వెల్డన్ బీజేపీ – గుడ్ లక్ సాధ్విప్రఞాసింగ్!!
==========================
ఈ ఎన్నికల్లో గెలవాలని, నేను కోరుకున్నఅబ్యర్థులు ఇప్పటివరకూ ఇద్దరు– కణయకుమార్, ప్రకాష్ రాజ్. ఇప్పుడు మరోమూడో అబ్యర్థి కూడా గెలవాలనికోరుకుంటున్నాను – ఆమె – సాధ్వీ ప్రఞాసింగ్. ఈమె బీజేపీ తరుపున భోపాల్నుండీ పోటీ చేస్తుంది. మొదటి ఇద్దరూగెలిచే అవకాశాలు చాలా తక్కువ. కానీఈ మూడో అభ్యర్థి గెలిచే అవకాశంమాత్రం చాలా చాలా ఎక్కువ.
ఈమె గురించి తెలియాలంటే – అభినవ్భారత్ అనే సంస్థ, మాలేగావ్ పేలుల్లు,సంఝవ్తా ఎక్స్ప్రెస్ రైల్లో పేలుడు,మక్కామజీద్, అజ్మీర్ పేలుల్లు వీటన్నిటి గురించీతెలుసుండాలి.
2006 లో, మహారాష్ట్రాలోని మాలేగావ్లో మసీదులో పేలుడు జరిగి 40 మందిచనిపోయారు.
2007 లో, భారత్–పాక్ మధ్య తిరిగేసంఝవ్తా రైల్లో బాంబు పేలి 70 మందిచనిపోయారు. తర్వాత జరిగిన,హైదరాబాద్ లోని మక్కా మసీదు బాంబుపేలుడు, అజ్మీర్ దర్గా బాంబు పేలుల్లగురించి తెలిసిందే.
యధాలాపంగా, పేల్లులు జరిగిన మరుసటి రోజునే సిమీ, లష్కరే తోయిబా,జైసే మహమ్మద్, హర్కతుల్ ముజాహిద్వంటి వివిధ అరబిక్ పేర్లు తెరమీదికిరావడం, చాలా మంది ముస్లింలనుఇండ్లలో నుండీ పోలీసులుఎత్తుకెళ్ళడమూ, మీడియా ‘తీవ్రవాదులుదొరికేశారని ‘ ప్రకటించడమూ, చక చకాజరిగిపోయాయి.
కానీ, హేమంత్ కర్కరే అనే ఓ మహారాష్ట్రఐపీయస్ ఆఫీసర్ కి దొరికిన కూపీ నిపట్టుకుని లాగితే, దాని వెనకే పెద్ద డొంకేకదిలింది. సాధ్వీ ప్రగ్ఞాసింగ్, స్వామీఅసిమానంద్, కల్నల్ పురోహిత్, సునీల్జోషీ వంటి వారి అరెస్టులు వేగంగాజరిగిపోయాయి. వీరందరూ,ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు. ఏంప్లాన్స్ చేశారు. ఎవరి పాత్ర ఏమిటి,ఇవన్నీ డీటైల్ గా బయటికి వచ్చాయి.పక్కాగా చార్జ్ షీట్ దాఖలయ్యేసమయంలో, హేమంత్ కర్కరే ముంబై పైజరిగిన తీవ్రవాద దాడిలో ప్రాణాలుకోల్పోయారు. ఆయన ఎలా చనిపోయారుఅనేది ఇంకో పెద్ద కథ. ఓపికున్నోల్లుగూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి. లేదంటే ‘హూ కిల్డ్ హేమంత్ కర్కరే’ అనే పుస్తకంచదవండి.
పైన అరెస్టైన వారిపేర్లలో ఒకటి స్వామీఅసిమానంద్. ఈయన్ను ఓ కేసువిచారణ నిమిత్తం హైదరాబాద్లోని చెర్లపల్లిజైలుకు తీసుకొచ్చారు. జైల్లో అతనికికలీం అనే యువకుడుపరిచయమయ్యాడు. చాలా మృదుస్వభావి. అందరితో కలుపుగోలుగాఉండేవాడు. వృద్ధుడనే కారణంతో స్వామికి కూడా చాలా సపరిచర్యలు చేసేవాడు.ఒకానొకరోజు “ఏ కేసు మీద నిన్ను అరెస్టుచేశారని” కలీం ని స్వామి అడిగాడు. – “మక్కా మసీద్ పేలుళ్ళ కేసు”- అని కలీంచెప్పగానే, స్వామి అసిమానంద్ షాక్అయ్యాడు. తనకు అస్సలు ఏమాత్రంసంబంధం లేని కేసులో జైల్లో మగ్గుతున్నకలీం పై ఎక్కడలేని సానుభూతి కలిగింది.తాను ఎంత పెద్ద పాపం చేస్తున్నాడోఅర్థమైంది. వెంటనే మెట్రోపాలిటన్మెజిస్ట్రేట్ ముందు కు వెళ్ళి, పేలుళ్ళవెనుక జరిగిన తతంగమంతాపూసగుచ్చినట్లు వివరించాడు. ఇదిఅధికారిక రికార్డుల్లో నమోదైంది. మీడియాలోనూ హేడ్లైన్స్ లో వచ్చింది.అఫ్కోర్స్ ఆ తర్వాత కొన్నేల్లకు ఆయన – “అబ్బే గతంలో నేను చెప్పిందంతాతూచ్.. నాకు పేలుళ్ళగురించి అస్సలేంతెలీదు” అని మాట మార్చారు. ఇది వినిజడ్జిగారూ, NIA, CBI, వీరందరూ… “తూచా.. ఐతే పర్లేదు” – అని ఆయనరెండో సారి చెప్పిందాన్ని నమ్మేసి,మొదటిసారి చెప్పిందాన్ని ఇగ్నోర్ చేశారు.ఆ తర్వాత, ప్రభుత్వాలు మారడం, పైనపేర్కొన్న నిందితులపై ఒక్కో కేసూకొట్టేయడం, అందరూ పునీతులుగాబయటికి రావడం.. అంతా తెలుగుసినిమా క్లైమాక్స్ లాగా.. హ్యాపీ ఎండింగ్అన్నట్లు.
