram-1561547220726260/?eid=ARDRXqqrtdLY0C7XDKlgN3BVmbg6uW1eRh2YvV982ifEpGcZUSu1mLlUDn6tOkwPPdghq2QGfoGFgVpmఖుదా హఫీజ్.