స్వర్గం పురుషులకేనా..? స్త్రీలకేంటి మరి..?

“స్వర్గంలో పురుషులకు కన్యలనిస్తారు. మరి స్త్రీలకు ఏం లభిస్తుంది”హ..హా..హా”స్వర్గంలో మొగోల్లకు రంభ,ఊర్వసి,మేనక ఉంటారు, మరి ఆడోల్లకోసం ఎవరుంటారు”హి…హి..హి..ఇలాంటి కామెంట్లు,రియాక్షన్లు ఇప్పటిదాకా ఎన్ని చూశారు..? 50,100..? అది అన్-లిమిటెడ్ కౌంట్.అసలు స్వర్గం అనేది కేవలం పురుషులకేనా, లేక అందులో మహిళలకు కూడా ప్రవేశం ఉంటుందా అనేది- కాస్తంత రీజనబుల్,ఓపెన్ మైండ్,లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నోల్లు అడగాల్సిన ప్రశ్న.

నూటికి 99మంది ఈ ప్రశ్న అడక్కుండానే,ఏ మాత్రం స్టడీ చేయకుండానే, దీనికి తమకు సమాధానం తెలిసిపోయిందనుకుని కంక్లూజన్ కి వచ్చేసి పైన రాసిన కామెంట్లు,రియాక్షన్లు ఇస్తుంటారు. ఎందుకిలా చేస్తారనేదానికి, వారికి బాగా తెలుసనుకుంటున్న తమ-మతం యొక్క సంగతులు, సినిమాలు,సాంస్కృతిక అంశాలు కారణం. వాటి సంగతి పక్కనపెట్టి ఇస్లామిక్ పాయింటాఫ్ వ్యూలో చూస్తే – ముందుగా జనాలకు గుర్తుకు వచ్చేది – “జీహాద్ లో చనిపోయినవారికి 72 కన్యలు లభిస్తారని” ఇస్లాం లో ఉందని.

ఈ “జీహాద్ లో చనిపోయినవారికి 72 కన్యల అంశం” ఖురాన్ లో ఎక్కడా లేదు.ఇది ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసి నిర్ధారించుకోవచ్చు. కొన్ని హదీసుల్లో ఉంది గానీ, అవి నాన్-అథెంటిక్, అంటే చైన్-ఆఫ్-న్యారేషన్ అంత పక్కాగా లేవు అని అర్థం. ఇది ఖురాన్లో లేదని ముస్లింలు చెప్తే నమ్మనంతగా జనాల్లోకి వ్యాపించింది కాబట్టి, ఖురాన్ గురించి రీసెర్చ్ చేసి అనేకపుస్తకాలు రాసిన యూదుమహిళ -Lesley Hazleton ఈ అంశాన్ని స్వయంగా చెప్తున్న యూటూబ్ వీడియో యూటూబ్ లో ఉంది ఎవరైనా చూసి నిర్ధారించుకోవచ్చు.”ఆమె పేరు+ 72 విర్జిన్స్” అని యూటూబ్ సెర్చ్ బార్ లో కొడితే ఆ 9 నిమిషాల టెడ్ టాక్ వీడియో వస్తుంది.

ఖురాన్+ఆథెంటిక్ హదీస్ ల బోధనల్ని బట్టి- నలుగురు మహిళలకు స్వర్గప్రాప్తి కన్‌ఫర్మ్ అని చెప్పబడింది.
వారు -1.ప్రవక్త ఈసా,(ఏసుక్రీస్తు)గారి తల్లి -మరియం.
2.మహమ్మద్ ప్రవక్త గారి మొదటి భార్య,మరియు ఆయన ప్రవక్తే అని మొదటిగా నమ్మిన వ్యక్తి – ఖదీజా
3.మహమ్మద్ ప్రవక్త గారి కూతురు -ఫాతిమా.
4.తనని దేవుడిగా డిక్లేర్ చేసుకున్న ఈజిప్ట్ పాలకుడు ఫారో ని ఎదిరించిన అతని భార్య -ఆసియా.

