కౌంటర్ ఆర్గ్యుమెంట్లు – సోషల్ మీడియా ట్రెండ్

“మతాలన్నీ ముఢాచారాలని కలిగిఉన్నాయనీ, వీటికి శాస్త్రీయత ఉండదనీ. జనాలు ఏది,ఎందుకు చేస్తున్నారో తెలీకుండా గుడ్డిగా చేస్తుంటారనీ, మెదడు అస్సలు ఉపయోగించరనీ” – విమర్శిస్తుంటారు.

“దర్గాలకు వెళ్ళి సమాధులకు మొక్కడం, పీర్లను ఎత్తుకుని ఊరేగడం ” – లాంటి వన్నీ మూఢాచారాలని నేనంటే – “నీకు సూఫీయిజం గొప్పతనం తెలీదు, అది వివిధ మతాలోల్లనందర్నీ ఎలా దగ్గర చేస్తుందో నీకు తెలీదు, నువ్వు ఫండమెంటలిస్టువి అని వీల్లే మళ్ళీ విమర్శిస్తారు.

************

“ఇదిగో అమ్మాయిలూ , పురుషుల్లో 90% మంది పరస్త్రీలతో సంబంధం కోసం కాచుక్కూర్చోనుంటారు, ఏదో ఓ వంకతో, స్నేహమనీ,ప్రేమనీ,కవితలనీ, కథలనీ మాయమాటలు చెప్పి పరస్త్రీలకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. వీరిని నమ్మబాకండి” – అని ఎవరైనా రాస్తే మాత్రం – దానిని, ఆహా, ఓహో అని కీర్తిస్తారు. తమ కూతుర్లు,అక్కలు,చెల్లెల్లూ ఇది చదివి, జాగ్రత్తపడితే బాగుండు అని భావిస్తారు – ఎందుకంటే – అది నిజం అని ప్రతి మగాడికీ తెలుసు కాబట్టి. “స్త్రీ-పురుషులు సమానమే, 90% మహిళలు కూడా పరపురుషులతో సంబంధాల కోసం కాచుక్కూర్చునుంటారు. కాబట్టి, ఇది తప్పుడు పోస్టు” – అని ఎవ్వరూ కామెంట్లు రాయరు. ఎందుకంటే , అది తప్పుడు లాజిక్ అనీ, ఎక్కడా అలా జరగదనీ వారికి తెలుసు కాబట్టి.

అదే గనక,
స్త్రీపురుషులు సరూపాలే తప్ప, సర్వసమానులు కారనీ, ఒకరు ఎక్కువా,ఒకరు తక్కువా కారనీ – వారి లక్షణాలూ, శరీర ధర్మాలను బట్టి, దీనికి అనుగునంగానే సృష్టికర్త కొన్ని విషయాల్లో స్త్రీ,పురుషులకు వేరువేరు నిబంధనలు సూచించారనీ అంటే –

-“అలా ఎలా సమానం కాకుండాపోతారు, మగాడికి నాలుగు, స్త్రీకి ఒక్కటే ఏంది. ఇది అన్యాయం కాదా, స్త్రీలను అణచేయడం కాదా, తొక్కేయడం కాదా” -.. అని ఆపసోపాలు పడతారు.

**********

మెటీరియల్ పొసేషన్సే మనిషి విజయానికి కొలమానం కాదనీ, ఏదో ఓ రోజు, తనువు చాలించి సృష్టికర్త వైపుకే మరలి వెల్లాల్సిఉంటుందనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుని, కోర్కెల్ని అదుపులో పెట్టుకుని, నిరాడంబరంగా జీవించాలనే ఇస్లాం సందేశాన్ని, ఔట్డేటెడ్ గా, పురాతన భావజాలంగా అభివర్ణిస్తారు. -“మనిషికి ఏదీ కావాలో, ఏది మంచో,ఏది చెడో తెలుసుకునే తెలివితేటలు లేవా, సొంతంగా నిర్వచించుకోలేడా , ఎవరో ప్రవక్తనో , గ్రంధమో చెప్తే తప్ప జనాలు తెలుసుకోలేరా” – అని వాదిస్తారు.

మళ్ళీ రెండు రోజుల తర్వాత వీరే – ఆధునిక జీవితం అంతా మోసమే ననీ, ఏ దేశ విధానాన్ని చూసినా, మెజారిటీ ప్రజల శ్రమను దోచుకుని, కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే సంపదనంతా తమ దగ్గర పోగేసుకుంటున్నారనీ, ప్రజాస్వామ్యాల్నీ,చట్టాల్నీ, ఎన్నికల్నీ కొందరు/కొన్ని శక్తులు మాత్రమే శాశిస్తున్నారనీ, కొందరు సుప్రీం కోర్టు జడ్జీల్ని గుప్పిట్లో పెట్టుకుని న్యాయం అనే పదానికి కూడా అర్థం లేకుండా చేశారనీ వాపోతారు.
***********
అందరూ అని కాదు గానీ, ఈ టైపు ఆర్గుమెంట్లు చేసేవారు నాకు నిత్యం తారసపడుతుంటారు. సోషల్ మీడియాలో వీరిదే మెజారిటీ.

“ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ”

అట్టా ఎన్నాల్లు తమని తాము తప్పించుకు తిరుగుతారనేదే ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published.