ఇంజినీరింగ్ విద్యార్థులకి ఓరియంటేషన్ సెమినార్ ఇవ్వమని ఓ ఇన్విటేషన్ వచ్చింది. రవాణా,వసతి సౌకర్యాలూ వంటివన్నీ వారే సమకూరుస్తామని చెప్పారు. పన్లో పనిగా, ఓ శాలువా షీల్డూ,గీల్డూ.. లాంటివి కూడా ఇస్తారని అక్కడ HOD గా పనిచేసే నా ఫ్రెండు టెంప్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆఫర్ బాగానే ఉంది కానీ, నేను తేల్చుకోలేక పోయిన విషయం – అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ కి ఏం చెప్పాలి? Orientation towards what..? అని.
Continue reading “వ్యక్తిత్వ వికాసం…?”రొటీన్ ఇంటర్వ్యూ – రొటీన్ ఏడుపు
“ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్(MCB)” – ఇది ఇంగ్లండ్ లో, ముస్లింల సంక్షేమం కోసం పని చేసే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ. దీని ఆధ్వర్యం లో దాదాపు 500 ఇతర సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థ కు సెక్రెటరీ జనరల్ గా గత వారం ‘జారా మహమ్మద్’ అనే 29 సంవత్సరాల బ్రిటీష్ మహిళ ఎన్నికైంది. ఇస్లాం-మహిళలు అనే అంశం గురించి సమాజంలో చలామణీలో ఉన్న అభిప్రాయాల దృష్ట్యా చూస్తే ఇదో విప్లవాత్మక విషయమనే చెప్పొచ్చు.
Continue reading “రొటీన్ ఇంటర్వ్యూ – రొటీన్ ఏడుపు”