“ఓవైసీ వల్ల బీజేపీకి లాభమే”

ఓవైసీ ఒంటరిగా పోటీ చేస్తే అది బీజేపీ కి లాభం, సెక్యులర్ పార్టీలకు నష్టం అనేది బేసిక్ కూడికలు,తీసివేతలు తెలిసిన వారందరికీ కూడా అర్థమయ్యే విషయమే. దీనికి పెద్దగా డిటెక్టివ్ అనాలసిస్ లు అవసరం లేదు. ఎంత లాభం అనే విషయం మిగతా పార్టీల బలాబలాల్ని బట్టి మారుతుంటుంది.

ఉదాహరణకు :-
2020 బీహార్ ఎన్నికల్లో యం.ఐ.యం 20 స్థానాల్లో పోటీ చేసింది. 5 గెలిచింది. 15 ఓడిపోయింది. ఓడిపోయిన స్థానాల్లో, యం.ఐ.యం ఓట్లను ఆర్జేడీ/కాంగ్రెస్ కి కలిపితే, బీజేపీ కాకుండా ఆర్జేడీ/కాంగ్రెస్ గెలిచేవి అని చెప్పదగ్గ స్థానాలు ఒక్కటికూడా లేవు. అంటే అక్కడ యం.ఐ.యం వల్ల బీజేపీ కి ఎలాంటి లాభం జరగలేదు.
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా యం.ఐ.యం 7 స్థానాల్లో పోటీ చేసింది. అన్నీ ఓడిపోయింది. ఆ ఏడింట్లో ఎక్కడా బీజేపీ గెలవలేదు. కాబట్టి అక్కడకూడా బీజేపికి యం.ఐ.యం వల్ల ఎలాంటి లాభం జరగలేదు.
2022 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో, యం.ఐ.యం 100 స్థానాల్లో పోటీ చేసింది. అన్నీ ఓడింది. కాకపోతే, ఆ వందలో నుండీ బీజేపీ గెలిచిన ఆరు స్థానాల్లో, యం.ఐ.యం కి వచ్చిన ఓట్లను సమాజ్వాదీ పార్టీ అబ్యర్థికి కలిపితే, అక్కడ బీజేపీ కాకుండా, సమాజ్వాదీ అబ్యర్థి గెలిచేవాడు. అంటే, అక్కడ యం.ఐ.యం వల్ల బీజేపీ కి 6 స్థానాల్లో పరోక్షంగా లాభం జరిగింది.


ఈ రకంగా యం.ఐ.యం ఒంటరిగా పోటీ చేయడం వల్ల బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉంది. కానీ, ఒంటరిగా కాకుండా, ఏదో ఓ సెక్యులర్ పార్టీతో కలిసి పొత్తుపెట్టుకుని బరిలోకి దిగితే మాత్రం – బీజేపీ కి తీరని నష్టం కలిగే అవకాశం చాలా ఉంది.

సరే, ఇప్పుడు పొత్తుల సంగతి చూద్దాం.

“బీజేపీయేతర పార్టీలతో పొత్తులకోసం నేను నా వంతు ప్రయత్నం చేశాను, కానీ వాల్లే కలుపుకోవట్లేదు” అని ఓవైసీ అంటుంటాడు.

“పొత్తులకోసం ప్రయత్నించానని అతను చెప్పింది అబద్ధమని గానీ, అతనితో ఫలానా కారణాల వల్ల మేం కలవలేదని” గానీ, అఖిలేష్/తేజస్వి యాదవ్ లాంటోల్లు ఎప్పుడూ నోరుతెరిచి మాట్లాడరు. విలేఖరులు కూడా ఈ ప్రశ్న వారిని ఎప్పుడూ అడగరు.

అతనితో కలిస్తే ముస్లిమేతర ఓట్లు పోతాయనే భయం తప్ప, వేరే కారణం ఏదీ ఉన్నట్లు నాకనిపించదు. అదే నిజమైతే- “ఎందుకంత భయం” – అనేది తరువాతి కీలక ప్రశ్న. అతను రాజ్యాంగ పరిధిలోనే ముస్లింల హక్కుల గురించి మాట్లాడతాడు. దీని గురించి ఇతరులు భయపడాల్సిన అవసరం ఏముంది. “అతను రెచ్చగొట్టే ప్రసంగాలిస్తాడు” -అనే విషయం ఇప్పటికే కొందరికి తట్టిఉండొచ్చు.

