పదో క్లాసులోనో,ఇంటర్లోనో మొదటిసారిగా తెలుగులో ఖురాన్ చదివే ప్రయత్నం చేసినట్లు గుర్తు. కానీ, రెండో చాప్టర్ అల్-బఖరా ని దాటి ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు. కొన్ని లైన్స్ చదవగానే నిద్రరావడమో, అక్కడి కంటెంట్ అర్థం కాక, మైండ్ వెంటనే వేరే విషయాలపైకి డైవర్ట్ అవ్వడమో జరిగేది.
దీనికి సగం కారణం అందులో వాడిన గ్రాంధిక తెలుగు కాగా, మిగతా సగం అక్కడ చర్చిస్తున్న విషయాలపట్ల అప్పట్లో నాకు, ఎలాంటి ప్రాధమిక అవగాహనా లేకపోవడం. ఉదాహరణకు, అందులో చాలా సార్లు క్రైస్తవుల,యూదుల ప్రస్తావన వచ్చేది. అప్పటికి మా ప్రభుత్వ బడిలో ఉన్న 60-70 మంది పిల్లోల్లలో క్రైస్తవ పిల్లలు ఇద్దరో,ముగ్గురో ఉండేవారు. ఇక యూదులు మా ఊరు మొత్తం మీదనే ఒక్కరు కూడా లేరు. సోషల్ సబ్జెక్టుల్లో కూడా – ఎంతసేపూ – హిందూ,ఇస్లాం,క్రైస్తవ మతాలూ.. వారి ప్రముఖ పండగలు, గ్రంధాలూ వీటిగురించే చెప్పేవారు తప్ప, యూదుమతమనేది ఒకటుందనే విషయం కూడా ఎప్పుడూ చెప్పలేదు. అసలుందో,లేదో తెలీని యూదుల గురించి ఇన్నిసార్లు ఖురాన్ మాట్లాడటం ఏందీ.. మన చుట్టూ ఉన్న హిందువుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఏందీ.. అనేవి అప్పట్లో నాకు వచ్చిన ప్రధాన డౌట్లు. తర్వాత – ఇంకొంచెం పెద్దయ్యాక – అంటే బీటెక్‌లో – నాస్తికత్వం తరుపునుండీ వచ్చే ఆర్గ్యుమెంట్లు వినడం వల్ల కొంత క్లారిటీ వచ్చినట్లు అనిపించింది. కొందరు వ్యక్తులు అప్పట్లో తమకున్న నాలెడ్జీ తో ఏవో నాలుగు మంచి మాటలు చెబితే -వారి అభిమానులు కాలక్రమంలో వారినే దేవుల్లుగా, ప్రవక్తలుగా మార్చేశారనీ – అంతకు మించి మతమూ,దేవుడూ వంటివన్నీ తెలివిలేనోల్లు నమ్మే విషయాలనీ నేను భావించాను. మహమ్మద్ ప్రవక్తకు ఆయన జీవించిన మక్కా-మదీనాల్లో కేవలం యూదులు,క్రైస్తవులే తెలియడం వల్ల వారిగురించి మాత్రమే చెప్పారనీ, ఆయనకు అప్పట్లో హిందూమతం గురించిగానీ, హిందువుల గురించి గానీ తెలియకపోవడం వల్ల, వారిగురించి ఏమీ మాట్లాడలేదనీ, అంతకు మించి, ఆయనకు దైవదూత కనిపించడం వంటి విషయాలన్నీ కల్పితాలనీ(ఫిక్షన్) కూడా ఫిక్స్ అయ్యాను. **********ఇంకొంచెం ఎదిగాక, కొత్తగా వచ్చి చేరిన నాలెడ్జీ ఆధారంగా ఈ అనుమానాలను మల్లీ చూద్దాం. హిందువుల గురించి ఖురాన్ లో ఎందుకు లేదు..? “అసలు హిందువులు అంటే ఎవరు?””హిందూమతం అంటే ఏమిటి?” మధ్యప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి, ఇవే ప్రశ్నల్ని 2015 లో కేంద్ర హోం శాఖకు ఆర్టీఐ అప్లికేషన్ లో అడిగాడు. హిందువుల ఉద్ధరనే ధ్యేయంగా రాజకీయాలు చేసే బీజేపీ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం – ” ‘హిందూ’ అనే పదానికి డెఫినిషన్ తమకు తెలియదు” – అని అధికారికంగా,లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అక్టోబర్ 11, 2015 న దీనికి సంబంధిన వార్త అన్ని జాతీయ పత్రికల్లోనూ వచ్చింది. కావలసిన వారు గూగుల్ సెర్చ్ చేసి చదువుకోవచ్చు.