ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు -Burçin Mutlu-Pakdil ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా లో రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తుంది.
Texas Tech University లో మాస్టర్స్ డిగ్రీ,
యూనివర్సిటీ ఆఫ్ మినెసోటా లో – ఆస్ట్రోఫిజిక్స్ లో పీహెచ్డీ చేసింది. అంతకు ముందు- తన సొంతదేశం, టర్కీ లో, అంకారా యూనివర్సిటీ నుండి పిజిక్స్ లో అండర్ గ్రాడ్యుఏషన్ చేసింది.
2018లో, అప్పటివరకూ ఎవరికీ తెలియని ఓ వింత గెలాక్సీని ఈమె కనుగొంది. అది భూమికి 359 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటి వరకూ కనుగొన్న అన్ని గెలాక్సీల కంటే విలక్షణ లక్షణాలను ఈ గెలాక్సీ కలిగి ఉంది. ఈమె ఆవిష్కరణకు గుర్తుగా శాస్త్రవేత్తలు, ఆ గెలాక్సీకి ఈమె పేరునే పెట్టారు. ప్రస్తుతం ఈమె, ఈ గెలాక్సీ గురించి మరిన్ని రహస్యాలను రాబట్టే పని లో ఉంది.
అంకారాలో చదువుతున్నప్పుడు, ఈమె ఓ ప్రధాన సమస్యను ఎదుర్కొంది. అది – హిజాబ్. ఈమెకు బయటికి వెళ్ళినప్పుడల్లా హిజాబ్ ధరించడం అలవాటు. అప్పటి టర్కీ చట్టాలప్రకారం – కాలేజీల్లో చదివేవారు, ప్రభుత్వోద్యోగాలు చేసేవారూ, హిజాబ్ ధరించడం నిషిద్దం.(అనేక మహిళల నిరసనలూ,ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తేశారు. ) దీనితో ఈమె పెద్దగా, రౌండ్ గా ఉన్న హ్యాట్ లాంటిది పెట్టుకోవడం వంటి చిట్కాలు ఫాలో అయ్యేది.తరువాత పెద్ద చదువులకోసం అమెరికాలో అడుగుపెట్టీనప్పటినుండీ, తనకు పూర్తి స్వేచ్చ వచ్చిందనీ, తనకు నచ్చిన రకరకాల హేడ్స్రాఫ్ లు ధరిస్తున్నాననీ నేషనల్ జియోగ్రాఫిక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
ఈమె అనేక TeD టాక్స్ కూడా ఇచ్చి ఉంది. ఆసక్తి ఉన్నవాల్లు యూటూబ్ లో చూడొచ్చు.
Interview link in NGC : https://www.nationalgeographic.com/science/2018/11/meet-woman-discovered-new-type-galaxy-burcin-mutlu-pakdil-astrophysics/