ముస్లిం మతం గురించి నాకు తెలియదు.
కానీ…… పెక్కు మంది ముస్లిమ్ లలో మానవత్వం చూసాను..
Note: ఈ పోస్ట్ ముస్లిం మతం గొప్పది, వేరే మతం తక్కువది అని చెప్పడం కాదు. నాకు ఏ మతం మీద గొప్ప అభిప్రాయాలు లేవు.
చదువు కూడా తక్కువ గా ఉన్న గల్ఫ్ దేశాల ప్రజాల్లోఎలా అంత సహనం ఏర్పడింది? మానవత్వం వెల్లివిరుస్తుంది? మహిన్నత చరిత్ర వుండి, మనం ఎందుకు అసహనం కి లోనవుతున్నాం అనేదానికి ఈ పోస్ట్.
నెను ఉద్యోగరీత్యా దాదాపుగా 8 సంవత్సరాలు గల్ఫ్ దేశాలలో ఉన్నాను, దాదాపుగా 10 దేశాలు తిరిగాను. నాకు ఏ మతాల గురించి పెద్దగా తెలుసుకోవాలి అని ఎప్పుడు లేదు. నా మతం గురించే నాకు పెద్దగా తెలియదు. ముస్లిం మతం లో నాకు తెలుసుకోవాలి అనిపించింది ఏంటి అంటే, బఃహు భార్యాత్వం మీద అక్కడ సమాజం లో ఎలాంటి అభిప్రాయం ఉండేది అని. మా కొలీగ్ waqar ని అడిగాను, ఇది ఎలా ఒక మతం లో పెడతారు. సమాజం లో ఉండేది 50 స్త్రీలు 50 పురుషులు, ఒకరు, ఇద్దరు ముగ్గురిని చేసుకొనే పనయితే కొందరికి పెళ్లి చేసుకోడానికి స్త్రీలు ఉండరు ఇవి సామాజిక సమస్యలకు దారితీస్తుంది కదా అని అడిగాను.దానికి ఆయన చెప్పింది, ఇస్లాంలో బహు బార్యాత్వం వచ్చినది మంచి కోసమే కానీ అది ఇప్పుడు ఎక్కువగా దుర్వినియగం అవుతుంది అని. ఒకప్పుడు పెక్కు ముస్లిం రాజ్యాలలో యుద్దాలు జరిగి అనేక మంది స్త్రీలు భర్తలను కోల్పోయి వారికి ఏ ఉపాధి లేక పెక్కు మంది వ్యభిచారం లేక ఇంకా కొంన్ని అసాంఘిక పనులకు పాలపడుతున్నారు పొట్ట కూటి కోసం. కావున అప్పుడు మత పెద్దలు ఎవరయినా బాగా ఆర్థికంగా ఉన్నవారు భార్య అనుమతితో దీనురాలయిన భర్త పోయిన స్త్రీలకు ఒక ముగ్గురికి సామాజిక హోదా ఇచ్చి భార్య స్థానం ఇవ్వచ్చు అని చెప్పారు. అలా ఏర్పాటు అయిన దానిని కొందరు కాలానుగుణంగా వారి విలాసాలకు లేదా హోదా ప్రదర్శించుకోడానికి చేశారు అని. నేను వారి భార్యను కూడా అడిగాను, ఆవిడ కూడా మతాచారాల ప్రకారం జీవించే ఉన్నత వ్యక్తి. ఆవిడ కూడా దానిలో తప్పు లేదు, మా భర్త ఎవరికన్నా అలాంటి వ్యక్తులకు ఆశ్రయం ఇస్తే నాకే సమస్య లేదు అన్నారు. వారు పాకిస్తాన్ కి చెందిన వారు. అలానే స్థానికంగా మస్కట్ లో ఉన్న ఒక కొలీగ్ ని అడిగాను, ఆవిడ అదో పెద్దసమస్య కాదు అని అన్నారు. అలానే నేను గమనించిన ఇంకో విషయం అక్కడ డ్రైవింగ్ చాలా స్పీడ్ . కొన్ని రోడ్ల మీద 160 వరకు వెళ్లొచ్చు. 120కి తగ్గితే అక్కడ పెనాల్టీ వేస్తారు. ఎన్నో ప్రమాదాలు కూడ జరుగుతాయి, ప్రమాదం జరిగినప్పుడు ఎవరుకూడా అరచుకోరు. కారు దిగగానే ఇద్దరు ఒకరికొకరు దగ్గరకు వచ్చి బావున్నారు కదా మీకు అల్లా దాయవలన ఏమి అవలేదు కదా, మీ కుటుంబ సభ్యులు అందరూ బావున్నారు కదా అని మాటలాడుకొని, ఇద్దరు పోలీస్ లకు ఫోన్ చేసి, వారు వచ్చి ఎవరిది తప్పు, ఎవరికి ఏమి పెనాల్టీ వేయాలో నిర్ణయం చేస్తారు. తప్పు చేసిన వాడు రెండో వాడికి రిపేర్ ఖర్చు కొంత భరించాలి, మరియు ఇతనికి వచ్చే సంవత్సరం లో ఇన్సూరెన్స్ ఎక్కువ కట్టవలసి వస్తుంది.