ఇక సుప్రీం కోర్టు విషయమే తీసుకుంటే – హిందూఇజం-హిందూత్వ వంటి పదాల డెఫినిషన్ ల గురించి 1992 లో ‘అభిరాం సింగ్’ అనే ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసు విచారణ ఇప్పటికీ పూర్తవ్వలేదు. ఇది కూడా గూగుల్ సెర్చ్ లో ఈజీగానే దొరుకుతుంది. మొత్తానికి ఈ పదాలగురించి దేశంలోని పెద్ద తలకాయలకే ఇంకా పూర్తి క్లారిటీ లేదు అనే విషయం మాత్రం క్లియర్. కాకపోతే, ‘ముస్లింలు,క్రిష్టియన్లు కానివారందరూ హిందువులే’- అనే ఓ పాపులర్ మైండ్ సెట్ మాత్రం భారతీయులందరి మెదల్లలోకీ బాగా ఫీడ్ చేయబడింది. దీని ఆధారంగానే – కొండ దేవతలకు మొక్కుకునే ఆదివాసులూ, గుళ్ళలోకి అడుగుపెట్టకుండా వెలివేయబడ్డ దలితులూ.. అందరూ హిందువులే ఐపోయారు.. ఈ లాజిక్ ఆధారంగానే ఇండియా ‘హిందూ మెజారిటీ’ దేశమైపోయింది. అదేంటో ఎవరికీ సరైన అవగాహన లేని పదాన్ని ఖురాన్ ఎందుకు ప్రస్తావించలేదని అడగడం, హైస్కూల్ లెవల్లో తెలివైన ప్రశ్నేమోగానీ, ఎదిగిన వారికి అదొక అమాయక, సిల్లీ ప్రశ్న అవుతుంది. ఐనప్పటికీ – నాస్తికత్వాన్నీ(అవిశ్వాసం), విగ్రహారాధననీ, బహుదేవతారాధననీ ఖురాన్ అనేక పర్యాయాలు డైరెక్ట్ గా ప్రస్తావించింది.వీటికి సంబంధించి అనేక లాజికల్ ప్రశ్నల్ని సంధించింది. ఈ రకంగా యూదు,క్రైస్తవ కాని, వివిధ థాట్ ప్రాసెస్ లన్నిటినీ కవర్ చేసినట్లే భావించొచ్చు. ********ఇప్పుడు యూదుల సంగతి చూద్దాం:మీరెప్పుడైనా చుక్కల నంబర్లని కలుపుతూ, ఓ పూర్తి బొమ్మను గీసే పజిల్స్ లాంటివి పూరించారా. యూదుల గురించి తెలుసుకోవడం అలాగే ఉంటుంది. బొమ్మ పూర్తైనట్లే ఉంటుంది, కానీ, అక్కడక్కడా కొన్ని నంబర్లు ఎంతకీ కనపడవు. ప్రపంచ జనాభాలో వీరి జనాభా అతి తక్కువే ఐనా, ప్రపంచంలో జరిగే ప్రముఖ ఘట్టాల్లో వీరి పాత్ర ఏదో రకంగా తప్పక ఉంటుంది. మరీ ముఖ్యంగా, ఇన్ని వందలూ,వేళ ఏల్లనుండీ వీరి ‘యూదు ‘ ఐడెంటిటీ చెక్కుచెదరకుండా సజీవంగా ఉంటూ వస్తుంది. ఇప్పటికి సరిగ్గా 100 ఏళ్ళ ముందు, అంటే 1920.. ఆ ప్రాంతంలో, యూదులకు వారి మతగ్రంధాల ఆధారంగా పాలస్తీనా-జెరూసలేం ప్రాంతాల్లో ఓ ప్రత్యేక దేశం ఏర్పడబోతుందని ఎవరైనా చెప్పి ఉంటే, నాస్తికులందరూ వాన్ని పిచ్చివాన్ని చూసినట్లు చూసి గేలి చేసిఉండేవారు. కానీ, వందేళ్ళముందు ఎవరి ఊహకు కూడా అందనిది ఇప్పుడు నిజమైంది.యుద్ధాల్లో, ఓ రాజ్యం-పక్కరాజ్యాన్ని ఆక్రమించుకోవడం, దాని పేరు మార్చి తనలో కలిపేసుకోవడం సాధారణంగా జరిగేదే. కానీ,కేవలం కొందరు వ్యక్తులు, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్నే తమకు కావలసిన విధంగా ఆడించి, తమకు ఓ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసే శక్తి, ఆ యూదు వ్యక్తులకు ఎలా వచ్చింది?