ఇస్లామోఫోబియా — న్యూటన్ ఫర్స్ట్ లా!!!

ముస్లిం మహిళలకు అన్యాయం జరిగిపోతుందని తెగ ఇదైపోతూ, వారిపై వళ్ళమాలిన ప్రేమ , సానుభూతి సునామీ కురిపిస్తున్న ఫేసుబుక్కు పురప్రముఖుల కోసం ఈ పోస్టు.

“ఇస్లాం లో మహిళల హక్కులు” అనే జకీర్ నాయక్ స్పీచ్ లో, మీరు తెగ ఇదైపోతున్న అన్ని అంశాల నిజానిజాల గురించి వివరంగా చెప్పి ఉన్నాడు, కాస్త చూడండయ్యా అంటే, అబ్బే… జకీర్ నాయక్ అంటే మాకు గిట్టదు అంటారు . సరే అతన్ని మరచి పోదాం. WOMEN RIGHTS IN ISLAM అని యూటూబ్ లో టైప్ చేస్తే బొచ్చెడు మంది స్పీచులు వస్తాయి. అందరూ ఖురాను, హదీస్ల ఆధారంగానే చెప్పి ఉంటారు తప్ప, సొంతంగా ఎవరూ ఏమీ చెప్పేది ఉండదు.

ఐనా, మహిళల హక్కుల గురించి మొగోల్లు గొప్పలు చెప్పుకోవడమేంటి, కామెడీ కాకపోతే. కాబట్టి, FOR A CHANGE- ఇస్లాంలో మహిళల హక్కుల గురించి మహిళలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇందులోనూ పుట్టు ముస్లిం మహిళలు చెప్తే, పాపం ఆవిడ వెనకాల తుపాకీ పెట్టి చెప్పిస్తున్నారు.. అయ్యో..పాపం అని మళ్ళీ వీరి గుండె చెరువైపోద్ది కదా.. కాబట్టి మళ్ళీ ఇంకో చేంజ్..

ఇక్కడ షేర్ చేస్తున్న వీడియోల్లో స్పీచులిస్తున్న మహిళలెవరూ ముస్లిం ఇల్లలో పుట్టిన వారు కాదు. పైగా, స్టేజిపై తమ కిడ్నీలో రాళ్ళు కరిగిపోయేలా చేశారు కాబట్టి తాము ముస్లింగా మారామనో, తమకు క్యాన్సర్ నయమైందనో, తమ దయ్యం వదల గొట్టారని తాము ముస్లింలుగా మారామనో.. వీరెవరూ చెప్పరు. ఇదంతా, ఎలాంటి జిమ్మిక్కులూ/ఎమోషనల్ డ్రామాలూ లేని, ప్యూర్ లాజికల్ థింకింగ్..

1. Myriam Francois & Yvonne Ridley
Myriam Francois:
ఈమె Cambridge University లో BA, Georgetown Universityలో MA Honours, Oxford University లో DPhil చేసింది. సినీ నటిగా కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ పనిచేసింది. క్రిష్టియన్ కుటుంబంలో పుట్టింది. ఇస్లాం గురించి స్టడీ చేసి ముస్లింగా మారింది. ఇస్లాం లో మహిళలగురించి ఆమె ఏం తెలుసుకుందో ఆమె మాటల్లోనే వినండి.
Yvonne Ridley:
ఈమె బ్రిటీష్ వనిత. జర్నలిస్టు. The Sunday Times కి పని చేస్తున్నప్పుడు, తాలిబాన్ ల గురించి రిపోర్టింగ్ చేయడానికి, బురఖా ధరించి రహస్యంగా ఆఫ్గనిస్తాన్లోకి ప్రవేశించింది. అక్కడ తాలిబన్లకు చిక్కి వారి బందీగా 11 రోజులు ఉండి, తర్వాత బ్రీటన్-పాక్ రాయబారంతో విడుదలైంది. ఈ 11 రోజులూ అక్కడి అనేక మహిళలతో మాట్లాడిన విషయాలు, తాలిబన్లు తనని ట్రీట్ చేసిన విధానం ఆమె కు ఇస్లాం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని కలిగించాయి. కొన్నేళ్ళ ఇస్లాం స్టడీ తర్వాత ఆమె కూడా ముస్లిం గా మారింది.