ఒక్కోసారి ఒక కార్ ఆయన బాగా ధనవంతుడు అయి ఉండొచ్చు. రెండో అతను ఏదయినా కంపెనీలో డ్రైవర్ లేదా చిరు ఉద్యోగి అవొచ్చు. అప్పుడు పోలీస్ వచ్చే లోపు చిరుద్యోగి లేదా కంపెనీ డ్రైవర్ లేదా టాక్సీ డ్రైవర్ అని తెలుసుకొంటే లేదా చిరుద్యోగి విన్నవిస్తే, పెద్దవారు వారి పోలీసులకు ఇది మా తప్పు నా వలన జరిగింది అని, ఆ చిరుద్యోగి కి బాధ కలిగించకుండా చేస్తారు. ఇది నేను పెక్కు సార్లు గమనించిన అతి గొప్ప విషయం. కార్ డ్రైవర్ అయితే అతని తప్పువలన శిక్ష అతనికి పడితే దాదాపుగా రెండు సంవత్సరాలు సగ జీతం కంపెనీ వారు కట్ చేస్తారు. అది ఎదో నాలుగు రాళ్లు సంపాదించుకొందాం అని అక్కడకు వెళ్లిన వారికి చాలా కష్టం. అక్కడ వాడు మన మతమా పర మతమా అని చూడరు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం అంటే ఉగ్రవాదులు అనే భావం బలపడింది, కానీ ఇలాంటి మంచి తనం వారిలో దాదాపుగా 99% సామాన్య వ్యక్తులతో ఎలా అలవడింది? సరయిన విద్యావ్యవస్థ లేని అక్కడ ఇలాంటి అత్యున్నత మానవత్వపు విలువలు ఎవరు నేర్పారు? అది మాత్రం తెలుసుకోలేకపోయాను. మత రాజ్యాలయిన దుబాయ్ బహ్రెయిన్ ముస్కట్ లాంటి ప్రదేశాలలో హిందు క్రీస్తు మతాలను గుడులు కట్టుకోడానికి స్థలం సహాయం చేసే ఉన్నత వ్యక్తిత్వం ఎలా అలవడింది? పంది అంటే అసహ్యం వేసే వారు మత భావనలు విపరీతం గా అనుకరించే వారు ఎలా పంది మాంసంని వారి దేశంలోకి అనుమతించారు? సూపర్ మార్కెట్ లో పంది మాంసం అమ్మే కౌంటర్స్ ఎలా వచ్చాయి? అదే దేశంలో రేప్ చేసిన వ్యక్తిని ఉరి తీస్తారు, అక్కడస ఎలాంటి దయ లేదు నేరస్తుల మీద, రాజుకి కూడా క్షమా భిక్ష పెట్టె అధికారం లేదు. కేవలం బాధితులకు మాత్రమే ఉంటుంది ఆ అవకాశం. భర్తను హత్య చేసిన వారికి కోర్టు మరణ శిక్ష వేసిన తరువాత, అడుగుతారు బాధితురాలిని ఈ శిక్ష నీకు సమ్మతమేనా అని, ఇది చట్ట ప్రకారం శిక్ష, అని, ఎంతోమంది మా కర్మ అల్లా ఇలా రాసిపెట్టాడు, అతనిని చంపి మరలా వారి భార్య పిల్లల రాత మనమెందుకు రాయాలి అని క్షమా భిక్ష పెట్టిన బాధితురాళ్లు ఉన్నారు. ఎంతటి అత్యున్నతమయిన వ్యక్తిత్వం అది??
