గత వారం రోజుల్లో, మూడు ఇంట్రెస్టింగ్ వార్తలు కనిపించాయి.
1.Najlaa S. Al-Radadi అనే సౌదీ అరేబియా ప్రొఫెసర్, నానో టెక్నాలజీ లో అనేక పరిశోధనలు చేసింది. మూడు పేటెంట్లు తన పేరుమీద రిజిస్టర్ చేసుకుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లకు ఇచ్చే స్కాలర్షిప్ వరుసగా రెండో సంవత్సరం ఈమెకు దక్కింది. క్యాన్సర్ సంబంధ పరిశోధనలో ఆమె చేసిన పరిశోధనకు గుర్తుగా ఒక మెడికల్ వర్సిటీ ఆమెను మొమెంటోతో సత్కరించిన ఫోటో వార్త నెట్ లో వైరల్ అయింది.
2.పాకిస్తాన్ లో ఓ మహిళా పైలట్ సొంతంగా విమానాన్ని నడిపి రికార్డ్ సృష్టించింది.
3.సౌదీ అరేబియా లో, 10 మంది కొడుకులు+9మంది కూతుర్లు గల ఒక తల్లి, మెడిసిన్ లో డాక్టరేట్ కంప్లీట్ చేసింది. అంటే, 19మంది పిల్లల్ను కంటూ, ఆల్రెడీ పుట్టిన పిల్లల ఆలనా పాలనా చూస్తూనే, ప్యారలల్ గా ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివింది.
ఈ మూడింటిలో కామన్ విషయం ఏమంటే – ఈ ఫీట్లు సాధించిన ముగ్గురు మహిళలూ పూర్తి బుర్ఖా/నికాబ్ తో ఉండటం. అంటే, ముఖం కూడా కనిపించకుండా పైనుండి కింది దాకా బట్టలు ధరించడం.