ఈ వ్యాసం బురఖా గురించి – ముస్లిం పురుషులు, కొందరు అభ్యుదయవాదుల కోసం

ఓ హైకోర్ట్ అడ్వొకేట్,
ఓ ప్రభుత్వ గ్రూప్-1 ఆఫీసర్,
ఓ వెల్నోన్ సోషల్ యాక్టివిస్ట్,
ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్,
ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్,
చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్లు,సాఫ్ట్వేర్ ఇంజినీర్లు..
ఈ లిస్టు, నేను వివిధ సంధర్భాల్లో డైరెక్ట్గా కలిసిన,ఫోన్ లో మాట్లాడిన, హిజాబ్ ధరిస్తూనే తమ డే-టు-డే యాక్టివిటీస్ చేసుకునే ముస్లిం మహిళలది. వీరందరూ ప్రస్తుతం నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు.
అట్లే,

హిజాబ్ ని వ్యతిరేకిస్తూ – కవితలు,కథలు రాసిన ఇద్దరు ముస్లిం మహిళలు కూడా నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారు.

సో, ఇప్పుడు అసలు పాయింట్- పైన పేర్కొన్న రెండు క్యాటగరీల ముస్లిం మహిళల్లో ఎవరి లైఫ్-స్టైల్/అభిప్రాయాలు సరైనవీ/గొప్పవి అని తీర్మానించాలి, ఎవరిని ఎంకరేజ్ చేయాలి – అనేది.

నా పర్సనల్ అభిప్రాయం – “జీవితం పట్ల ఎవరి అవగాహనమేరకు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారిని బతకనివ్వాలి. మరణాంతరం ప్రతి ఒక్కరూ తమ,తమ యాక్షన్స్ కీ,ఛాయిసెస్ కి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. స్త్రీలకైనా,పురుషులకైనా, ముస్లింలకైనా, ముస్లిమేతరులకైనా- అందరికీ ఇదే వర్తిసుంది”.

ఇక సమస్య ఎక్కడొస్తుందంటే – తమను తాము అభ్యుదయవాదులుగా,ఫెమినిస్టులుగా,మానవతావాదులుగా పిలుచుకునే కొందరు- పైన చెప్పిన ఒకటవ కేటగరీలోని అడ్వకేటు,ఆఫీసరు,ఎడిటరు లాంటి వారిని కూడా- వాల్ల భర్తలో,తండ్రులో ఫోర్స్ చేసి వారితో బురఖాల్ని తొడిగిస్తున్నారేమోనని భావిస్తుంటారు. వారితో బురఖాల్ని తీసేయించి, వారి జీవితాల్ని ఉద్ధరించాల్సిన పవిత్ర బాధ్యతేదో తమమీద ఉన్నట్లు ఫీలైపోతుంటారు. అంటే, మహిళ ఏ స్థాయికి వెళ్ళినా, ఆమెను కొందరు పురుషులు కంట్రోల్ చేస్తునే ఉంటారనీ, కాబట్టి, ఆ మహిళలు తమ భర్తో,తండ్రో చెప్పే మాటలు కాకుండా – తమలాంటి వీర మానవతావాదుల,అభ్యుదయవాదుల మాటలు నమ్మితే మంచిదనీ వీరి ఇన్నర్ ఫీలింగ్. అంటే, వీరు మాత్రం మగాళ్ళు కాదా, అని మీరు కొత్త డౌట్లు అడక్కండి. వీరు స్పెషల్ మగాల్లన్నట్లు.

ఈ స్పెషల్ మగాల్లు చాలా వరకూ మంచోల్లే. కాకపోతే, భర్త చనిపోగానే ఇక బతికే అర్హతే లేదని తీర్మానించిన కొన్ని సంస్కృతులు, పురుషునికి ఆటవస్తువుగా తప్ప, వేరే ఏవిధమైన ఎగ్జిస్టెన్స్ స్త్రీకి లేదని భావించే కొన్ని సమాజాలగురించి వీరికి బాగా తెలిసి ఉండటం వల్ల, ఇస్లాం కూడా అలాంటిదే అనే అభిప్రాయంలోకి వచ్చేసి, జనరలైజ్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు.

ఇప్పుడు ఇస్లాం ప్రత్యేకమైందని వీరికి ఎవరు చెప్పాల? ఆ బాధ్యత ఎవరిది? వివాహం సమయంలో పురుషుడే స్త్రీకి మెహర్ చెల్లించాలనే, ఇస్లామిక్ నియమాన్ని అటకెక్కించేసి- ముస్లిం పురుషులు కూడా నిస్సిగ్గుగా లక్షలకులక్షలు బేరాలాడిమరీ తీసుకుంటున్నారు. ఓ ఎక్సెప్షనల్ కేస్ లో, ప్రవక్త అనుమతించిన “ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్” ని, మెయిన్ స్ట్రీమ్ చేసి, ముస్లిం పురుషులే ఆ ఆచారాన్ని సజీవంగా ఉంచారు. ‘పరస్త్రీని తేరిపార చూడకుండా చూపుల్ని కిందకు దించుకోమనే’ ఖురాన్ ఆదేశాన్ని విస్మరించి, బురఖాను సమర్థించే ప్రయత్నంలో, “బురఖా ధరించిన అమ్మాయి-అర్థ నగ్నంగా ఉన్న అమ్మాయిల” ఫోటోల్ని పక్క-పక్కనే పెట్టి షేర్లు చేస్తున్నారు. ఇక హిందూత్వ వాదుల్ని తిట్టేటప్పుడు, యదేచ్చగా స్త్రీలను కించపరిచే పదాల్ని వాడేస్తుంటారు. – ముస్లిం పురుషులు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు – ఇస్లాం ప్రత్యేకమైందని ఇతరులకు ఎలా తెలుస్తుంది..?

ముస్లిం గా ఉండటం అనేది- గర్వించాల్సిన విషయమో, గొప్పలు చెప్పుకోవాల్సిన విషయమో కాదు.
ముస్లిం గా ఉండటం అనేది ఖురాన్, మహా ప్రవక్త(pbh) బోధనల ప్రకారం నడవడానికి జీవితాంతం చేయాల్సిన స్ట్రగుల్.
అదొక కష్టతరమైన బాధ్యత. ఆ బాధ్యతల్ని ముస్లిం పురుషుల కంటే, ముస్లిం స్త్రీలే మెరుగ్గా నిర్వర్తిస్తున్నారని ముస్కాన్ లాంటి ధీర వనితలు నిరూపిస్తున్నారు.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.