పరిచయం – లియోపోల్డ్ వెయిస్’s The Road To MECCA
==============================
లియోపోల్డ్ వెయిస్ 1900 వ సంవత్సరంలో, యూదు తల్లిదండ్రులకు ఆస్ట్రియాలో జన్మించాడు.
20 ఏళ్ళు వచ్చేటప్పటికి, హిబ్రూ, జర్మన్,ఫ్రెంచ్, పోలిష్, ఇంగ్లీష్ భాషల్లో పట్టు సాధించాడు. జర్నలిజం వృత్తిగా స్వీకరించాడు. యూరప్ లోని ప్రముఖ పత్రికలకు జర్నలిస్ట్ గా పనిచేస్తూ, ఆ పని మీదే అరబ్ వ్యవహారాలు కవర్ చేయడానికి సిరియా, పాలస్తీన్,సౌదీ అరేబియా లాంటి అనేక అరేబియన్ దేశాల్లో కొన్ని సంవత్సరాలు గడిపాడు.అక్కడే అరబిక్ నేర్చుకున్నాడు. తను అప్పటివరకూ చూసిన యూరప్ జీవన విధానం, అరేబియాలో చూసిన ఇస్లామిక్ జీవన విధానం లను క్రిటికల్ గా అనలైజ్ చేశాడు. ఇస్లాం సిద్ధాంతాలకు ఆకర్షితుడై, 1926లో మహమ్మద్ అసద్ గా మారిపోయాడు.
1932 లో బ్రిటీష్ ఇండియా పర్యటనకు వచ్చాడు. అక్కడే ప్రముఖ కవి మహమ్మద్ ఇక్బాల్(అల్లామా ఇక్బాల్) తోనూ, అప్పుడే పురుడుపోసుకుంటున్న పాకిస్తాన్ అనే ఆలోచనతోనూ పరిచయం అయింది. 1947 లో పాకిస్తాన్ ఏర్పడ్డాక, ఆ దేశ పౌరసత్వం స్వీకరించి ఐక్యరాజ్యసమితిలో తొలి పాకిస్తాన్ రాయబారిగా మహమ్మద్ అసద్ నియమించబడ్డాడు.
1952 వరకూ ఆ పదవిలో ఉండి, రచనా వ్యాసంగం కొరకూ స్వచ్చందంగా పదవీ విరమణ చేశాడు. పశ్చిమ దేశాల్లో ఇస్లాంపై గల అపోహలకి, అరేబియాలో తాను చూసిన ఇస్లాం కి ఎంత అంతరం ఉందో వివరించేలా, ఆయన రాసిన ఆటొబయాగ్రఫీ రచన – ద రోడ్ టు మక్కా, అమెరికా, యూరప్ లలో ఓ సంచలనం.అది ఇప్పటికే లెక్కలేనన్ని పునర్ముద్రణల్ని పొందింది. ఇంకా పొందుతుంది. ఆయన రాసిన -ఇస్లాం అట్ క్రాస్ రోడ్స్ , అనే పుస్తకం కూడా బాగా పాపులర్ అయింది.
ఇక ఖురాన్ ని అనువాదం + వ్యాఖ్యానం ఇస్తూ ఆయన రాసిన – ద మెసేజ్ ఆఫ్ ఖురాన్ , ఇంగ్లీష్ లో ఇప్ప్పటివరకూ వచ్చిన గొప్ప అనువాదాల్లో ఒకటిగా గుర్తింపబడింది.
ఆయన రాసిన రోడ్ టు మక్కా పుస్తకం నుండీ, నాకు నచ్చిన కొన్ని అంశాల్ని ముందు ముందు మిత్రులతో షేర్ చేసుకుంటాను.. ఇన్షాల్లా.
ద రోడ్ టు మక్కా పుస్తకం నుండీ – పార్ట్-1
==============================
సిరియాలోని పురాతన దమాస్కస్ నగర వీధుల్లో నేను చూసిన విషయాలు, మనిషి జీవితంపై, నా ఆలోచనలను సమూలంగా మార్చివేశాయి. ఓ ప్రశాంత కొలనులో ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈదులాడే చేపపిల్లలాగే అక్కడి ప్రజల నడివడిక ఉండేది. అక్కడి మనుషులు ఒకరినొకరు పలకరించుకునే విధానం, గౌరవించుకునే విధానం, ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకునే విధానం.. అన్నీ సమ్మోహనాత్మకంగా ఉండేవి. ఆ వీధుల్లో అనేక చిన్న,చిన్న దుకాణాలు ఉండేవి. ఒకేరకమైన వస్తువుల్ని అమ్ముతున్నప్పటికీ, ఆ దుకాణాల యజమానులకు ఒకరికొకరిపై అసూయగానీ, అభద్రత గానీ ఏ మాత్రం కనిపించేది కాదు. ఓ షాపు యజమాని ఏదైనా పనిపై వెళ్ళాల్సివచ్చినప్పుడు, తన దుకాణాన్ని కాసేపు చూస్తుండమని పక్క యజమానికి చెప్పివెళ్ళేవాడు.
ఓ కష్టమర్ ఎవరైనా ఆ వీధిగుండా వెలుతూ, యజమాని లేకుండా ఖాలీగా ఉన్న ఆ షాపులోకి వెళ్ళాలా వద్దా అని తటపటాయిస్తూ నిల్చున్నప్పుడు, ఆ పక్క షాపు యజమాని వచ్చి, ఆ కష్టమర్ ని షాపులోకి తోడ్కొని వెల్లి, ఆ కష్టమర్ కి కావలసిన వస్తువుల్ని అమ్మి, ఆ డబ్బును క్యాష్ కౌంటర్ దగ్గర ఉంచేసి తిరిగి తన షాపులోకి వెళ్ళిపోయేవాడు తప్ప, తన కాంపిటీటర్ అయిన పక్క షాపు ఓనర్ లేని అవకాశాన్ని వాడుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ఇలాంటి దృశ్యం ఎన్నోసార్లు నాకంటపడింది. ఇలాంటి దృశ్యం యూరప్ లో ఎక్కడైనా ఊహించగలమా?
