భారత ఉపఖండానికి వైశ్రాయ్ గా ఉన్నవారిలో, హత్య చేయబడ్డ ఏకైక వైశ్రాయ్ ఎవరు?
దీనికి సమాధానం – లార్డ్ మయో. ఇది సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఇంపార్టెంట్ బిట్- అని కోచింగ్ సెంటర్లలో చెప్తుంటారు.ఎవరు చంపారు, ఎందుకు చంపారు వంటి వివరాలలోకి మాత్రం ఎవరూ వెల్లరు. ఒకవేళ ఎవరైనా డౌట్ అడిగినా, ఏవో వ్యక్తిగత కారణాలతో ఎవరో చంపేశారులెమ్మని దానిని దాటవేస్తారు.
గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్!!!
ఇది అందరూ వినే ఉంటారు.. .. గాంధీ స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఎగ్జాం రాస్తున్నప్పుడు.. డీఈవో ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు – స్కూల్ టీచర్ గాంధీని పక్కోడి పేపర్లో కాపీ కొట్టమని చెప్తే – గాంధీ కాపీ కొట్టకుండా, నాకు రాదని చెబితే – డీఈవో మెచ్చుకున్నాడనీ.. అంచేత, పిల్లలెవరూ పక్కోల్ల పేపర్లలో కాపీ కొట్టకూడదనీ… అలా మొదటిసారి గాంధీ గురించి విన్నట్లు గుర్తు. ఆ తర్వాత , మా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రతీ ఆగస్టు 15, జనవరి 26 స్కూల్ ఫంక్షన్లలో, ఓ పక్క ఫక్షన్ తర్వాత పంచబోయే చాక్లెట్లను తలచుకుంటూనే, మరో పక్క వృద్ధ టీచర్లందరూ తన్మయత్వంతో గాంధీ,నెహ్రూ వంటీవారి స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్తుంటే – ఆసక్తిగా వినడం – ప్రతీ సంవత్సరం జరిగిన రొటీన్ తంతు. ఆ రకంగా – గాంధీ,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,,భగత్ సింగ్, సరోజినీనాయుడు,మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,టంగుటూరి ప్రకాశం పంతులు,చంద్రశేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు.. వీల్లల్లో ఎవరేం చేశారో ఎగ్జాక్ట్ గా తెలీకున్నా.. వీరందరూ మన తరుపున బ్రిటీషోల్లతో పోరాడి స్వాతంత్ర్యం సాధించారనీ, వీల్లందర్లోకి గాంధీ హీరోచితంగా పోరాడారు కాబట్టి ఆయన జాతిపిత అయ్యారనీ – నా పాఠశాల చదువు నాకు నేర్పించింది.
Continue reading “గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్!!!”