ఆ రకంగా బయటికి వచ్చిన సాధ్వీ ప్రగ్ఞాసింగ్ ఇప్పుడు భోపాల్ లో ఎంపీగా పోటీచేస్తుంది. నేను ఈమె గెలవాలనికోరుకోవడానికి అసలు కారణం, ఆమెపోటీ చేస్తున్నది కాంగ్రెస్ ని ఇన్నాల్లూనడిపిన ముసలి నక్కల్లో ఒకరైనదిగ్విజయ్ సింగ్ మీద. ఇప్పుడు ఈముసలి నక్క, సాధ్వీకి వ్యతిరేకంగా ఎలాప్రచారం చేస్తాడా అనేది ఆసక్తికరమైనఅంశం. ఆమె తీవ్రవాది కాబట్టి ఆమెకుఓట్లేయొద్దని అనలేడు. ఎందుకంటే, ఆమెతీవ్రవాది ఐతే, ఇంతకు ముందుకేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏంపీకాయని ఎవరైనా నిలదీసిఅడుగుతారు. ప్రజలడక్కున్నా, అర్నాబ్గోస్వామీ లాంటి విలేఖరములుగొంతుచించుకుని మరీ అడుగుతారు.దీనికి సమాధానం కాంగ్రెస్ దగ్గర లేదు.పైగా, కేవలం హిందువుని ఐనందుకేకాంగ్రెస్ తనని జైలు పాలు చేసిందనీ,దానికి బుద్ధి చెప్పమనీ సాధ్వీ ప్రగ్ఞా సింగ్ప్రతి మీటింగ్లోనూ తన గోడువెల్లబోసుకుంటుంది. ఆ రకంగా ఇదికాంగ్రెస్ కి చావు దెబ్బ.
అన్నట్లు, ఇక్కడే ‘మౌత్ కీ సౌదాగర్’ సంగతి గుర్తుకొస్తుంది.
2002 గుజరాత్ ముస్లిం నరమేధంతర్వాత జరిగిన గుజరాత్ ఎన్నికలప్రచారంలో, సోనియా గాంధీ, నరేంద్రమోడీని మౌత్ కా సౌదాగర్( చావులతోవ్యాపారం చేసేవాడు) అని చాలా సార్లుపిలిచింది. “నేను సరైన పనే చేశాను. కానీసోనియా గంధీ, మీ సాటి గుజరాతీనిపట్టుకుని మౌత్ కా సౌదాగర్ అంటుందిచూశారా” , అని మోడీ వగలమారిడైలాగులు విసిరారు. మొత్తానికి ఆఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆమెమోడీని మౌత్ కా సౌదాగర్ అనబట్టే , మోడీ కి గుజరాతీల్లో సానుభూతివచ్చిందనీ, సోనియా గుజరాత్ అల్లర్లనుప్రస్తావించకుండా ఉండాల్సిందనీ,దిగ్విజయ్ సింగ్ లాంటి నక్కలుతీర్మానించేశాయి. దాని ఫలితంగా, 2007గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో , సోనియాగాంధీ గుజరాత్ అల్లర్ల ప్రస్తావనమాటమాత్రం కూడా లేకుండా ప్రచారంచేసింది. ఆ రకంగా మోడీపై గుజరాత్అల్లర్ల మరక తొలగిపోవడంలో కాంగ్రెస్ఇతోధికంగా సహాయం చేసింది.
ముస్లింలు నిందితులుగా ఉన్న కేసుల్లోమాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఆఘమేఘాలమీద విచారణలు, శిక్షలు–
NIA,CBI,STA, కోర్టులు, న్యాయ వ్యవస్థ,సాయుధబలగాల్లో సెక్యులరిజానికితూట్లు పొడిచేలా, మెజారిటీమతభావజాలం చొచ్చుకుపోతున్నసంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, తనకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లుఉండటం–
ప్రతీ అంశాన్నీ రాజకీయంగా మనకుబెనిఫిటా, కాదా అనే చూడటం – ఇవీకాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ విధానాలు.ఇలాంటి కాంగ్రెస్ రాజకీయాలకునిలువెత్తు ప్రతినిధి దిగ్విజయ్ సింగ్.ఇనాల్లూ ఈ రాజకీయాలకు ముస్లింలు,ఇతర మైనారిటీలే బలయ్యారు.మొదటిసారి దాని ప్రత్యక్ష ఫలితాన్నిదిగ్విజయ్ సింగ్ అనుభవించబోతున్నాడు. వెల్డన్ బీజేపీ,గుడ్ లక్ సాధ్వీ ప్రగ్ఞా సింగ్.
-శుక్రవారం.ఇన్.