ఇక శుక్రవారం వచ్చిందంటే, దమాస్కస్ మొత్తం కొత్త శోభను సంతరించుకునేది. ప్రజలందరిలోనూ ఆనందం, ఉల్లాసం మరియు ఓ రకమైన తాద్యాత్మిక భావన( సోలెమ్నిటీ) కొట్టొచ్చినట్లు కనపడేవి. నాకు మా యూరప్ లో ఆదివారాలు గుర్తుకొచ్చేవి. ఆ నిశబ్ధ నగర వీధులు, మూసి ఉన్న దుకాణాలు, ఆ శుష్కపు, ఒట్టిపోయిన రోజులు గుర్తొచ్చేవి. ఎందుకు అలా ఉండేవో నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే, పాశ్చాత్య జీవనంలో ప్రతివ్యక్తీ తన దైనందిన జీవితంలో అంతులేని భారాన్ని మోస్తున్నాడు. ఆ భారం నుండి వారికి ఆదివారం కాస్త ఊరట/తెరపినిస్తుంది. అక్కడ పేరుకే ఆదివారం విశ్రాంతి దినం. నిజానికి అది తమ దైనందిన భారాన్ని కాసేపు మరచిపోయేలా చేసే ఓ అబద్ధపు పలాయనం.
కానీ అరబ్బులకు , శుక్రవారం అంటే మిగతా రోజుల్లో చేసే శారీరక శ్రమని మరచిపోవడం కాదు. అలాగని వారికి జీవితంలోని అన్ని సౌకర్యాలూ, ఎలాంటి శ్రమలేకుండా తేరగా ఊడిపడ్డాయనీ కాదు. వారి కష్టాలూ-శారీరక శ్రమకీ, వారి మానసికోల్లాసానికి మధ్య ఎలాంటి అంతరం లేదు. బ్రతుకు తెరువుకు చేసే పనీ, ఎంటర్టైన్మెంట్ కోసం చేసే పనీ వేరువేరు కావు. అందుకే, వారికి శుక్రవారం సెలవు దినం కాదు. దుకాణయజమానులు, చేతివృత్తులవారూ అన్ని రోజుల్లాగానే శుక్రవారం కూడా దైనందిన వృత్తి చేసుకుంటారు. మద్యాహ్నం నమాజు వేలలో కొన్ని గంటలు దుకాణాల్ని మూసివేసి మసీదువైపుకు బయలుదేరుతారు. అనంతరం వీధి మలుపులో ఉన్న ఏ కేఫ్ లోనో బంధు మిత్రులతో కాసేపు ముచ్చటించుకుని, మళ్ళీ గొప్ప ప్రశాంతతతో తమ,తమ వృత్తిపనుల్లో నిమగ్నమవుతారు.
ఓ శుక్రవారం నాడు, నా మిత్రునితో కలిసి నేను మసీదుకు వెళ్ళాను. ఉమయ్యద్ సుల్తానుల కాలం నాటి ఆ విశాల మసీదులో, ముందుండి నమాజ్ చేస్తున్న ఇమాం వెనక కొన్ని వందల కొద్దీ వరుసల్లో నిలబడి, అన్ని వేల మంది ప్రజలు , సుశిక్షుతులైన సైనికుల వలె ఒకేసారి ముందుకు వంగడం, నేలపై తమ నుదురుని ఆనించి సాష్టాంగపడుతూ, తమను తాము సృష్టికర్తకి అర్పించుకోవడం.. ఓ కన్నులకింపైన దృశ్యం.
వారు చేసే ప్రార్థన, వారిని దైనందిన వృత్తి జీవితం నుండి వేరు చేసేది కాదు. దైనందిన జీవితాన్ని మర్చిపోయేలా చేసేది కాదు. సృష్టికర్తను అనుక్షణం తలచుకుంటూ, దానిని మరింత గుర్తు చేసేది.
మసీదు నుండీ బయటికి వచ్చేటప్పుడు -” సృష్టికర్త సాక్షాత్తూ మీ ఎదురుగానే ఉన్నట్లుగా, మీకు అతి సమీపంలో ఉన్నట్లుగా భావిస్తూ మీరు చేసే ఈ నమాజ్ ఎంత అద్భుతమైన విషయం. దేవున్ని నేను కూడా అంత దగ్గరగా ఫీల్ అవ్వాలని నాక్కూడా చాలాసార్లు అనిపిస్తుంటుంది” – అని నా మిత్రునితో చెప్పాను.
దానికి నా మిత్రుడు -” నేను నీ మెడ నరం కన్నా కూడా దగ్గర్లో ఉన్నానని ” సృష్టికర్త ఖురాన్ లో చెప్పిన వాక్యాన్ని(50:16) గుర్తుచేశాడు.
( From Pages #126,#127)
To Be Continued..
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in
Dear Bro ,
Peace unto you please try to send PDF copies of above said Books ,Road To Mecca , Islam at Cross roads , Message of Holy Quran to my Email address
[email protected].
Masha ALLAH
May ALLAH success in your work
आपका कोई भी website हिंदी में हो तो ज़रूर बताइय्ये
Jazakallah brother. As of now, it’s in Telugu only.