నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు

సహీ ముస్లిం, 20 వ పుస్తకంలో, హదీస్ నంబర్ – 4688 లో ఈ విషయం నమోదు చేయబడి ఉంది.
ప్రవక్త(స) అనుచరులలో ఒకరైన అబూహురైరా గారు ప్రవక్త(స) నుండీ ఈ విషయం విన్నట్లుగా బలమైన ఆధారాలతో రికార్డ్ చేయబడింది.

అంతిమ దినం నాడు అందరికంటే ముందుగా నరకంలోకి ప్రవేశపెట్టబడేది ముగ్గురు ముస్లింలను. వారు –

  1. ఇస్లాం తరుపున యుద్ధం చేస్తూ వీరమరణం(షహీద్) పొందిన యోధుడు.
  2. అనేక దానధర్మాలు చేసిన ధనవంతుడు.
    3.ఖురాన్ ను ఔపోసనపట్టిన పండితుడు/స్కాలర్.

ముందుగా, వీరమరణం(షహీద్) వ్యక్తి వంతు వచ్చినప్పుడు, అతని వీరోచిత యుద్ధక్షణాలు గుర్తుచేయబడతాయి. ఇదంతా తాను అల్లాహ్ కోసమే చేశానని ఆ వ్యక్తి చెప్తాడు.
-“నువ్వు అల్లాహ్ కోసం కాదు. నిన్ను ప్రజలు యుద్ధ వీరునిగా పొగడాలనీ, పరాక్రమ వంతుడిగా గుర్తుపెట్టుకోవాలనే కోరికతో ఆ యుద్ధాలు చేసిన విషయం నిజం కాదా అని నిలదీయబడతాడు.” మౌనంగా ఆ విషయాన్ని అంగీకరించడం తప్ప, ఆ వ్యక్తి చెప్పుకొనేదేమీ లేకపోవడంతో అతను నరకంలో శిక్షించబడతాడు.

రెండవ వ్యక్తి:
తాను అల్లా కోసం, అల్లా ఇచ్చిన ధనం నుండీ చాలా వరకూ దానధర్మాలకు వెచ్చించానని చెప్పుకుంటాడు.
“నువ్వు అల్లా కోసం కాదు, ప్రజలు నిన్ను దయామయుడిగా గుర్తించాలనీ, మహోపకారిగా పొగడాలనే కారణంతోనే అవన్నీ చేసిన విషయం నిజంకాదా” అని ప్రశ్నించబడతాడు.  
మౌనంగా ఆ విషయాన్ని అంగీకరించడం తప్ప, ఆ వ్యక్తి చెప్పుకొనేదేమీ లేకపోవడంతో అతను నరకంలో శిక్షించబడతాడు.

మూడవ వ్యక్తి:
తాను అల్లా కోసం ఖురాన్ ని కంఠతా పట్టి, వందలాది విద్యార్థులకు బోధించానని చెప్పుకుంటాడు.
“నువ్వు అల్లా కోసం కాదు, ప్రజలు నిన్ను మహా పండితుడిగా,మేధావిగా గుర్తించాలనే ఆశయంతోనే అవన్నీ చేసిన విషయం నిజం కాదా అని నిలదీయబడతాడు”. మౌనంగా ఆ విషయాన్ని అంగీకరించడం తప్ప, ఆ వ్యక్తి చెప్పుకొనేదేమీ లేకపోవడంతో అతను కూడా నరకంలో శిక్షించబడతాడు.

*************

ఈ హదీసు ను జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేక విషయాలు అర్థమవుతాయి.
ముందుగా ఈ ఖురాన్ వాక్యం చూడండి –
Surely We19 have created man, and We know the promptings of his heart, and We are nearer to him than even his jugular vein. (50:17) Moreover, there are two scribes, one each sitting on the right and the left, recording everything. (50:18)
“నిశ్చయంగా, మేము మనిషిని సృష్ఠించాము. అతని మనసులో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు.మేము అతని మెడ నరం కంటే సమీపంలో ఉన్నాము. అతని కుడి ,ఎడమ భుజాలపై ఉన్న ఇద్దరు లేఖకులు అతని ప్రతి చర్యనీ రికార్డు చేస్తున్నారు. “

అంతిమ దినం నాడు, లెక్కాపద్దులు చూసే సమయాన, ప్రతి వ్యక్తి భౌతిక చర్యలే కాకుండా అతని మనోలోతుల్లోని ఆలోచనలు కూడా పరిగనింపబడతాయి. ఓ వ్యక్తి భౌతిక చర్యలు పైకి, అంటే ఇతర వ్యక్తులకు కనిపిస్తాయి గానీ, అతని మనోఫలకం లోని ఆలోచనలు కూడా అల్లా గమనం లోనివే.

ఇస్లాం ప్రకారం, మంచిపనులు చేయడం మాత్రమే కాదు, ఆ మంచిపనుల వెనక ఉన్న ఇంటెన్షన్(ఉద్దేశ్యం) కూడా సరైనదే అయ్యుండాలి.

ఖురాన్ లోని మరో సూరా ప్రకారం –
““At the time of resurrection, We shall set up the scales of justice, and none will be wronged on that day. Everyone will be requited in accordance with his deeds. We shall take into reckoning the smallest of deeds, even if it be no greater than a mustard grain, for it is We Who shall call them to account” (21:47).
“పునరుత్థానం నాడు, సంపూర్ణ న్యాయం స్థాపించబడుతుంది. అన్యాయంగా ఏ వ్యక్తీ శిక్షింపబడడు. ప్రతివ్యక్తీ తాను చేసిన రవ్వంత మంచిగానీ, రవ్వంత చెడుగానీ, దాని ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు.”

ముస్లింల నమ్మకం ప్రకారం- తమకు సృష్టికర్త నుండీ అందరికంటే నిజమైన,పర్ఫెక్ట్ సందేశం ఖురాన్/హదీస్ ల రూపంలో వచ్చిందని చెప్తుంటారు. కాబట్టి అంత స్పష్టమైన సందేశం తర్వాత కూడా ముస్లింలు తప్పులు చేస్తే, వారు ఇతరుల కంటే కఠినంగా శిక్షించబడటం అనేది న్యాయమే కదా. అండమాన్ దీవుల్లోని ప్రజలూ, అమేజాన్ ఫారెస్ట్ లోని ఆటవిక తెగలు – వారికి వచ్చిన సందేశం ప్రకారం మాత్రమే జడ్జ్ చేయబడతారు. ఇస్లాం గురించి ఎప్పుడు తెలియని/వినని ముస్లిమేతరులకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. కానీ, సత్య సందేశం చెవినబడిన తర్వాత కూడా, దానిని తిరస్కరించేవారు,అంతిమ దినం నాడు తమను తాము ఎలా డిఫెండ్ చేసుకుంటారో, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం.

మొత్తానికి – “విశ్వాసులు చేసే మంచి పనుల యొక్క ఇంటెన్షన్- అల్లాహ్ ను ప్రసన్నం చేసుకోవడమే అయ్యుండాలి తప్ప, ప్రాపంచిక లబ్ధి కోసం కాకూడదు” అనే సందేశం – ఈ సహీ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది.
అనంత కరుణామయుడైన అల్లాహ్ అందరికి మేలు చేయుగాక.ఆమీన్.

shukravaram.in

One Reply to “నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు”

Leave a Reply

Your email address will not be published.