ఒక చెంపపై కొడితే – రెండో చెంప చూపమనే గాంధీ సిద్ధాంతం, హైస్కూల్లో ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది.
కానీ, రెండో చెంప మీద కూడా కొడితే ఏం చేయాలనే డౌట్ అప్పట్లో రాలేదు. రెండో చెంప మీద కొట్టడంతో పాటూ, కడుపులో కుల్లబొడిస్తే..? వంగబెట్టి ముడ్డి మీద తన్నితే..? “జీ హుజూర్, తోఫా ఖుబూల్ కీ జియే అనాలా..?”
మొత్తానికి, అహింసావాదం ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యేది కాదని తొందర్లోనే అర్థమైంది.
దీనికంటే – కళ్ళముందు ఓ చెడు జరుగుతున్నప్పుడు వీలైతే దానిని బలప్రయోగం ద్వారా చేత్తో ఆపడానికి ప్రయత్నించండి.
అది సాధ్యం కాకుంటే, మాటలతో చర్చించి దానిని ఆపడానికి ప్రయత్నించండి.
అదీ సాధ్యం కాకుంటే, మనసులోనే దానిని నిరసించి,దేవున్ని వేడుకుని, ఆపడానికి ప్రయత్నించండి – అనే మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలే ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నాయనిపిస్తుంది.
కానీ, ప్రస్తుత కపట యుగంలో, అసలు ఏది మంచి-ఏది చెడు అనే విషయం తేల్చుకోవడమే అతి పెద్ద ఛాలెంజ్.
ఇరాక్ దగ్గర జనహనన ఆయుధాలున్నాయనీ, మానవాలిని వాటినుండీ కాపాడాలనీ చెప్పి అమెరికా,నాటో దలాలు ఇరాక్ పై దాడి చేశాయి. అదంతా ఒట్టిదేనని తేలింది. అంతకు ముందు ఇదే అమెరికా సద్దాం అధ్యక్షుడు కావడంలో సహకరించింది.
WTC జంటభవనాల్ని కూల్చిన లాడెన్ కి ఆశ్రయమిచ్చిందని ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేశారు. ఆ రోజు కూలింది మొత్తం మూడు టవర్లనీ, మూడో టవర్ మంట వల్ల అయ్యే అవకాశం ఏ మాత్రం లేదనీ అమెరికన్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ అధ్యయనమే తేల్చేసింది. అయినా ఇలాంటీ న్యూస్ లు ఎప్పుడు హెడ్లైన్స్ గా రావు.
లిబియా-గడాఫీ. పాపం ఈ దేశం మీద ఎందుకు దాడి చేశారో, ఆ గడాఫీ చేసిన నేరమేందో కూడా ఎవరికీ తెలీదు. విద్యా,వైద్యం,సంక్షేమ రంగాల్లో – మిగతా ఆఫ్రికన్ దేశాలన్నిట్లో కెల్లా అగ్రగామిగా ఉన్న దేశంపై దాడి చేసి, కుక్కలు చింపిన విస్తరిని చేశారు. మిగతా అరబ్ దేశాల్ని కూడగట్టి, పెట్రో డాలర్ వ్యవస్థకు వ్యవస్థకు పోటీగా, గోల్డ్ బేస్డ్ ట్రేడింగ్ కి పధకం రచించడమే అసలు కారణమనే విషయం కొంచెం స్టడీ చేస్తే తెలుస్తుంది.
ఇక పాలస్తీనాపై ఇజ్రాయేల్ దురాగతాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంత మంచిది. ‘పాలస్తీనా’ పదం పోస్టులో కనపడితే, ఫేస్ బుక్కు అల్గారిధం ఆ పోస్టే ఇతరులకు కనపడకుండా చేస్తుంది.
ఇన్ని అడ్డమైన పనులు చేసిన నాటోగాల్లకు రష్యా రూపంలో ఇప్పుడు కొద్దిగా ప్రతిఘటన ఎదురవుతుంది. మానవత్వం-సార్వభౌమత్వం వంటి పదాల్ని వెతికిపట్టుకుని, న్యూట్రాలిటీల్ని, నిజాయితీల్ని నిరూపించుకోవాల్సిన అవసరమేమీ లేదిప్పుడు. ప్రవక్త చెప్పిన మూడో ఆప్షన్ ఫాలో అవ్వడం తప్ప, వేరే ఛాయిస్ ఏమీ లేదు.
-మహమ్మద్ హనీఫ్