కళ్ళముందు వీరు చేసే దురాగతాలు క్లియర్ గా కనిపిస్తున్నా – ప్రపంచానికే పెద్దన్నగా చలామనీ అయ్యే అమెరికానే వీరిని ఖండించలేని పరిస్థితి ఎందుకుంది? ఆఫ్రికాలో పెద్దగా జనసంచారం లేని, ఫుల్లుగా ఖనిజ సంపద,సహజ వనరులు ఉన్న దేశాన్ని ఇస్తామని గ్రేట్ బ్రిటన్ ఆఫర్ ఇచ్చినా, ససేమిరా అది వద్దనీ, తమకు పాలస్తీనానే కావాలనీ పట్టుబట్టడం, మొన్నటికి మొన్న, అంటే 2018 లో ఇజ్రాయెల్ క్యాపిటల్ గా అధునాతన ‘టెల్ అవీవ్’ కాకుండా పురాతన ‘జెరూసలేం’ ని రాజధానిగా అమెరికా ప్రకటించేలా చేయడం.. ఇవన్నీ మతంకోసం కాకుంటే , ఇంకెందుకు? ఇలా అడగగానే నాస్తిక మిత్రులు కొన్ని ప్రశ్నలు/కామెంట్లతో వస్తారు. యూదుల లాబీయింగ్ పవర్ అంతా వారి వ్యక్తిగత ప్రతిభ, వారి నోబెల్ ప్రైజులతో సాధ్యమైంది తప్ప, ఇక్కడ మతం ప్రస్తక్తి లేదని చెప్తుంటారు. ప్రతిదీ తమ మతగ్రంధాల ప్రకారం, వ్యూహాత్మకంగా, పక్కా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న యూదుల్ని, అబ్బే వారు సైన్సుకే ప్రాముఖ్యతనిస్తారు తప్ప, మతానికి కాదని కొందరు నాస్తికులు వెనకేసుకురావడం ఓ వింతల్లో కెల్లా వింత. అస్తమానం సైన్సు-మతం లను ఆపోజిట్ బైనరీలుగా ప్రొజెక్ట్ చేస్తూ వాదులాడే నాస్తికులకు, యూదుల ‘మత వైఖరి’ ఏ మాత్రం మింగుడు పడదు. కానీ, క్రీ.శ.8-13 శతాబ్ధాల, ఇస్లామిక్ హిస్టరీ చదివిన వారికి, సైన్సూ-మతమూ అపోజిట్ పదాలు కావనీ, ప్రస్తుతం మనం చదువుతున్న అనేక సైన్సు/మ్యాథ్స్ సబ్జెక్ట్ లకు మూలాలు, అప్పటి ఇస్లామిక్ రాజ్యాల్లో జరిగిన పరిశొధనల్లోనే ఉన్నాయనే విషయం తెలిసే ఉంటుంది. కాకపోతే, అనంతర ముస్లిం రాజ్యాలు అలస్త్వంతోనో,మూర్ఖత్వంతోనో ‘ప్రకృతిని శొధించడం ‘ అనే ప్రాసెస్ ని అటకెక్కించడంతో, ఆధునిక సైంటిఫిక్ విషయాల్లో వారు వెనుకబడ్డారు. **********ఖురాన్ యూదుల ప్రత్యేకతను అక్నాలెడ్జ్ చేస్తూనే, సృష్టి కర్త ఆదేశాలకు వ్యతిరేకంగా వెల్లే యూదులు దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే, పాలస్తీనా వారి ప్రస్తుత పరిస్థితి, ముస్లింలకు బాధ కలిగించినా, క్రమక్రమంగా పెరుగుతున్న యూదుల ప్రాబల్యం వారికి ఆశ్చర్యం మాత్రం కలిగించదు. అట్లే, సౌదీ, UAE, లాంటి ముస్లిం దేశాలు అమెరికా,ఇజ్రాయెల్ లతో అంటకాగి పాలస్తీనీయులకు మొండి చెయ్యి చూపడం కూడా ఆశ్చర్యం కలిగించదు. డాలర్ల మత్తులో, అమాయకులపై జరిగే అకృత్యాలను చూసీచూడనట్లు నటిస్తున్నందుకు, ఈ దేశాల పాలకులు కూడా తగిన మూల్యం తప్పక చెల్లిస్తారని వారు భావిస్తుంటారు. అంతిమంగా, ఖురాన్ 17:7 లో యూదుల ప్రస్తావన సంధర్భంగా చెప్పిన – “‘If you do good, you will do it for your own benefit, and if you do evil, it will be against yourselves’ ” అనే వాక్యాలు డైరెక్ట్ గా యూదులకూ, broader context లో సర్వమానవాలికీ వర్తిస్తాయి. -మహమ్మద్ హనీఫ్శుక్రవారం.ఇన్