Lesley Hazleton మాటల్లోనే చెప్పాలంటే – ఖురాన్ ప్రత్యేకత , అది ఇతర మతగ్రంధాలలాగా దేవుడు పురుషులతో మాట్లాడుతున్నట్లు ఉండదు. చాలా సంధర్భాల్లో, “ఓ బిలీవింగ్ మెన్ అండ్ బిలీవింగ్ వుమెన్”, “ఆనరబుల్ మెన్ అండ్ ఆనరబుల్ వుమెన్” అని స్త్రీ-పురుషుల్ని కలిపి ప్రస్తావిస్తుంది. Allah says, “And therein is whatever the souls desire and [what] delights the eyes.” [QURAN 43;71]ఇక్కడ Souls అని ఉంది తప్ప, men అని లేదు. “But those who do good—whether male or female—and have faith will enter Paradise and will never be wronged ˹even as much as˺ the speck on a date stone”-Quran4:124″Allah has promised the believing men and believing women gardens beneath which rivers flow, wherein they abide eternally, and pleasant dwellings in gardens of perpetual residence; but approval from Allah is greater. It is that which is the great attainment”- Quran 9:72″Surely ˹for˺ Muslim men and women, believing men and women,1 devout men and women, truthful men and women, patient men and women, humble men and women, charitable men and women, fasting men and women, men and women who guard their chastity, and men and women who remember Allah often—for ˹all of˺ them Allah has prepared forgiveness and a great reward”.-Quran 33:35

ఈ విధంగా, స్త్రీ-పురుషులు ఇద్దరికీ అని అనేక వాక్యాల్లో ప్రస్తావించినట్లుగానే, కొన్ని వాక్యాల్లో ప్రత్యేకంగా పురుషులకు “హూరియా” ఉంటారని చెప్పిన వాక్యాలు కూడా 4 ఉన్నాయి. హూరియా గురించి అరబిక్ లిటరేచర్ లో అందమైన పడుచుయువతుల వర్ణనలో వాడబడి ఉంది. కన్యలు అని కూడా వాడుతుంటారు గానీ, Lesley Hazleton మాత్రం, Quran’s paradise is not about virginity, its quite opposite, its fecundity- అని వర్ణించింది.

ఖురాన్ 41:31 మరియు 43:71 వాక్యాల్లో, you will get Whatever souls desire, మీ మనసు ఏది కోరుతుందో అది లభిస్తుంది అని ఉంది. పురుషులకు హూరియా గురించి ప్రత్యేకంగా చెప్పిన ఖురాన్, మహిళల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అని కూడా కొందరు ప్రశ్నిస్తుంటారు. అలా ప్రస్తావించకుండా Whatever souls desire,అని చెప్పడం ద్వారా ఒకరకంగా మహిళల గౌరవాన్ని కాపాడిందని కొందరు వ్యాఖ్యానిస్తారు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కొన్ని,కొన్ని అర్థమవుతాయి.ఖురాన్ లో స్వర్గం గురించి వర్ణనల్లాగే, HellFire(నరకాగ్ని) గురించి కూడా వర్ణనలున్నాయి.

క్లుప్తంగా – స్వర్గం అంటే మంచిది, మనిషి కావాలని ఆశించేది, నరకం అంటే – బాధకలిగించేది, మనిషి చింతించేది అని చెప్పొచ్చు. సృష్టికర్తను గుర్తించి రుజుమార్గంలో పయనిస్తే మంచి జరుగుతుంది, లేకపోతే కీడు జరుగుతుందనేది ఖురాన్ కన్సిస్టెంట్ గా చెప్పే మెసేజ్. అన్నట్లు, ఈ నరకాగ్ని విషయంలో స్త్రీలకు ప్రత్యేక మినహాయింపులేమీ లేవనే విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు కదా.

Leave a Reply

Your email address will not be published.