2009 GHMC ఎలెక్షన్స్ లో కాంగ్రెస్-52, టీడీపీ-45,MIM-43, బీజేపీ-5 సీట్లు గెలిచాయి. (TRS పోటీ చేయలేదు) రెండేళ్ళు కాంగ్రెస్, రెండేళ్ళు MIM మేయర్ పదవిని పొందేలా కాంగ్రెస్-MIM మధ్య ఒప్పందం కుదిరింది.కాంగ్రెస్ నుండీ తొలుత బండ కార్తీక చంద్రారెడ్డి మేయర్ అయింది. తరువాత 2012లో యం.ఐ.యం నుండీ మాజిద్ హుస్సేన్ మేయర్ అయ్యాడు. మాజిద్ హుస్సేన్ ఇంకా MIM లోనే ఉన్నాడు. నిన్నటి ఎలెక్షన్స్ లో మెహదీపట్నం కార్పోరేటర్ గా గెలుపొందాడు. బండ కార్తీక చంద్రారెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉందో చెప్పుకోండి చూద్దాం. (No prizes for guessing) **************ఏమన్నా కన్సిస్టెన్సీ నా..? ఎంతైనా, ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీల రాజకీయ నాయకుల క్లారిటీని మెచ్చుకోవాల్సిందే. వీరి క్లారిటీ ఏందంటే- బీజేపీ వ్యతిరేక పార్టీలో ఉండి, ముస్లింల ఓట్లు కూడా కావాలనుకున్నప్పుడు సెక్యులర్ పాట పాడాల. బీజేపీ లో చేరి, బోడి ముస్లింల ఓట్లు ఎవడిక్కావాల అనుకున్నప్పుడు – జై శ్రీ రామ్ అనాల. ఇక ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీల అభిమానుల క్లారిటీ మరో రకంగా ఉంటుంది. అదేమంటే, తమ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నన్నాల్లూ ముస్లింలపట్ల సాఫ్ట్ కార్నర్ చూపించాల. అదే వెళ్ళి బీజేపీతో కలిసినా, ముస్లింల ఓట్లు తమకు రాలేదని తెలిసినా… ఇగ అప్పుడు, ముస్లింలకు దేశభక్తి ఉండదనీ, వారు మతం చూసే ఓట్లేస్తారనీ, వారి వళ్ళే హిందువులు బీజేపీకి ఓట్లేస్తున్నారనీ ముస్లింలను ఆడిపోసుకోవాల. ఇలా ఎవరి క్లారిటీ వారికుందన్నట్లు..