“అసలు మహిళలబట్టల గురించి మగాల్లకెందుకు? నువ్వెందుకు ఆ విషయం గురించి రాస్తావ్” – అని ఓ తెలుగు ఉద్దరిస్టు గతంలో ఓ సారి నన్ను నిలదీసింది.”
” నువ్వడిగింది బాగానే ఉందక్కా.. కాకపోతే, బురఖా పిత్తురుస్వామ్య భావజాలమనీ, మహిళల్ని తొక్కేస్తుందనీ,బురఖాని విసిరికొట్టేసినోళ్ళే వీరవనితలనీ” – రాసే ఉద్దరిస్టు మగాల్లు గజానికొక్కరు చొప్పున ఉన్నారు. వారి బురఖా వ్యతిరేక పోస్టుల కింద “ముస్లిం మహిళలబట్టల గురించి మగాల్లకెందుకు?” అనే కామెంటు ఎప్పుడైనా రాశావా” అని అడిగా..
ఆన్సర్ లేదు.. టాపిక్ డైవర్ట్ చేయాలని చూసింది..
“ఆగాగు.. ముందు ఈ విషయం తేలనీ, -“బురఖా,హిజాబ్ వ్యతిరేక పోస్టుల కింద, ముస్లిం మహిళల బట్టల గురించి మగాల్లకెందుకు?” అని ఎప్పుడైనా కామెంట్ రాశావా- అని మళ్ళీ అడిగా.. అంతే – దెబ్బకు “అన్-ఫ్రెండ్” చేసేసింది.
ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటే – లిబరలిజానికీ, ఫెమినిజానికీ, సెక్యులరిజానికీ కేరాఫ్ అడ్రస్ అని చెప్తుంటారే.. ఫ్రాన్స్.. ఆ దిక్కుమాలిన దేశం నుండీ, రెండ్రోజుల ముందు ఓ దిక్కుమాలిన ప్రకటన వచ్చింది. అదేందంటే – వచ్చే అకడమిక్ ఇయర్ నుండీ అక్కడి స్కూల్లు,కాలేజీల్లో అమ్మాయిలు వదులుగా,పొడుగ్గా ఉండే బట్టలు ధరించడాన్ని నిషేధిస్తున్నారంట. అంటే, పొట్టిగా, బాగా టైట్ గా ఉండే బట్టలే వేసుకోవాలంట..
ఎందుకురా ఈ రూల్ అంటే – కొందరు అమ్మాయిలు లూజ్‌గా,పొడుగ్గా ఉండే బట్టల్ని వేసుకుని వస్తున్నారంట, వారిని చూసి, వారు ముస్లింలని గుర్తించి, ఇతరులకు కూడా ఇస్లాంపై ఇంట్రెస్ట్ వస్తుందట.. ఆ రకంగా ముస్లిం అమ్మాయిలు మత ప్రచారం చేస్తున్నారట.. దానిని ఆపడానికి ఇలా చేయాల్సొస్తుందట.. – అదీ విషయం.
దీని గురించి న్యూస్ లో “అబయ బ్యాన్(Abaya Ban)” అని రాస్తున్నారు గానీ, నిజానికి ఇది అబయ బ్యాన్ కాదు. అబయ అంటే- హెడ్‌స్క్రాఫ్ తో కలిపి పైనుండీ,కాళ్ళవరకూ ఉండే లూజ్ డ్రెస్. ఫ్రాన్స్ లో హెడ్‌స్క్రాఫ్ పై 2004 నుండే బ్యాన్ ఉంది. ఇప్పుడు బ్యాన్ చేసింది -లూజ్‌గా, పొడుగ్గా ఉండే డ్రెస్సుల్నే. ముస్లిం కంట్రీస్ లో మహిళల డ్రెస్ ల గురించి ఏ చిన్నవిషయమైనా, క్షణాల్లో ప్రపంచమంతా హెడ్‌లైన్స్ లో వస్తుంది. ఫ్రీ విల్లు, ఛాయిస్, మానవ హక్కులు-అరటికాయ తొక్కలు.. లాంటి పదాలతో విశ్లేషణాత్మక కథనాలు వస్తాయి. మరి ఫ్రాన్స్ నిర్వాకం గురించి ఎంతమందికి తెలుసు? ఇది మహిళల ఫ్రీ-చాయిస్ పై దాడి అని ఎంతమంది పోస్టులు రాశారు? రాయరు, రాయరుగాక రాయరు.
ఈ సోకాల్డ్ ఆధునిక భావాల లోతుల్లోకెళ్ళి అనలైజ్ చేస్తే- కొన్ని పడికట్టు పదాలతో జనాల్ని ఏమార్చడం తప్ప వేరే ఏమీ ఉండదు. ఈ దిక్కుమాలిన కాన్స్పెట్ లన్నీ తలకెక్కి, ఆ సోకాల్డ్ ఆధునిక సమాజాల్లో స్త్రీ అంటే ఎవరో, పురుషుడంటే ఏవరో, ఎన్ని రకాల జెండర్లున్నాయో తేలక, అక్కడ కుటుంబ వ్యవస్థ, సామజిక వ్యవస్థ అస్థవ్యస్థమైన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. అయినా అవేవీ హెడ్‌లైన్స్ లో రావు, వాటిమీద డిస్కషన్లు నడవవు.
“Indeed the worst kind of all beasts in the sight of Allah are the people that are deaf and dumb,17 and do not understand“-.(ఖురాన్ 8:22)