ఇది ఈ రోజు ఎందుకు రాస్తున్నాను అంటే, నిన్న మా దగ్గర ఒక చిన్న ప్రమాదం జరిగింది, నా ముందుగా ఒక స్త్రీ చక్కని దుస్తులతో నుదిటిన మంచి సింధూరంతో చేతులకు రెండు డజన్ల గాజులతో హోండా ఆక్టివా నడుపుతోంది. వెనక వస్తున్న టాక్సీ కార్ డ్రైవర్ ట్రాఫిక్ లో ఆమె వాహనం లెగ్ రెస్ట్ కి ప్రక్కగా తగిలింది. ఆవిడ వెనక్కి తిరిగి ఎదో తిట్టింది అతనిని. అతను పోమ్మ ఏమి అవలేదు లే అని చేయి చూపించాడు కొంచెం రాష్ గా. ఆవిడ ట్రాఫిక్ మధ్యలో బండి ఆపి పోయి వాడిని కొట్టునది. వాస్తవం గా అతని కార్కి కొంచెం గీసుకుపోయింది ఒక వ్యక్తిని అలా పోయి కొట్టడం ధర్మమా!!! ఇలాంటివి ఎందుకు మహోన్నతమయిన సంస్కృతి/చరిత్ర ఉన్న మన దేశం లో జరుగుతున్నాయి?? ఎందుకు అసహనం అంత!!! ప్రమాద వశాత్తుగా జరిగేవాటికి మనం ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తాం? కావాలని ఎవరు గుద్దరు కదా(హంతకులు తప్పితే)? కనీసం ఒక ప్రమాదం లో కూడా ముందు వ్యక్తికేమైందా అని పట్టించుకోకుండా ఎందుకు మనం మన ప్రతాపాలు చూపిస్తాం. అదే కొంచెం డబ్బు ఉన్నవారు అలాంటి క్లిష్ట సమయం లో అహం దర్పం ప్రదర్శించుకోడానికి ముఖ్య భూమిక ఇస్తారు? వ్యక్తికి విలువ లేదా?
అదే ముస్లిం వ్యక్తులు మన భారత దేశంలో ఎందుకులా ప్రవర్తించ లేకుండా ఉన్నారు. కేవలం 1% కన్నా ఎక్కువ లేని ఉగ్రవాదుల వలన మనం అరబ్ దేశాలలో 99% ప్రజల్లో ఉన్న మానవత్వం ని చూడలేక పోతున్నాం? అక్కడ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఎక్కడుంది లోపం? మత సహనం రాజ్యాంగంప్రకారం ఉన్న దేశాలలో మత సహనం లేదు. అసలు రాజ్యాంగం ఎన్నికలు లేని నిరంకుశ రాజ్యాలలో అంత ఉన్నత విలువలు పౌరులలో ఎలా అలవాడినాయి. ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు.మీ కేమయినా తెలిసీ ఉంటే చెప్పండి. చెత్త సందేశాలు వాక్యానాలు(కామెంట్స్) రాసే వారు ముందుగా ఎవరన్నా గల్ఫ్ లో ఉన్న వారితో మాటలాడి రాయగలరు.
శ్రీనివాసులు పాలేపు.
బెంగళూర్.
Sir ur right,i know some thing,that who is study quran,or,namaz,or mohammed(s,a,w)s,behaviar,and,allahs,order.that people do this type of behaving