-భారత దేశంలో ముస్లింల పూర్వీకులందరూ హిందువులే అనే అమిత్ షా మాటలకు కౌంటర్ గా -“పుట్టే ప్రతి వ్యక్తినీ అల్లానే పుట్టిస్తాడని చెప్పడం” – హిందువుల్ని రెచ్చగొట్టడం కిందికి వస్తుందా?
-స్కూల్లలో హిజాబ్ బ్యాన్ చేసిన అంశం గురించి మాట్లాడుతూ – ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. మనం 15% మాత్రమే ఉన్నా, ఆలోచించి తెలివిగా ఓట్లేస్తే హిజాబీ మహిళ ఈ దేశానికి ప్రధాన మంత్రి కూడా అవ్వొచ్చు అని చెప్పడం – హిందువుల్ని రెచ్చగొట్టడం కిందికి వస్తుందా?
-ఆరెస్సెస్ కు కౌంటర్ ఇచ్చే ఆవేశంలో 15నిమిషాలు అని వాగినందుకు ఆల్రెడీ 2 నెలలు జైల్లో వేశారు. ఆ తర్వాత గడిచిన పదేళ్లలో అతను మళ్ళీ అలా వాగిన సంధర్భాలు లేవు.
-ఇంతకంటే దారుణమైన స్టేటెమెంట్లు, బహిరంగంగానే ముస్లింలను చంపాలని పిలుపునిచ్చినోల్లు కూడా నిక్షేపంగా తిరుగుతూ అసెంబ్లీలు,పార్లెమెంటుల్లో మంత్రులుగా వెలగబెడుతుండటాన్ని ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.

మొత్తానికి, ఓవైసీపై వ్యతిరేకతకి కారణం డీప్ గా ఆలోచిస్తే, మెజారిటీ ప్రజలకు ఇస్లాం గురించి ప్రాధమిక అవగాహన కూడా లేని గ్జెనోఫోబియానే అని అర్థమవుతుంది. కారణమేంటో తెలిశాక, ఆ తర్వాత మనమున్నది రెండే ఆప్షన్లు.
1.ఆ కారణాన్ని రెక్టిఫై చేసేలా, అన్-అపలజెటికల్ ముస్లిం లాగా రాజకీయ,సామాజిక రంగాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తూ, ఇస్లాం ముస్లిమేతరులకూ,సమాజానికీ ఎలా అపాయకరం కాదో చేతలు,మాటల ద్వారా చూపించడం.
2.మనం ఉన్నది 15%మాత్రమే. మనం ఐకమత్యం గురించి మాట్లాడితే అటు 80% ఒక్కటవుతారు. మనం హిజాబ్ తొడుక్కుంటే వాల్లూ కాషాయం తొడుక్కుంటారు. మనం సున్‌తీ చేసుకుంటే వాళ్ళూ..సారీ, వాల్ల హృదయాలు గాయపడతాయి. కాబట్టి మా ముస్లింలకో ప్రత్యేక పార్టీలాంటిది పెట్టుకోకుండా, ఏదో ఓ పార్టీకి వోట్లేసేద్దాం.. ఎలాగోలా బతికేద్దాం అని – కాంప్రమైజ్ అవ్వడం.

నేను 1 ఆప్షన్ చూజ్ చేసుకున్నా. మీరేం సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఎవరి ఆప్షన్ వారిదే. ఎవరి గోల వారిదే.

కాకపోతే, రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేవారికి ఓచిన్న సూచన – ముస్లింల పాలిటి నరకప్రాయం ఆయ్యే అవకాశం ఉన్న పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లెంటులో టీడీపీ,వైసీపీ రెండు పార్టీలూ మద్దతిచ్చాయి. ముస్లింలకు సైలెంట్ గా ఉండటం తప్ప వేరే ఆప్షన్ లేదు.
ముంబై అల్లర్లలో వేలాది మంది ముస్లింల చావులకు కారణమైన వారిని శిక్షించడానికి జస్టిస్ శ్రీక్రిష్ణ గారు విచారణ చేసి మహారాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన రిపోర్టు, 20 ఏళ్ళైనా ఇప్పటికీ ఏ చెత్త బుట్టలో ఉందో ఎవరికీ తెలీదు. అక్కడ 15 ఏళ్ళపాటు అధికారంలో ఉండింది – కాంగ్రెస్-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం. సైలెంట్ గా ఉండటం తప్ప, ముస్లింలకు వేరే ఆప్షన్ లేదు.
ముజఫర్ నగర్ అల్లరు జరిగింది అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. బాబ్రీ తలుపులు తెరిచింది, కూల్చింది.. మొత్తం సెక్యులర్ పార్టిల కనుసన్నల్లోనే. సైలెంట్ గా ఉండటమే తప్ప ముస్లింలకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే – ఆ పార్టీల అధ్యక్షులు ముస్లింలు కాదు కాబట్టి.

అందుకే ఏ వర్గానికి ఆ వర్గం సొంత పార్టిల్ని మెయింటేన్ చేస్తూ బర్గైనింగ్ పవర్ పెంచుకుంటున్నప్పుడు ముస్లింలు మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదో ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published.