ఇస్లాం లో తమకు నచ్చిందేమిటో Myriam Francois & Yvonne Ridley ల జాయింట్ సెషన్లో ఇక్కడ చూడండి.

2. Lisa Killinger
ఈమె అమెరికాలోని ప్రఖ్యాత University of IOWA లో డాక్టరేట్ చేసింది. క్రిష్టియన్ కుటుంబంలో పుట్టింది. కొన్నాలు Agnostic Christian గా ఉండింది. తర్వాత ఇస్లాం గురించి తెలుసుకుని, రీసెర్చ్ చేసిమరీ ముస్లిం గా మారింది.
ఇస్లాం లో మహిళల స్థానం ఏమిటో ఈమె మాటల్లో వినండి.

3.Theresa Corbin
ఈమె కూడా క్రిష్టియానిటీ నుండి నాస్తికత్వానికి, ఆ తర్వాత 4 ఏళ్ళ పాటు ఇస్లాం ని స్టడీ చేసి, ముస్లింగా మారిన అమెరికన్. CNN పత్రికలో, ఫెమినిజం డిమాండ్ చేసే అన్ని హక్కులూ ఇస్లాం ఆల్రెడీ ముస్లిం మహిళలకు ఇచ్చిందని వివరిస్తూ ఆమె రాసిన వ్యాసం చదవండి.
http://edition.cnn.com/2014/10/14/opinion/muslim-convert-irpt/index.html
అట్లే, ఇస్లాం ఆమెకు ఎందుకు నచ్చిందో వివరించే మరో లెక్చర్ ఇక్కడ –

‘మాట్లాడే ముందు, దాని గురించి తెలుసుకోవాలనే చిన్న కమిట్మెంట్ ‘ ఉండాలి గానీ, యూటూబ్లో ఇలాంటి వీడియోలు, కొశ్చెన్-ఆన్సర్ సెషన్లు కోకొల్లలుగా దొరుకుతాయి.

సరే ఇప్పుడు న్యూటన్ మొదటి నియమం గురించి మాట్లాడుకుందాం:

“వస్తువు తను ప్రస్తుతం ఉన్న స్థితిలో మార్పును వ్యతిరేకిస్తుంది/ప్రతిఘటిస్తుంది” – ఇదీ స్థూలంగా న్యూటన్ ఫర్స్ట్ లా.
ఇంటర్లో ఈ సూత్రాన్ని చదివినప్పుడు తట్టలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే – ఈ సూత్రం మనిషి ఆలోచనా విధానానికి కూడా అతికినట్లు సరిపోతుందనిపిస్తుంది. మనిషి మనసు, ఒక pattern of thinking కి అలవాటు పడ్డాక, దాని నుండి అంత ఈజీగా పక్కకు రాదు. ఆ ప్యాటర్న్ నే ఫాలో కావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఆ ప్యాటర్న్ నుండి పక్కకు తప్పించడానికి దోహదం చేసే External Forcesతో అది ఘర్షనకు దిగుతుంది.
అట్లే, పొద్దున లేచినప్పట్నుండీ, ఇస్లాం గురించి నెగెటివ్ వార్తల్ని వినీ,వినీ.. వాటి గురించి ఇతరులకు కూడా చాటింపు వేసీ,వేసీ.. ఇలా ఓ ప్యాటర్న్ కి అలవాటు పడ్డవారికి, ఇలాంటి ఎన్ని వీడియోలు చూపినా ఎలాంటి ఉపయోగం ఉండదు. వాల్లసలు దానిని ఓపెన్ కూడా చేయరు. ఐనా సరే, ఏదో ఓ చిన్న ప్రయత్నం. తమ సానుభూతి సునామీని, ISLAMOPHOBIC OUTBURST ని కాస్తైనా తగ్గించుకుంటారేమోనని ఓ చిన్న ఆశ. అంతే.

-మహమ్మద్ హనీఫ్.
10/13/2017

Leave a Reply

Your email address will not be published.